నేటి కాలంలో మధ్యతరగతి వారికి అప్పు అనేది కామన్ అయిపోయింది. మంచి ఉద్యోగం చేస్తున్నవారికైనా, స్థిరమైన ఆదాయం ఉన్నవారికైనా కొన్ని సందర్భాల్లో రుణం (లోన్) తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. వివాహాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువు, అత్యవసర అవసరాలు వంటి కారణాలతో పర్సనల్ లోన్లు ఎక్కువగా వినియోగంలోకి వచ్చాయి. అయితే, లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ రుణ భారం ఎవరి మీద పడుతుంది? కుటుంబ సభ్యులు చెల్లించాలా? లేక మాఫీ చేయించుకోవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
దీనికి నిపుణులు పలు సమాధానాలు ఇస్తున్నారు...ముందుగా పర్సనల్ లోన్ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. పర్సనల్ లోన్ అనేది సాధారణంగా ఎలాంటి ఆస్తి పూచీకత్తు లేకుండా ఇచ్చే అన్‌సెక్యూర్డ్ లోన్. అందువల్ల లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు చెల్లింపు బాధ్యత పరిస్థితులను బట్టి మారుతుంది.

చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్ ఇచ్చే సమయంలో లోన్ ఇన్సూరెన్స్ లేదా క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తాయి. లోన్ తీసుకున్న వ్యక్తి ఈ ఇన్సూరెన్స్‌ను తీసుకుని ఉంటే, అతని మరణం తర్వాత మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీనే బ్యాంక్‌కు చెల్లిస్తుంది. ఈ పరిస్థితిలో కుటుంబ సభ్యులపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. అందుకే పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, లోన్‌కు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సందర్భంలో కూడా కుటుంబ సభ్యులు తప్పనిసరిగా personal loan చెల్లించాల్సిందే అన్న నియమం కూడా లేదు. కానీ లోన్ తీసుకున్న వ్యక్తికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ఆ ఆస్తులపై చట్టబద్ధంగా క్లెయిమ్ చేయవచ్చు. ఆస్తులను విక్రయించి, అందులో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలిన మొత్తం ఏదైనా ఉంటే అది చట్టబద్ధ వారసులకు అందజేస్తారు.
ఇక లోన్‌కు కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. కో-అప్లికెంట్ అనేది లోన్‌కు సంయుక్తంగా బాధ్యత వహించే వ్యక్తి అని చెప్పవచ్చు. ప్రధాన రుణగ్రహీత మరణించినా, కో-అప్లికెంట్‌పై పూర్తి లోన్ చెల్లింపు బాధ్యత అయితే ఉంటుంది. అదే విధంగా లోన్‌కు గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ ఆ గ్యారెంటర్ నుంచి లోన్ మొత్తాన్ని రికవరీ చేసే హక్కు కూడా కలిగి ఉంటుంది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎలాంటి ఆస్తులు లేని పరిస్థితిలో, కో-అప్లికెంట్ లేకుండా, గ్యారెంటర్ కూడా లేకపోతే, కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా తమ డబ్బులతో లోన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భాల్లో బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు లీగల్ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. అయితే వాటికి కుటుంబ సభ్యులు ఏమవుతుందోనని భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చట్టపరంగా వారు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రుణగ్రహీత మరణాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకులు లోన్ మొత్తాన్ని పూర్తిగా లేదా కొంతవరకు మాఫీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది పూర్తిగా బ్యాంక్ విధానాలు, లోన్ మొత్తం, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో అన్ని నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవడం, లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కుటుంబ భద్రతకు చాలా అవసరం. అలా చేస్తే అనుకోని పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications