ఒకప్పుడు మన తాతలు 60 ఏళ్ల వయస్సు వరకు ఉండేవారు. అప్పటికి వారు ఆర్థికంగా స్థిరపడి వుంటారు, పిల్లలు కూడా స్థిర పడి ఉంటారు, ఆ సమయంకి ఇంటి లోన్ కూడా పూర్తవుతుంది, జీవితం నిదానమవుతుంది. కానీ ఇప్పుడు? ఈ తరం 45 ఏళ్లకే 60 వయస్సులో పడే ఒత్తిడిని తట్టుకోవాల్సి వస్తోంది. ఇదే చెబుతున్నారు చార్టెడ్ అకౌంటెంట్ కనన్ బహల్.

ఆయన తన లింక్డ్ఇన్ లో ఓ చిన్న వాక్యం పోస్ట్ చేశారు. "45 is the new 60". ఆ చిన్న వాక్యంలో ఎంతో గాఢ ఉంది. ఎందుకంటే ఇది నేడు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి స్థితిని చెప్పే వాక్యం.
జీవిత వేగం పెరుగుతున్న తరుణంలో, 45 ఏళ్ల వయస్సు అనేది నిజానికి జీవితంలో, మూడో దశ ప్రారంభం కావాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారిపోయింది. పిల్లల చదువు కోసం స్కూల్ ఫీజులు భరించాల్సి ఉంది, ఇంటి లోన్ EMIలు నిత్యం ఒత్తిడిగా మారాయి, తల్లిదండ్రుల ఆరోగ్యానికి కావలసిన వైద్య ఖర్చులు కూడా భారం పెడుతున్నాయి. కార్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు పెరుగుతుండగా, ఆరోగ్యంపై వస్తున్న భయాలు మరో వైపు మనసును కలవరపెడుతున్నాయి. ఈ సమస్త బాధ్యతల నడుమ, 45 ఏళ్ల వయస్సులోనే మనం ఓ 60 ఏళ్ల వృద్ధుడిలా శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నాం.
అసలు సమస్య ఎక్కడుందంటే మన తరం ఖర్చులు తగ్గించకుండా, జీవన ప్రమాణాలు పెంచుకుంటోంది. చదువు పూర్తవగానే గాడ్జెట్ల పైన ఖర్చులు, 30ల్లోనే విస్తృతమైన జీవితం కోసం పెద్ద రిస్క్‌లు, పొదుపు లేకుండా స్టేటస్ కోసం ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల మనసుకి భారంగా ఇబ్బందిగా తయారవుతుంది. ఈ అలవాట్లు మన 45ఏళ్ల జీవితాన్ని 60వ వయస్సుగా మార్చేస్తున్నాయి.
చార్టెడ్ అకౌంటెంట్ కనన్ బహల్ గారు అన్నట్లుగా, "రిటైర్మెంట్ అనేది వయస్సుతో కాకుండా, మన జేబులో ఉన్న స్థిరతతో ఉంటుంది" అనే మాట ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 45ఏళ్ల వయస్సు అంటే జీవితం నెమ్మదిగా సేదతీరే దశగా మారాలి. అప్పటికే మనం డబ్బు కోసం పని చేయడం కాదు, డబ్బు మన కోసం పని చేసేలా ఉండాలి. దానికి బదులుగా పొదుపు ఒక అలవాటుగా ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణ మన జీవనశైలిలో భాగం కావాలి. ఈ దశలో మన ఆర్థిక నిర్ణయాలు ఎంత తెలివిగా ఉంటాయో, భవిష్యత్తులో మన ప్రశాంతత కూడా అంతే స్థిరంగా ఉంటుంది. జీవితం మీద నియంత్రణ కోల్పోతే, వయస్సుతో సంబంధం లేకుండా మనం ఓపికను కోల్పోతాం. వయస్సు గణాంకమే కానీ, మానసిక శ్రమకి అది లెక్క కాదు. ఈ రోజుల్లో 45 అంటే 60 వయస్సు అనుభూతి రావడం సహజమే, కానీ మన ఆర్థిక నిర్ణయాలతో దానిని మార్చుకోవచ్చు.
ఇప్పుడు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, రేపటి ప్రశాంత జీవితం పునాదులు. జీవన వ్యయం పెరుగుతుండటం, AI వల్ల సంప్రదాయ ఉద్యోగాలు మారిపోతుండటం వంటి పరిస్థితుల్లో, నిపుణులు రిటైర్మెంట్ ప్లానింగ్‌ను మాత్రమే కాకుండా, అసలు ఆర్థిక భద్రత అంటే ఏమిటి అనే దానిపై కూడా కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.
ప్రస్తుత కాలంలో భారత మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు అలవాటు కొంత మేర ఉన్నా, అది పటిష్ఠంగా లేకపోవడం ఆందోళనకరం. చాలామంది తాము సంపాదించే మొత్తంలో చిన్న శాతమే పొదుపుగా ఉంచుతున్నారు. నెలసరి ఖర్చులు, లైఫ్‌స్టైల్ అవసరాలు, లోన్లు వంటి కారణాల వల్ల పొదుపు ఒక ముఖ్యమైన జీవనశైలి భాగంగా మారడం లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్రణాళిక వేసే అలవాటు చాలా తక్కువగా కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం, నెల ఆదాయంలో కనీసం 20% నుండి 30% వరకు పొదుపుగా పెట్టుబడి చేయడం అవసరం. దీని ద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రతతోపాటు, మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే, చాలా మందికి ఇప్పటికీ పొదుపు అనేది ఓ అవసరం లేని విషయం అనిపిస్తోంది, ఇది మారాల్సిన పరిస్థితి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications