For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lumpsum Or SIP: ఈ రెండింట్లో ఏది బెట్టర్, పన్ను ప్రయోజనం ఎలా?

|

ఈక్విటీ లిక్విడ్ సేవింగ్స్ స్కీం లేదా ELSS అనేది త్రీ ఇయర్ ఆబ్లిగేటరీ లాక్-ఇన్ పీరియడ్ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. ELSSలో ఈక్విటీ ఆస్తుల్లో 80 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. భారతీయ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80సీ పరిధిలోని ఉన్న ఏకైక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ ELSS. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడిదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.1.5 లక్షలు. అంటే ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

ELSS ఫండ్స్

ELSS లేదా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ కోసం మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ పెట్టుబడి మొత్తం మూడేళ్ల కాలానికి ఒకేసారి లాక్ అవుతుంది. మూడేళ్ల తర్వాతనే ఇది అన్-లాక్ చేయబడుతుంది. ఉదాహరణకు మీరు 2019 మార్చి 31వ తేదీన రూ.1.5 లక్షలు ELSSలో డిపాజిట్ చేస్తే కనుక మార్చి 31, 2022 నాటికి ఇది అన్-లాక్ అవుతుంది. ఆ తర్వాత మీరు అందులోనే అలాగే అట్టి పెట్టుకోవచ్చు లేదా విక్రయించుకోవచ్చు. మరోవైపు సిప్(SIP)లో పెట్టుబడులు మార్చి 31, 2022 నుండి ప్రతి నెల ఒకదాని తర్వాత మరొకటి మెచ్యూర్ అవుతాయి. అంటే మార్చి 31, 2023 నాటికి మీ పెట్టుబడులు అన్-లాక్ అవుతాయి.

ఇండివిడ్యువల్స్ ఎవరైనా వన్ టైమ్ పెట్టుబడి లేదా సిప్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఈ రెండింటిలో లాభపడతారు. పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టిన దాని కంటే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తంతో రాబడి కాస్త తక్కువగా ఉంటుంది.

Which Is Better Investment Option in Lumpsum and SIP

సిప్ ప్రయోజనం

SIP(సిప్) పెట్టుబడితో పలు ప్రయోజనాలు ఉన్నాయి. ELSS ఫండ్‌లో ప్రతి నెల పెట్టుబడి ద్వారా మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా ఉండేలా చేస్తుంది సిప్. దీంతో పెట్టుబడిని అలవాటు పెంచుకోవచ్చు.

ELSS ఒక ఈక్విటీ పెట్టుబడి కాబట్టి అస్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్స్ పైన రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక నెలవారీ సిప్స్ అయితే మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఉంటుంది. ఇది క్రమబద్ధమైన పెట్టుబడి అవుతుంది.

మీరు పన్ను కోసం ప్లాన్ చేసుకుంటే ఏడాదిలో రూ.1.50,000 మేర ఇన్వెస్ట్ చేయలి. ఏదేమైనా సిప్స్‌లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.1,50,000 అవుతుంది.

నగదు సమస్య ఉండి, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సిప్స్ మంచి పెట్టుబడి సాధనంగా చెప్పవచ్చు.

పెద్ద మొత్తంలో పెట్టుబడితో ప్రయోజనం

పెద్ద మొత్తంలో (lump sum) పెట్టుబడితోను ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇందుకు చేతిలో డబ్బులు ఉండాలి. స్థిర ఆదాయవనరు లేని వారు ఒకే మొత్తంలో పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడాన్ని పరిగణలోకి తీసుకోవాలి. బిజినెస్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏకమొత్తంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద గణనీయమైన ప్రయోజనాలు పొందవచ్చు. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.1.5 లక్షలు. ఐటీ రిటర్న్స్‌లో దీనిని చూపించవచ్చు. ఇది దీర్ఘకాలిక ELSS పెట్టుబడిపై మంచి రాబడిని అందించవచ్చు.

Which Is Better Investment Option in Lumpsum and SIP

పెద్ద మొత్తం... సిప్.. ఏది బెట్టర్

రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం ప్రమాదస్థాయి. సిప్స్ కొంత మూలధన పెట్టుబడిపై మెరుగైన రక్షణను ఇస్తాయి. అయితే అనుభవజ్ఞుడైన ఇన్వెస్టర్ అయితే అన్నీ పరిశీలించి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్ అయితే సిప్‌ను పెట్టుబడి సాధనంగా అలవాటు చేసుకోవాలి. అయితే మీరు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీరు సమయం చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. సిప్స్ పెట్టుబడికి మాత్రం మార్కెట్ టైమింగ్ అవసరం లేదు.

సిప్స్, పెద్ద మొత్తంలో పెట్టుబడులకు వివిధ లాక్-ఇన్ పీరియడ్స్ ఉంటాయి. సిప్స్ మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటాయి. అయితే ఆయా నెల ఆధారంగా ఉంటాయి. అదే పెద్ద మొత్తంలో పెట్టుబడి అయితే మూడేళ్ల తర్వాత అన్-లాక్ ఉంటుంది.

ఉదాహరణకు మీరు ELSSలో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడికి మూడేళ్ల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. అయితే సిప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్ల తర్వాత ఒక్కొక్కటి (అంటే నెల పెట్టుబడిని బట్టి) మెచ్యూరిటీ వస్తుంది.

ఉదాహరణకు ఓ ఇన్వెస్టర్ సెప్టెంబర్ 1, 2019లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే సెప్టెంబర్ 1, 2022 నాటికి ఇది మెచ్యూరిటీ తీరుతుంది. ఈ మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి మొత్తం తీసుకోవచ్చు.

అదే సమయంలో మీరు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సెప్టెంబర్ 1, 2019న మీరు సిప్ ప్రారంభిస్తే అది మొదటి నెల ఇన్వెస్ట్‌మెంట్. ఆ తర్వాత వరుసగా అక్టోబర్ 1, 2019, నవంబర్ 1, 2019 ఇలా.. ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. వీటి మెచ్యూరిటీ వరుసగా సెప్టెంబర్ 1, 2022, అక్టోబర్ 1, 2022, నవంబర్ 1, 2022న ఉంటుంది. ప్రతి సిప్ పైన మూడేళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది.

సిప్స్ లేదా పెద్ద మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి నియమ, నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ రాబడి లేదా ఆదాయం ఆధారంగా పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవాలి. ELSSని ఎంచుకోవడం ద్వారా సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

English summary

Lumpsum Or SIP: ఈ రెండింట్లో ఏది బెట్టర్, పన్ను ప్రయోజనం ఎలా? | Which Is Better Investment Option in Lumpsum and SIP

A three-year lock-in is required for ELSS or tax-saving funds. With a lump-sum payment, your investment is unlocked all at once three years after purchase.
Story first published: Wednesday, September 8, 2021, 15:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X