బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగా బంగారం ధరలు పెద్దగా లాభాలను నమోదు చేయడంలేదు. గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ముగిసింది. ఫెడ్ రిజర్వ్ బాండ్స్ కొనుగోలు తగ్గింపు ప్రకటన, తదనుగుణంగా తర్వాత పెరిగే వడ్డీ రేట్లు, బంగారానికి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా భావించే క్రిప్టో కరెన్సీకి డిమాండ్ పెరగడం, డాలర్ వ్యాల్యూ పెరగడం వంటి అంశాలు బంగారంపై గతవారం తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే రూ.46,000 దిగువన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్, ఆ తర్వాత లాభపడినప్పటికీ, చివరకు మళ్లీ అదే స్థాయిలో ముగిసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.61.00 (0.13%) క్షీణించి రూ.45995.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.119.00 (-0.26%) తగ్గి రూ.46058.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల వద్ద ప్రారంభమై, చివరి సెషన్‌లో ఇదే స్థాయిలో ముగిసింది.

ఈ వారం కీలకం
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఈ వారం(రేపటి నుండి ప్రారంభమయ్యే వారం) నిజమైన పరీక్షను ఎదుర్కొంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్, జీడీపీ క్యూ2 నివేదిక, పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్(PCE) నేపథ్యంలో బంగారం అప్రమత్తంగా కదలవచ్చు. PCE ధర సూచీ ద్రవ్యోల్భణాన్ని కొలిచే సాధనంగా యూఎస్ ఫెడ్ ప్రాధాన్యతను ఇస్తోంది.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ అధ్యక్షతన నవంబర్ నెలలో జరగనున్న యూఎస్ ఫెడ్ రిజర్వ్ మీటింగ్ నిర్ణయాలకు ఇది కీలకంగా ఉంటుంది. ఈ పరిణామాలు బంగారంపై ప్రభావం చూపుతాయి. గతవారం ఫెడ్ ప్రకటన, చైనా ఎవర్ గ్రాండ్ పరిణామాలు, కరోనా కేసులు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో బంగారానికి ఈ వారం చాలా కీలకం.

1700 డాలర్ల దిగువకు పడిపోయినా...
OANDA సీనిర్ మార్కెట్ అనలిస్ట్ ఎడ్వార్డ్ మోయా మాట్లాడుతూ.. బంగారం ఈ సంవత్సరం 1700 డాలర్ల స్థాయిని నిలబెట్టుకుంటుందని, కొన్నిసార్లు 1680 డాలర్లకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత వేగంగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల మాట అని చెబుతున్నారు. ప్రస్తుతం ధర 1750 డాలర్ల స్థాయిలో ఉందని, 1800 స్థాయిని కోల్పోయిందని చెప్పారు.
భారత్ విదేశీ మార్కెట్ నుండి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ధరలపై అంతర్జాతీయ ప్రభావం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. భారత గోల్డ్ ఇన్వెస్టర్లు ఎప్పటిలాగే వచ్చేవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రత్యేక దృష్టి సారించారని చెబుతున్నారు.

బంగారం ధరలు
22 క్యారెట్ల బంగారం ధరలు రూ.45,240, 24 క్యారెట్ల బంగారం రూ.46,240 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో అతి స్వల్పంగా 0.11 శాతం లాభపడి 1751 డాలర్ల వద్ద, స్పాట్ గోల్డ్ మార్కెట్ 0.42 శాతం క్షీణించి 1751 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్‌లో యూఎస్ డాలర్ ఇండెక్స్ సానుకూలంగా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు..
- Mumbai 22 క్యారెట్ల బంగారం 45,240/- 24 క్యారెట్ల బంగారం 46,240/-
- Delhi 22 క్యారెట్ల బంగారం 45,350/- 24 క్యారెట్ల బంగారం 49,480/-
- Bangalore 22 క్యారెట్ల బంగారం 43,200/- 24 క్యారెట్ల బంగారం 47,130/-
- Hyderabad 22 క్యారెట్ల బంగారం 43,200/- 24 క్యారెట్ల బంగారం 47,130/-
- Chennai 22 క్యారెట్ల బంగారం 43,570/- 24 క్యారెట్ల బంగారం 47,530/-
- Kerala 22 క్యారెట్ల బంగారం 43,200/- 24 క్యారెట్ల బంగారం 47,130/-
- Kolkata 22 క్యారెట్ల బంగారం 45,900/- 24 క్యారెట్ల బంగారం 48,600/-
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications