చిన్న మొత్తంతో పొదుపు ప్రారంభించాలనుకునే వారికి స్మాల్ సేవింగ్స్ స్కీంకు ప్రత్యామ్నాయంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్(PPF) ఉంది. ఇక్కడ రోజుకు రూ.200 పెట్టుబడి పెట్టడం ద్వారా 20 సంవత్సరాల్లో రూ.14 లక్షలు తీసుకోవచ్చు. చిన్న పొదుపు పథకానికి ప్రత్యామ్నాయమైన ఈ అకౌంట్ ద్వారా తక్కువ పెట్టుబడితో పెద్ద మొత్తాన్ని జమ చేసుకోవచ్చు.
పీపీఎఫ్ ప్రయోజనాలతో పాటు పీపీఎఫ్ పథకం కింద మీ పెట్టుబడిపై భద్రత హామీ ఉంటుంది. ఈ పథకం కింద వచ్చిన వడ్డీపై ఆదాయపు పన్ను ఉండదు. నామినీని ఎంచుకోవచ్చు. పోస్టాఫీస్‌లు, బ్యాంకుల్లో 15 సంవత్సరాలకు గాను ఈ ఖాతా తెరవవచ్చు. మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే వెసులుబాటు ఉంది.

ప్రయోజనాలు
పీపీఎఫ్ స్కీం కింది ఈఈ పీపీఎఫ్ ఖాతాపై పెట్టుబడికి భద్రత హామ ఉంటుంది.
ఈ పథకం కింద వచ్చిన వడ్డీ మీద ఆదాయపు పన్ను ఉండదు.
నామినీని ఎంచుకోవచ్చ.
ఎంపిక చేసిన పోస్టాఫీస్‌లు, బ్యాంకుల్లో ఈ ఖాతాను తెరువవచ్చు.

ఎంత మొత్తం అవసరం
రూ.500 మొత్తంతో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి.
సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఖాతాలోని వడ్డీ రేట్లను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వడ్డీ రేటును 7.1 శాతంగా నిర్ణయించింది.

రూ.14 లక్షలు..
ఈ పథకం కింద రోజుకు రూ.200 ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.6000 అవుతుంది. అంటే ఏడాదికి రూ.72,000 అవుతుంది. ఇలా పదిహేనేళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.10,80,000 అవుతుంది. 20 సంవత్సరాల పాటు ఒకే వడ్డీ రేటుతో వడ్డీ ఇస్తే మొత్తం రాబడి రూ.14.40 లక్షలు వస్తుంది. మీ పెట్టుబడిపై అదనపు ప్రయోజనం ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications