పేటీఎం ఐపీవోలో పాల్గొని, ఇప్పటి వరకు ఆ షేర్లను అట్టిపెట్టుకున్న వారు, ప్రారంభంలో కొనుగోలు చేసిన వారు విలవిల్లాడుతున్నారు. పేటీఎం స్టాక్ అంతకంతకూ క్షీణిస్తోంది. ఈ స్టాక్ ఐపీవోకు వచ్చి నాలుగు నెలలు పూర్తవుతోంది. ఈ కాలంలో దాదాపు ఏ దశలోను కనీసం ఇష్యూ జారీ చేసిన ధరకు లేదా లిస్టింగ్ తేదీ నాటికి వెళ్లలేదు. కరోనా థర్డ్ వేవ్, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి బహిర్గత అంశాలతో పాటు పేటీఎం స్టాక్ ఇష్యూ ధర అధికంగా ఉందనే వాదనలు, ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు వంటి అంతర్గత అంశాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో పేటీఎం స్టాక్ 70 శాతానికి పైగా క్షీణించింది.

రూ.2150 నుండి రూ.585 స్థాయికి
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ షేర్ మంగళవారం 12.71 శాతం క్షీణించి రూ.589 వద్ద ముగిసింది. సోమవారం నాటి సెషన్‌లో రూ.675 వద్ద ముగిసింది. నిన్న రూ.85కు పైగా తగ్గింది. గత రెండు సెషన్‌లలోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బీఎస్ఈలో రూ.11,809.43 కోట్లు తగ్గింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38.43 కోట్లకు తగ్గింది. లిస్టింగ్ రోజు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లకు పైగా ఉంది. రూ.2150 ఇష్యూ ధర కాగా, లిస్టింగ్ రోజు రూ.1950కి పడిపోయింది. పేటీఎం నవంబర్ మూడో వారంలో లిస్ట్ అయింది. పేటీఎం స్టాక్ నిన్న ఓ సమయంలో రూ.585 దిగువకు కూడా పడిపోయింది.

రూ.9300కు పైగా నష్టం
పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఒక్కో షేర్‌కు రూ.2150 కేటాయించారు. లాట్‌కు ఆరు షేర్ల చొప్పున ఇన్వెస్టర్లు రూ.12,900 చెల్లించారు. ప్రస్తుత ధర ప్రకారం ఆరు షేర్ల వ్యాల్యూ రూ.3534 అవుతుంది. అంటే లిస్టింగ్‌లో పాల్గొని, ఇప్పటికీ అట్టిపెట్టుకున్న ఒక్కో ఇన్వెస్టర్ ఆదాయం భారీగా పడిపోయినట్లే. ఒక లాట్‌ను రూ.12900కు కొనుగోలు చేస్తే ఇప్పుడు రూ.3534 చేతిలో ఉంటాయి. అంటే రూ.9300కు పైగా నష్టపోయినట్లు.
అయితే లాంగ్ టర్మ్ కోసం ప్రస్తుత డిప్ సమయంలో కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణుల సూచన.

పేటీఎంకు దెబ్బ మీద దెబ్బ
పేటీఎం స్టాక్ పైన దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో మార్కెట్ ఊగిసలాటలో ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారీగా నష్టపోయింది. దీనికి తోడు పేటీఎం బ్యాంకు పైన ఆర్బీఐ మూడోసారి కఠిన చర్య తీసుకున్నది. కొత్త యూజర్లను చేర్చుకోవద్దని సూచించింది. పెనాల్టీ విధించబడిన వాటిలో పేటీఎం పేమెంట్ బ్యాంకు మాత్రమే లేదు. గతంలో ఇతర సంస్థలు ఉన్నాయి.
పేటీఎం బ్యాంకు డేటా చైనా కంపెనీలకు లీక్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను పేటీఎం కొట్టి పారేసింది.
ఆదివారం పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ స్పీడ్ డ్రైవింగ్ కేసులో అరెస్టై, బెయిల్ పైన విడుదలయ్యారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications