Fixed Deposits: ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మధ్య తేడా ఏంటి..!

బ్యాంకుల సాధారణ FD రేట్ల కంటే ప్రత్యేక కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే వాటి నుంచి వచ్చే అదనపు రాబడి చాలా తక్కువగా ఉండవచ్చని, డిపాజిట్ నుంచి ముందుగానే నిష్క్రమించడానికి అయ్యే ఖర్చులు ఎక్కువ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు ఈ మధ్యకాలంలో 444 రోజులు, 555 రోజుల వంటి అసాధారణ కాలపరిమితులతో డిపాజిట్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృద్ధి 444 రోజుల కాలపరిమితిని అందిస్తుండగా, ఇండియన్ బ్యాంక్ IND సెక్యూర్ కూడా 444 రోజుల డిపాజిట్ అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 555 రోజుల BOB గోల్డెన్ గోల్ డిపాజిట్‌ను అందించింది.

ఇటువంటి పథకాలు సాధారణ డిపాజిటర్లకు దాదాపు 6.45-6.75% రాబడిని అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లు దాదాపు 0.5 శాతం పాయింట్లు అధికంగా పొందుతున్నారు. అయితే పెట్టుబడిదారులు కేవలం ప్రధాన రేటుకే పరిమితం కాకుండా, పోల్చదగిన సాధారణ FDపై లభించే అసలు ప్రీమియంను కూడా లెక్కించాలని నిపుణులు చెబుతున్నారు. ఎస్బీఐ 444-రోజుల అమృత్ వృష్టి 6.45 శాతం వడ్డీని అందించగా, దాని సాధారణ ఒకటి నుంచి రెండు సంవత్సరాల డిపాజిట్ బకెట్ 6.25 శాతం వడ్డీని అందించింది. అందువల్ల ఈ వ్యత్యాసం కేవలం 20 బేసిస్ పాయింట్లు మాత్రమే. 444 రోజుల కాలానికి రూ.5 లక్షల పెట్టుబడిపై ఈ ప్రత్యేక ఎఫ్ఢీ దాదాపుగా రూ.40,472 వడ్డీని అందిస్తుంది.

FD

అదే 6.25 శాతం వడ్డీతో సాధారణ ఎఫ్డీపై వచ్చే రూ.39,179తో పోలిస్తే ఇది ఎక్కువ. అంటే పన్నుకు ముందు అదనపు వడ్డీ దాదాపు రూ.1,293 ఉంటుంది. 30 శాతం పన్ను శ్లాబ్ కింద ఈ అదనపు ఆదాయం దాదాపు రూ.905కు పడిపోతుంది. మెచ్యూరిటీకి ముందే పెట్టుబడిదారునికి డబ్బు అవసరమైతే ఈ ప్రయోజనం పూర్తిగా మాయమైపోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత రూ.5 లక్షల ప్రత్యేక FDని రద్దు చేసుకుంటే, పెట్టుబడిదారుడు తక్కువ కాలానికి వర్తించే తక్కువ వడ్డీ రేటుతో పాటు, గడువుకు ముందే డబ్బు ఉపసంహరించుకున్నందుకు జరిమానాను కూడా చెల్లించాల్సి రావచ్చు.

ఉదాహరణంగా ఎస్బీఐ 0.5 శాతం పాయింట్ల జరిమానా తర్వాత ప్రభావవంతమైన రేటు 5.75%గా ఉంది. 6.25% వడ్డీతో తీసుకునే సాధారణ ఒక సంవత్సరం FD నుంచి వచ్చే సుమారు రూ.31,990తో పోలిస్తే, దీని ఫలితంగా వచ్చే వడ్డీ రూ.29,376గా అంచనా వేశారు. ప్రత్యేక కాలపరిమితి గల డిపాజిట్‌ను ఎంచుకుని ఒక సంవత్సరం తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకోవడం ద్వారా పెట్టుబడిదారుడు దాదాపు రూ.2,614 నష్టపోవచ్చు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డిపాజిట్లలో ప్రత్యేక ఎఫ్డీ తప్పనిసరిగా అత్యధిక రాబడినిచ్చేది కాదని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2026 నాటికి 444-రోజుల డిపాజిట్లపై IDBI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ 6.60% వడ్డీని అందిస్తున్నాయి. ఇది ఎస్బీఐ 6.45% రేటు కంటే ఎక్కువ.

పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు గడువుకు ముందే డబ్బు విత్‌డ్రా చేసుకునే నిబంధనలు, కచ్చితమైన మెచ్యూరిటీ తేదీ, పన్ను తర్వాత వచ్చే రాబడిని తనిఖీ చేసుకోవాలి. సాధారణ బ్యాంక్ డిపాజిట్లకు వర్తించే నిబంధనల ప్రకారమే ప్రత్యేక కాలపరిమితి గల డిపాజిట్లకు కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. DICGC ఇన్సూరెన్స్ కింద వడ్డీతో సహా ఒక్కో బ్యాంకులో ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షల పరిమితి ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+