ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే డబ్బును భద్రంగా పెట్టుకోని దాన్నుంచి లాభం పొందే సాధారణ మార్గం. కానీ ప్రతి బ్యాంక్ 1-సంవత్సర FD కోసం వేర్వేరు రేట్లు ఇస్తుంది. ఈ చిన్న తేడాలు పెద్ద మొత్తంలో పెట్టిన డబ్బుకు లేదా సీనియర్ సిటిజన్లకు లాభంగా మారవచ్చు. ఇప్పుడు HDFC, ICICI, SBI, Kotak, Federal వంటి బ్యాంకుల 1-సంవత్సర FD రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

అనేక బ్యాంకులు సాధారణంగా 1-సంవత్సర FDsకి సాదారణంగా సమాన రేట్లు ప్రకటిస్తాయి. కాబట్టి, ఏ బ్యాంక్‌లో పెట్టాలి అన్న విషయం మొదట్లో పెద్ద తేడా కనిపించదు. కానీ తాజాగా ప్రకటించిన రేట్లను పరిశీలిస్తే, చిన్న తేడాలు ఉన్నా వాటి ప్రభావం పెద్దదిగా ఉంటుంది, ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే వారు లేదా సీనియర్ సిటిజన్‌లకు, ఎందుకంటే వారికి ఎక్కువ రేట్లు లభిస్తాయి.
ఏ బ్యాంక్ ఎక్కువ ఇస్తోంది?
తాజా బ్యాంక్ వెబ్‌సైట్‌ల డేటా ప్రకారం, కొన్ని ప్రధాన బ్యాంకులు 1-సంవత్సర FDsపై పోటీ రేట్లు ఇస్తున్నాయి.
HDFC బ్యాంక్: సాధారణ ఖాతాదారులకు 6.25%, సీనియర్ సిటిజన్‌లకు 6.75% (జూన్25, 2025 నుండి)
ICICI బ్యాంక్ & Kotak Mahindra బ్యాంక్: HDFC వంటి రేట్లు
Federal బ్యాంక్: సాధారణ ఖాతాదారులకు 6.40%, సీనియర్ సిటిజన్‌లకు 6.90%
SBI (State Bank of India): సాధారణ ఖాతాదారులకు 6.25%, సీనియర్ సిటిజన్‌లకు 6.75% (July 15 నుండి)
ఉదాహరణకి, మీరు ఒక సంవత్సరం కోసం రూ. 1,00,000 బ్యాంకులో FDలో పెట్టారనుకోండి. HDFC లేదా SBI వంటి బ్యాంకులు సాధారణ ఖాతాదారులకు 6.25% వార్షిక వడ్డీ ఇస్తున్నాయి. అంటే ఒక సంవత్సరానికి మీరు వసూలు చేసే వడ్డీ = రూ. 1,00,000 × 6.25% = రూ. 6,250.
ఇప్పుడు, Federal Bank లేదా Union Bank 6.40% వడ్డీ ఇస్తుంటే, అదే రూ. 1,00,000 పై వడ్డీ = రూ. 6,400. అంటే, ఈ చిన్న 0.15% తేడా వల్ల మీరు ఒక్క ఏడాదిలో రూ. 150 అదనంగా పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 6.75% వంటి తక్కువ వడ్డీ తేడాలు ఉన్నప్పుడు, అదే రూ. 1,00,000పై వడ్డీ = రూ. 6,750 అవుతుంది. దీని ద్వారా, సాధారణ వడ్డీతో పోలిస్తే రూ. 500 వరకు అదనపు లాభం వస్తుంది.
ఇలాంటి చిన్న తేడాలు పెద్ద మొత్తంలో డిపాజిట్ పెట్టినప్పుడు గణనీయమైన లాభాన్ని అందించగలవు. ఉదాహరణకి, రూ.10 లక్షల FDలో 0.15% తేడా = రూ. 1,500 అదనపు వడ్డీ. కాబట్టి, FDలో పెట్టుబడులు వేసేటప్పుడు బ్యాంకుల రేట్ల మధ్య తేడాలు జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా, మీరు మీ వడ్డీ ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications