స్టాక్ మార్కెట్లు భారీ రికవరీ దిశగా వెళ్తోందా? దేశీయ ఆర్థిక రికవరీ, కరోనా వ్యాక్సీన్ అంశం సానుకూలంగా ఉన్నప్పటికీ మార్కెట్లు ప్రతికూల ధోరణిని కనబరుస్తున్నాయా? భారీ దిద్దుబాటు ఉంటుందా లేక కాస్త దిద్దుబాటు బాట పట్టి ఆ తర్వాత స్తబ్దుగా ఉంటుందా? అంటే ఇప్పటి ఇప్పుడు భారీ దిద్దుబాటు ఉంటుందని చెప్పలేమని, ఈ వారం సూచీలు నష్టాల్లో ముగిసినా... గతవారం లాభాలు మాత్రమే హరించుకుపోవచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ పరిణామాలు, వ్యాక్సినేషన్, కరోనా కేసుల అంశానికి భిన్నంగా ఇటీవల సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో స్వల్ప దిద్దుబాటు మాత్రమే కనిపిస్తోందని చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం ఆసక్తిగా ఉన్నారని, అందుకే మార్కెట్లు ఈ వారం నష్టాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆ లాభాలు ఆవిరి...
సెన్సెక్స్ గతవారం వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. కానీ ఈ వారం మూడు సెషన్‌లలోనే 800 పాయింట్ల మేర పతనమైంది. ఈ వారం ప్రారంభంలో (సోమవారం) భారీగా నష్టపోయినప్పటికీ తిరిగి కోలుకుంది. దీంతో దాదాపు స్థిరంగా ముగిశాయి. సోమవారం సెన్సెక్స్ 29 పాయింట్ల అతి స్వల్ప లాభాల్లో ముగిసింది. నిన్న (మంగళవారం) సెన్సెక్స్ ఓ దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది.
సాయంత్రానికి 600 పాయింట్ల మేర కోలుకొని, చివరకు 400 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. నేడు కూడా సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి 450 పాయింట్ల నష్టం వద్ద ట్రేడ్ అయింది. గత గురువారం 60,000 మార్కు దాటి చరిత్ర సృష్టించిన సెన్సెక్స్ ఇప్పుడు 59,200 స్థాయికి పడిపోయింది. గతవారం వచ్చిన లాభాలు ఈ వారం మూడు రోజుల్లోనే దాదాపు ఆవిరైనట్లుగా భావించవచ్చు.

59,000 నిలుపుకుంటుందా?
సెన్సెక్స్ 60,000 దిగువకు పడిపోయినప్పటికీ, 59,000 మార్కును నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా మరీ అంత బలమైన ప్రతికూల ప్రభావాలు లేవు. దేశీయంగా వ్యాక్సినేషన్ వేగవంతంగా కనిపిస్తోంది. కరోనా కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి. దీనికి తోడు కార్యకలాపాలు పుంజుకొని, ఆర్థిక రికవరీ వేగవంతమవుతోంది.
నియామకాలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా బలమైన ప్రతికూల అంశాలు లేనందున సూచీలు మరింతగా పడిపోయే అవకాశాలు అంతగా లేవని అంటున్నారు. బలమైన ప్రతికూల అంశాలు ఉంటే మాత్రం 59,000 దిగువకు పడిపోవచ్చునని అంటున్నారు. కానీ కేవలం ప్రాఫిట్ బుకింగ్ వల్ల భారీగా పడిపోకపోవచ్చునని చెబుతున్నారు.

అలా అయితే మరింత పడిపోవచ్చు
అంతర్జాతీయంగా ఈ వారం కాస్త అననుకూల పరిణామాలు ఉన్నాయి. అయితే దీనికి ప్రాఫిట్ బుకింగ్ తోడవడంతో సూచీలు భారీగా నష్టాల్లోకి వెళ్తున్నాయి. నిన్న ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ నష్టాలు కనిపించాయి. నేడు అందుకు భిన్నం. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈ ఏడాది మే నెల తర్వాత అక్కడి సూచీలు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. దీనికి ప్రాఫిట్ బుకింగ్ కూడా కలిసింది.
అమెరికా టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ ఐదు శాతం పెరిగాయి. చైనాలో విద్యుత్ కోతల నేపథ్యంలో ఆసియా సూచీలు నష్టపోయాయి. మరిన్ని రోజులు విద్యుత్ సమస్యలు కొనసాగితే సప్లై చైన్‌లో సమస్యలు తలెత్తవచ్చు. ఇది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉంటే సూచీలు మరింత పడిపోవడం చూస్తామని అంటున్నారు.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications