Post Office Schemes Vs Bank Fixed Deposits: పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఏది బెటర్..!
మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చక్కగా సరిపోతాయి. ఇవి రెండూ కచ్చితమైన రాబడిని అందిస్తాయి. స్టాక్ మార్కెట్ పై ఆధారపడి ఉండవు. అయితే వివిధ పథకాలలో వడ్డీ రేట్లు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి. కేవలం సౌలభ్యం ఆధారంగా ఎంపిక చేసుకోవడం వల్ల తక్కువ రాబడితో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం పెద్ద బ్యాంకుల ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొన్ని పోస్ట్ ఆఫీస్ పథకాలు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా అధిక ఎఫ్డి (FD) రేట్లను అందిస్తున్నాయి.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్లు ప్రస్తుతం కాలపరిమితిని బట్టి 6.9 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ విభాగంలో ఐదేళ్ల డిపాజిట్ అత్యధిక రేటును అందిస్తుంది. ఇతర ప్రభుత్వ మద్దతు గల పథకాలు ఇంకా ఎక్కువ రేట్లను అందిస్తున్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. కిసాన్ వికాస్ పత్ర పథకంలో 7.5 శాతం రేటును చెల్లిస్తున్నారు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో భాగంగా 7.4 శాతం వడ్డీని ఇస్తుండగా, PPF ప్రస్తుతం 7.1 శాతం వడ్డీని చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉంది. ఇందులో ఏడాదికి 8.2 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. సుకన్య సమృద్ధి పథకంలో 8.2 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నారు.

బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల విషయానికొస్తే బ్యాంక్ ఎఫ్డి రేట్లు ఆయా బ్యాంకులు, డబ్బును డిపాజిట్ చేసే కాలపరిమితిపై ఆధారపడి ఉన్నాయి. అక్టోబర్ 7, 2026 నాటికి సాధారణ వినియోగదారులకు ఐదేళ్ల ఎఫ్డి రేట్లు హెచ్ డీఎఫ్సీ బ్యాంకు దాదాపు 6.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంకులో 6.50 శాతం,ఎస్బీఐలో 6.05 శాతం పీఎన్బీలో 6.10 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. మూడేళ్ల డిపాజిట్ల విషయానికొస్తే ఈ బ్యాంకుల్లో రేట్లు 6.30 శాతం నుంచి 6.45 శాతం మధ్య ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఇది సంప్రదాయ పెట్టుబడిదారులకు ఉన్న అతిపెద్ద ఆకర్షణలలో ఒకటి. బ్యాంకు డిపాజిట్లకు కూడా రక్షణ ఉంటుంది.
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డిఐసి), ప్రతి డిపాజిటర్కు, ప్రతి బ్యాంకులో రూ. 5 లక్షల వరకు అర్హత గల బ్యాంకు డిపాజిట్లకు, అసలు, వడ్డీ రెండింటినీ కలిపి కవరేజీని అందిస్తుంది. dicgc.org.in కేవలం అధిక రేటు సంపాదించడం కోసం చిన్న బ్యాంకులలో పెద్ద మొత్తాలను డిపాజిట్ చేసేటప్పుడు ఇది ముఖ్యమవుతుంది. దీర్ఘకాలిక భద్రత, పోటీ రేట్ల కోసం చూస్తున్న పొదుపరులకు, పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications