మీ IPO దరఖాస్తు తిరస్కరించకూడదంటే ఇవి తెలుసుకోండి
ప్రైమరీ మార్కెట్ ఐపీవోలతో దమ్ము రేపుతోంది. వరుసగా ఐపీవోలు వస్తున్నాయి. దాదాపు ప్రతి వారం ఒకటి రెండు కంపెనీలు లిస్ట్ అవుతున్నాయి. ఐపీవో అలాట్ చేసిన వారు కూడా మంచి లాభాలను పొందుతున్నారు. అయితే ఏదైనా కొత్త ఐపీవోకు వచ్చినప్పుడు ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వారు పలు అంశాలను తెలుసుకోవాలి. ఐపీవోకు దరఖాస్తు చేసుకోవడానికి ముందే కంపెనీ వివరాలను తెలుసుకోవడం సహజం. అయితే ఎంతో ఆసక్తితో దరఖాస్తు చేసుకున్న ఈ ఐపీవో అప్లికేషన్ తిరస్కరించబడకుండా ఉండటం ముఖ్యం. ఇన్-కంప్లీట్, డూప్లికేట్ వంటి దరఖాస్తులు లేకుండా తిరస్కరించబడవు. కాబట్టి ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వారు పలు అంశాలు తెలుసుకోవాలి.

ఎక్కువ దరఖాస్తులు వద్దు
- ఒక అప్లికేషన్‌కు మించి దరఖాస్తు చేయవద్దు: మీరు వివిధ బ్రోకరేజీ సంస్థల వద్ద రెండు లేదా అంతకుమించి డీమ్యాట్ అకౌంట్స్‌ను కలిగి ఉంటే, ఒక ఐపీవోకు ఒకటికి మించి దరఖాస్తు చేసుకుంటే కనుక ఒకే అప్లికెంట్ దరఖాస్తు చేసుకున్నట్లుగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఆ బిడ్‌ను ఇన్-వాలిడ్‌గా భావించవచ్చు. అప్పుడు మీకు ఐపీవో షేర్స్ వచ్చే అవకాశం ఉండదు.

పాన్ లింకింగ్ అకౌంట్
ఐపీవో దరఖాస్తు కోసం డబ్బులు ట్రాన్సుఫర్ తప్పనిసరి. కాబట్టి ఈ ప్రక్రియలో బ్యాంకరు పాత్ర చాలా కీలకం. ఫండింగ్, రీఫండింగ్‌కు ఈ బ్యాంకు ముఖ్యం. దరకాశ్తు తిరస్కరణ సమయంలో ఐపీవో దరఖాస్తు డబ్బును తిరిగి చెల్లించడంలో బ్యాంకర్ పాత్ర ఉంటుంది. కాబట్టి దరఖాస్తుదారు ప్రతి ఐపీవో అప్లికేషన్ పాన్ కోసం అదే పాన్ లింక్ అయిన బ్యాంకు ఖాతా నుండి చెల్లింపు లేదా బ్లాక్ పేమెంట్ (ASBA ప్రాసెస్) చేయాలి. లేదంటే తిరస్కరించబడుతుంది.

రూ.2 లక్షలక ుమించి ఇన్వెస్ట్ చేస్తే
కొత్తగా లిస్ట్ అయిన ఐపీవోలో రూ.2 లక్షలకు మించి పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడిన HNI ఇన్వెస్టర్ ప్రాస్పెక్టస్‌లో సూచించిన విధంగా HNI ఇన్వెస్టర్‌కు ప్రైస్ బాండ్ ఎగువ ధర వద్ద షేర్లను కేటాయించినందున కట్ ఆఫ్ ప్రైస్ ఎంపికను చెక్ బాక్స్ చేయకూడదు. కట్ ఆఫ్ ధర అనేది రిటైల్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దరఖాస్తు కోసం ఎప్పుడూ ఎంచుకున్న కట్ ఆఫ్ ప్రైస్. ఐపీవో దరఖాస్తు ఫారంను సమర్పించే సమయంలో ప్రతి ఐపీవోలో రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టగల రిటైల్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కట్ ఆఫ్ ధరను ఎంచుకోవాలి. కట్ ఆఫ్ ధర అనేది ఆఫర్ ప్రైస్. కంపెనీ తన వాటాలను దరఖాస్తు షేర్ హోల్డర్లకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది.

డీమ్యాట్ అకౌంట్
ఇన్వెస్టర్ డీమ్యాట్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. ఐపీవో దరఖాస్తు చేసే సమయంలో పెట్టుబడిదారు ఈ విషయాన్ని గమనించాలి. డీమ్యాట్ వివరాలు సరిగ్గా పూర్తి చేయాలి. ఈ అకౌంట్ నిద్రాణస్థితిలో ఉండరాదు.

కాలపరిమితికి మించి
సాధారణంగా సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడం కోసం ఆఫ్ లైన్ మోడ్‌లో చివరి నిమిషం వరకు ఐపీవో దరఖాస్తులను అంగీకరిస్తాయి. ఈ చివరి నిమిషంలో ఐపీవో అప్లికేషన్లు పూర్తిగా తిరస్కరించబడతాయి. అలాగే లాటరీ విధానంలో పరిగణించబడవు.


Click it and Unblock the Notifications