ఇప్పుడు యువతలో పెట్టుబడులపై ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా SIP (Systematic Investment Plan) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంది ప్రారంభిస్తున్నారు. కానీ, ఇటీవల "Step-Up SIP" అనే మరో ఆకర్షణీయమైన ఆప్షన్ కూడా మార్కెట్లో వచ్చి బాగా పాపులర్ అయ్యింది.
మరి యువత ఇప్పుడు రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ రెండింటిలో ఏది వేగంగా, స్మార్ట్‌గా సహాయపడుతుంది. మీ మొదటి కోటి సాధించేందుకు SIP ట్రావెల్ ఎలా ఉంటుందో చూసేద్దాం.

SIP అంటే ఏమిటి?
సాధారణ SIP అనేది ప్రతి నెలా ఒకే రకమైన మొత్తాన్ని పెట్టుబడి చేయడం. ఉదాహరణకు, మీరు ప్రతి నెల రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, ఆ మొత్తం ఎప్పుడూ ఫిక్స్‌డ్‌గానే ఉంటుంది. మీరు జీతం పెరిగినా, లైఫ్‌స్టైల్ మారినా మీరు ఇంతే పెట్టుబడి పెడతారు. ఉదాహరణకు: రూ. 10,000 మంత్లీ SIP చేస్తే డానికి 12% వార్షిక రిటర్న్స్ అంచనా చేస్తే 20 ఏళ్లలో మీ పెట్టుబడి విలువ సుమారు రూ. 76 లక్షలు అంటే కోటి చేరాలంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి.
స్టెప్-అప్ SIP అంటే ఏంటి?
ఇది ఒక "ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ" ఆప్షన్. ప్రతి సంవత్సరం మీరు SIP మొత్తాన్ని కొద్దిగా కొద్దిగా పెంచుకుంటారు. ఉదాహరణకు, మీరు మొదట రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి ఏడాది దాన్ని 10% పెంచుకుంటూ వెళ్తే రెండో ఏడాది రూ. 11,000 మూడో ఏడాది రూ. 12,100 ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రూ. 10,000 ప్రారంభంతో SIP స్టార్ట్ చేసిన డానికి ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు 12% రిటర్న్స్‌తో 20 ఏళ్లలో మీ పెట్టుబడి విలువ సుమారు రూ. 1.15 కోట్లు అంటే, తక్కువ సమయంలోనే మీరు మీ పెద్ద లక్ష్యం చేరుకోవచ్చు.
సాధారణ SIP మరియు స్టెప్-అప్ SIP మధ్య కీలకమైన తేడాలు కొన్ని ఉన్నాయి. సాధారణ SIPలో మీరు ప్రతి నెలా ఫిక్స్‌డ్‌గా ఒకే మొత్తాన్ని పెట్టుబడి చేస్తారు, అంటే నెలవారీ ఆదాయంలో మార్పు జరిగినా మీ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం స్థిరంగానే ఉంటుంది. అందువల్ల కోటి రూపాయల లక్ష్యం చేరేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ స్టెప్-అప్ SIPలో మీరు ప్రతి సంవత్సరం మీ SIP మొత్తాన్ని కొంత శాతం పెంచుతూ పోతారు. ఇది జీతం పెరుగుదలతో అనుసంధానమై ఉండి, పెట్టుబడిలో ప్రోగ్రెసివ్ డిసిప్లిన్‌ను ప్రోత్సహిస్తుంది. దీంతో లక్ష్యం తక్కువ సమయంలోనే చేరే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ పరంగా చూసుకుంటే, స్టెప్-అప్ SIP చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.
సాధారణ SIPలో మీరు కావాలంటే కొత్త SIPలు ప్రారంభించి మొత్తాన్ని పెంచుకోవచ్చు. కానీ స్టెప్-అప్ SIPలో ఆటోమేటిక్‌గా పెరుగుతుంది, ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది. SIPలు ELSS (Equity Linked Savings Scheme)లో పెట్టుబడి పెడితే, వార్షికంగా 80C కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. SIP మొత్తాన్ని పెంచినా, ఈ ప్రయోజనం కొనసాగుతుంది.
మీరు జీతం పెరుగుతున్న కొద్దీ పెరిగిన ఆదాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే, స్టెప్-అప్ SIP మంచి ఎంపిక. తక్కువ టైమ్‌లో పెద్ద లక్ష్యం చేరుకోవడానికిది మద్దతు ఇస్తుంది. కానీ నెలవారీ ఖర్చులు ఫిక్స్‌గా ఉంటే, సాధారణ SIP కూడా మంచి పెట్టుబడి మార్గంమే. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే SIP మీరు ఎంచుకున్న మార్గాన్ని మైలురాయిగా మార్చేస్తుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications