టర్మ్ ఇన్సురెన్స్ లేదా ఎండోమెంట్ పాలసీ: ఏది ఎంచుకోవాలి?
కుటుంబ భద్రత కోసం చాలామంది ఇన్సురెన్స్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్‌లలో ఇన్సురెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు ఎక్కువ. ఇందులో కూడా ఎండోమెంట్, టర్మ్ పాలసీలు ఉంటాయి. వీటిలో దేనిని ఎంచుకోవాలనే ప్రశ్న చాలామంది ముందు ఉంటుంది. వాస్తవానికి ఈ రెండింటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. ఈ రెండింటి ప్రయోజనాలు తెలుసుకొని, మీ ఆర్థిక అవసరాలకు సరిపోయేదానిని ఎంచుకోండి. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏం ఎదుర్కోవాల్సి ఉంటుందో కచ్చితంగా తెలియదు. మార్కెట్‌లోని వివిధ ఆర్థిక సాధనాలు వినియోగదారులకు పెట్టుబడి, సేవింగ్స్ మార్గాలను అందించడం ద్వారా భవిష్యత్తుకు భద్రతను ఇస్తాయి. ప్రతికూల, ఆర్థిక సంక్షోభం సమయంలో ఇది ఉపయోగకరం.

టర్మ్ ఇన్సురెన్స్
- టర్మ్ ఇన్సురెన్స్ అనేది నిర్దిష్ట కాలం పాటు రక్షణ కవరేజీని అందించే ఆర్థిక రక్షణ సాధనం. ఈ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని అతని కుటుంబం డెత్ బెనిఫిట్‌గా పొందడానికి అర్హులు. పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్స్ లేదా రాబడి ఉండదు. కాబట్టి ఇదో లైఫ్ కవరేజీ కోసం తీసుకునే బీమా సాధనం.

ఎండోమెంట్ పాలసీ
- ఎండోమెంట్ పాలసీ అంటే సంక్షోభ సమయాల్లో రక్షణ, పెట్టుబడి పెట్టిన డబ్బు ఏకకాల వృద్ధి రెండింటినీ అందించే బీమా కమ్ పెట్టుబడి సాధనం. ఈ పాలసీలో నిర్ణీత కాలపరిమితికి ప్రీమియంను చెల్లించాలి. కాలపరిమితి తర్వాత, బీమా తీసుకున్న వ్యక్తి జీవించి ఉంటే ఏకమొత్తంగా కవరేజీ చేతికి వస్తుంది. ఒకవేళ చనిపోతే బీమా కవరేజీ మొత్తం లేదా సమ్ అస్యూర్డ్, బోనస్ సహా డెత్ బెనిఫిట్ కింద నామినీకి ఇస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎండోమెంట్ పాలసీల మీద రాబడి ఉంటుంది. లైఫ్ కవరేజీతో పాటు బోనస్ రూపంలో సొమ్ము వస్తుంది. మృతి చెందితే కుటుంబాన్ని ఆదుకుంటుంది. కాబట్టి కుటుంబ అవసరాలు, ఆదాయాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి.

రెండింటిని కలపవద్దు
మీ డబ్బును పెట్టుబడి పెట్టడం, పెంచుకోవడం అనే లక్ష్యంతో బీమా అవసరాన్ని కలపకూడదు. అందుకే ఒక వ్యక్తి అతని/ఆమె ఆర్థిక లక్ష్యాలను బట్టి బీమా సాధనాలు, ఎండోమెంట్ ప్లాన్స్‌ను పొందాలి. బీమాను మరే ఇతర ఆర్థిక లక్ష్యంతో కలపకూడదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. అందుకే టర్మ్ ఇన్సురెన్స్ వంటి స్వచ్ఛమైన బీమా ఉత్పత్తులు ఎండోమెంట్ ప్లాన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి.


Click it and Unblock the Notifications