Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50%కి చేర్చింది. దీని వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (FDలలో) పెట్టుబడి పెట్టేవారిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే FDలు కలిగి ఉన్నవారిపై ఈ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చు. రెపో రేటు పెంపు అనేది ఇప్పటికే బుక్ చేసుకున్న FD పెట్టుబడిపై వడ్డీ రేటును మార్చలేదు. ఎంచుకున్న కాలపరిమితి వరకు రేట్లు స్థిరంగానే ఉంటాయి. కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్‌బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50%కి చేర్చడం ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ గా చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు.
రెపో రేటు పెంపుతో బ్యాంకులు సాధారణంగా తమ విచక్షణ మేరకు డిపాజిట్ రేట్లను సవరిస్తాయి. కొత్త డిపాజిట్ దారులు అధిక రేటును పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్ చేసిన వారికి పాత రేటు ఉంటుంది. రెపో-రేటు పెంపు చివరికి డిపాజిట్ల కోసం పోటీ పడుతున్నందున, కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర డిపాజిట్ ఉత్పత్తులపై వడ్డీ రేట్లను పెంచడానికి బ్యాంకుల మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది. అధిక రెపో రేటు బ్యాంకుల నిధుల వ్యయాన్ని పెంచుతుంది, ఇది డిపాజిట్ల కోసం మరింత చురుకుగా పోటీ పడేలా వాటిని ప్రేరేపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా రాబోయే నెలల్లో FD రేట్లు పెరిగే అవకాశం ఉంది.

చిన్న బ్యాలెన్స్ షీట్లు కలిగిన బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచడంలో ముందుండవచ్చని పేర్కొంటున్నారు. అయితే పెద్ద బ్యాంకులు మరింత క్రమంగా ముందుకు సాగవచ్చ అంచనా వేస్తున్నారు. వెంటనే దీర్ఘకాలిక మెచ్యూరిటీలలో లాక్ చేయకుండా, వివిధ కాలపరిమితులలో FDలను విడతలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిది. కొత్త నిధులను కేటాయించే ముందు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల రేట్ల సవరణలను గమనించడం మఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
25 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపు వల్ల ప్రయోజనం తక్షణమే కనిపించకపోయినప్పటికీ, కాలక్రమేణా మెరుగైన FD రాబడులకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. బ్యాంకులు క్రమంగా డిపాజిట్ రేట్లను సర్దుబాటు చేస్తున్నందున, డిపాజిటర్ల విషయానికొస్తే, ఓపిక, సరైన సమయపాలన అధిక రాబడులను పొందడంలో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
