SSY Vs MF: సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్స్.. ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..!

కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నావారు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు. పోస్టాఫీస్, బ్యాంకుల్లో ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఒక సంవత్సరంలో కనిష్టంగా రూ.250 గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో భాగంగా 15 సంవత్సరాలు డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పాప వయస్సు 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. ఈ పథకంలో వచ్చే డబ్బులకు పన్ను ఉండదు. అయితే పాప వయస్సు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు పాక్షికంగా డబ్బులు తీసుకోవచ్చు.

ఈ పథకంలో వచ్చే డబ్బు.. మనం పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. మీరు నెలకు రూ.12,500 చొప్పున సంవత్సరానికి రూ.1,50,000 పెట్టబడి 15 సంవత్సరాలు పాటు కొనసాగితే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.22,50,000 పెట్టుబడి పెడతారు. వడ్డీగా రూ.46,77,578 వస్తాయి. మొత్తంగా మీ చేతికి రూ.69,27,578 వస్తాయి. ఇది కచ్చితమైన రాబడి. హామీ ఇచ్చిన మేరకు ఒక్క రూపాయి కూడా తక్కువ రాదు. ఒక వేళ మీరు ఇదే డబ్బును మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఏదైనా ఇండెక్స్ ఫండ్ తీసుకుని అందులో 15 సంవత్సరాల పాటు నెలకు రూ.12,500 సిప్ వేస్తే ఎంత అవుతోందో తెలుసుకుందాం.

SSY Vs MF

మీరు నెలకు రూ.12,500 సిప్ చేస్తే సంవత్సరానికి రూ.1,50,000 కడతారు. ఇలా 15 సంవత్సరాల్లో రూ.22,50,000 పెట్టుబడి పెడతారు. 12 శాతం రాబడి వస్తే ఇందులో వడ్డీ రూ.40,57,200 వస్తుంది. మొత్తంగా రూ. 63,07,200 వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్లపై వచ్చే లాభంపై ట్యాక్స్ ఉంటుంది. ఇందులో కచ్చితంగా 12 శాతం రాబడి వస్తుందని చెప్పలేం. ఎక్కువ రావచ్చు లేదా తక్కువ కూడా రావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కాబట్టి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే వచ్చే రాబడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ రిస్క్ ఉంటుందని కచ్చితంగా గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+