స్టాక్ మార్కెట్‌తో ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలి, అధిక రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలి?
విజయవంతమైన దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉండటం అంత ఈజీ కాదు. ఇది చాలా క్లిష్టమైన, కష్టమైన పని. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌పోలియోతో దీర్ఘకాలిక సంబంధం ఉండవచ్చు. పెట్టుబడులకు సంబంధించి ఇది మీ జీవితంలో ముఖ్యమైన భాగం అవుతుంది. పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే సమయంలో స్టాక్ పెట్టుబడులు ఉపయోగపడవచ్చు. మీరు మీ వ్యక్తిగత, ఆర్థిక సంబంధాలను రెండింటిని విజయవంతంగా ముందుకు సాగించాలని భావిస్తే ఇక్కడ కొన్ని విషయాలను చూడండి...

దీర్ఘకాలంలో మంచి రాబడులు
మీకు ఏది ఉత్తమ మార్గంగా కనిపిస్తుందో దానిపై దృష్టి సారించాలి. సాధ్యమైనంత వరకు షార్ట్ టర్మ్ కోసం ఆలోచన మానుకోవాలి. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ మీ దీర్ఘకాలిక సంబంధంగా పరిగణించాలి.మీరు ఎంచుకునే పెట్టుబడి సాధనం మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఉండాలి. చాలామంది పెట్టుబడి పోర్ట్‌పోలియోను ప్రారంభించి, వెంటనే ఇతరుల పోర్ట్‌పోలియోతో పోల్చడం ప్రారంభిస్తారు. కానీ అది ఎప్పుడూ సరైనది కాదని భావించాలి. ఇతరులకు వర్కవుట్ అయింది మీకు కాకపోవచ్చు. ఎవరి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వారు ఇన్వెస్ట్ చేయాలి. మీరు మీ పోర్ట్ పోలియోలో భాగంగా ఈక్విటీని ఎంచుకుంటే మీ పోర్ట్‌పోలియో పనితీరును ఇతరులతో పోల్చకూడదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అంటే ఓపిక అవసరం. దీర్ఘకాలంలో మంచి రాబడులు అందిస్తాయి.

దీర్ఘకాలిక ఆలోచన
మీ పెట్టుబడులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు మీ జీవిత భాగస్వామితో ఇంట్లో గొడవ జరిగితే కాసేపు అలా బయటకు వెళ్లి రావాలి. అప్పుడు సమస్య కుదుడపడుతుంది! అంటే మీ జీవిత భాగస్వామి ఆవేదనను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నారు. అలాగే మీ పెట్టుబడుల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. మీరు హోమ్ వర్క్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. ఆ పెట్టుబడిపై రాబడికి సమయం తీసుకోవాలి. అస్థిరత లేదా చిన్న ప్రతికూల పరిమాణాలకే వెనక్కి వెళ్లడం సరైన చర్య కాదు. అలాగే, స్వల్పకాలిక ఆలోచనలపై కాకుండా దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకు వెళ్లాలి. స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడిన పెట్టుబడి. కానీ సరైన ఎంపిక ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడిపై మంచి రిటర్న్స్ ఉంటాయనేందుకు ఎన్నో నిదర్శనాలు.

దీర్ఘకాలిక సంబంధం..
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అంటే స్వల్పకాలిక సంబంధంగా భావించవద్దు. ఇది దీర్ఘకాలిక సంబంధం. మార్కెట్ కొన్ని సందర్భాల్లో తీవ్ర ఉత్తానపతనాలు ఎదుర్కొంటుంది. అలాంటప్పుడు భావోద్వేగాలకు గురి కావొద్దు. దీర్ఘకాలిక పెట్టుబడి అయితే ఎక్కువగా మంచి ఫలితం రావడానికే అవకాశం ఉంటుంది. పెట్టుబడికి సంబంధించి దీర్ఘకాలిక విధానాన్ని ఎంచుకోవాలి. స్వల్పకాలం అయితే ముందుకు వెళ్లడం కష్టతరమే.


Click it and Unblock the Notifications