ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు ఉంటేనే కొన్ని మనం అనుకున్నవి చేయగలుగుతున్నాం. ఈ కాలంలో సామాన్యుడు ఎంత సంపాదించినా నెలాఖరుకి వచ్చేసరికి ఇంకా ఖర్చులు ఉంటూనే ఉన్నాయి. అలాగే ఎంత సంపాదించినా అది ఇంటి ఖర్చులకు అలాగే పిల్లల చదువులకే అయిపోతుంది. ప్రస్తుతం స్కూల్ ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలు ఇవన్నీ చాలా మంది తల్లిదండ్రులని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రతి ఏడాది స్కూల్ ఫీజులు పెంచడం వల్ల సామాన్యులకి ఆర్థిక భారం పెరుగుతోంది. పై చదువుల ఫీజులు మరింత కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కాలేజీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫీజులు పెంచడం చాలా మంది తల్లిదండ్రులకి తలనొప్పిగా మారింది. మీరు కూడా మీ పిల్లలకు మంచి విద్యను అందించాలనుకుంటే టైంకి డబ్బు రెడీ చేసుకొని ఉండాలి. ఇందుకు ఎక్కువ కాలంలో మంచి రిటర్న్ ఇచ్చే పెట్టుబడి మాధ్యమంలో పెట్టుబడి పెట్టాలి. పిల్లల చదువుల ఖర్చుల కోసం మూడు బెస్ట్ పెట్టుబడి ప్లాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ అవసరాన్ని బట్టి, సేవింగ్స్ బట్టి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
1. చైల్డ్ యులిప్(ULIP Plans)
మీ పిల్లల చదువుల ఖర్చుల కోసం మీరు చైల్డ్ యులిప్‌లో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయవచ్చు. ఈ స్కిం ప్రయోజనాల గురించి మాట్లాడితే మీకు మంచి పెట్టుబడి, ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్, ఈక్విటీ మార్కెట్ బెనిఫిట్స్ అందించేల పని చేస్తుంది. చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ (ULIP) పిల్లలకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీ ఫండ్ చెల్లిస్తారు. ఇంకా తల్లి/తండ్రి లేదా అతని చట్టపరమైన సంరక్షకుల మరణంపై ఇన్సూరెన్స్ మొత్తం పిల్లలకు అందిస్తారు.

2. ఎండోమెంట్ ప్లాన్
ఈ ప్లాన్ కింద హామీ మొత్తంపై బోనస్ రూపంలో ఫిక్స్డ్ రిటర్న్ అందీస్తుంది. ఈ రకమైన ప్లాన్ గ్యారెంటీ రిటర్న్‌లతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తుంది. ఈ ప్లాన్స్ సాధారణంగా పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత బోనస్‌తో పాటు హామీ మొత్తంలో 25%కి సమానంగా నాలుగు పేమెంట్స్ చేస్తాయి. ఎండోమెంట్ ప్లాన్‌లాగానే ఈ ప్లాన్‌లు సాధారణంగా కొంత కాల వ్యవధిలో సాధారణ రిటర్న్స్ తో వస్తాయి. దీనిని ఎక్కువగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఉండే బెస్ట్ అప్షన్ గా సిఫార్సు చేస్తుంటారు.
3. సుకన్య సమృద్ధి యోజన
మీరు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ కూతురు లేదా కొడుకు పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఈ స్కింలో పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు రూ.250తో కూడా మీ కూతురు పేరు మీద అకౌంట్ తెరవొచ్చు. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ప్రస్తుతం, ఈ పథకం 8.50% వడ్డీని అందిస్తోంది.
4. SIP ద్వారా పెట్టుబడి
SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి మీరు మీ పిల్లల చదువు కోసం సులభంగా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయవచ్చు. మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు లాంగ్ టర్మ్ లో గొప్ప రిటర్న్ పొందవచ్చు.
బెస్ట్ ప్లాన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి
ఇన్సూరెన్స్ రకం: మీ పిల్లల కోసం బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకునే సమయంలో పరిగణించాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ముందుగా, తల్లిదండ్రులు వారికీ బీమా ప్లాన్ కావాలా, ఎడ్యుకేషన్ ప్లాన్ కావాలా లేదా రెండింటికి కలిపి కావాలా అని గుర్తించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మరణించిన సమయంలో ఇవి పిల్లలకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి.
ఫుల్ కవరేజ్ అమౌంట్: ఇది మీ కూతురు/కొడుకు ఏ కోర్సు చదవకానుకుంటున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోని మీరు పిల్లల ట్యూషన్ ఫీజులు, ఖర్చులు ఇతర విషయాలతోపాటు చూడాలి.
కట్టాల్సిన ప్రీమియం: ఇది తల్లిదండ్రుల ఆదాయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ప్లాన్‌లో ముఖ్యమైన అంశం. ఎప్పుడైనా మీ బడ్జెట్‌కు సరిపోయే ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పరిమితికి మించి ఖర్చు చేయాల్సిన బలవంతం ఉండదు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications