ఇండియాలో ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతదో తెలుసా.. లైట్ తీసుకుంటే రిస్కే..
మీరు భారతీయులై ఉండి ఇండియాలో నివసిస్తే పన్ను చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. మీరు వ్యాపారం లేదా ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు పై తప్పకుండ పన్ను చెల్లించాలి. పన్నులు చెల్లించడం వల్ల జాతీయ రాబడి పెరగడమే కాకుండా ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు చాల రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పన్ను ఎగవేత లేదా చెల్లించనందుకు పెనాల్టీ, వడ్డీ రికవరీ ఇంకా చట్టపరమైన చర్యలు విధించే నిబంధన కూడా ఉంది. భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు రెండు ఆదాయపు పన్ను విధానాల మధ్య ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. వీటిలో పాత పన్ను విధానం లేద కొత్త పన్ను విధానం. ప్రతి పన్నుకు స్వంత నియమాలు అలాగే పన్ను స్లాబ్‌లు ఉన్నాయి, మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బెస్ట్ అప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పన్ను చెల్లించకుంటే మీపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసా...
పన్ను చెల్లించనందుకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చంటే
ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా (సెక్షన్ 234F): ఇచ్చిన గడువు తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే జరిమానా విధించవచ్చు. మీ మొత్తం ఆదాయం రూ.5 లక్షలు దాటితే జరిమానా రూ.5,000. రూ.5 లక్షల వరకు ఆదాయానికి రూ.1,000 జరిమానా. సెక్షన్ 234A రిటర్న్ దాఖలు చేయడంలో ఆలస్యం చేసినందుకు నెలకు 1% చొప్పున వడ్డీ వసూలు చేయవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు (సెక్షన్ 156): ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 156 కింద డిమాండ్ నోటీసును జారీ చేయవచ్చు, దీనిలో బకాయి ఉన్న మొత్తాన్ని నిర్ణీత గడువులోపు చెల్లించాలి. ఈ నోటీసులను విస్మరిస్తే చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.
పన్ను ఎగవేత పై జరిమానా (సెక్షన్ 270A, 276CC): ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా పన్ను ఎగవేత చేస్తే కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఆదాయానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిన సెక్షన్ 270A కింద తక్కువగా నివేదించిన పన్నులో 50% నుండి 200% వరకు జరిమానా విధించబడుతుంది.
ఆస్తుల స్వాధీనం: ఆదాయపు పన్ను నోటీసులను పాటించని పక్షంలో బకాయిలను రికవరీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ మీ ఆస్తి లేదా వాహనాలు వంటి విలువైనవి ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు.
ట్రావెల్ బ్యాన్: పన్నులు చెల్లించకపోవడం మీ క్రెడిట్ స్కోర్‌పై నెగటివ్ ప్రభావాన్ని చూపుతుంది అలాగే భవిష్యత్తులో లోన్స్ లేదా క్రెడిట్ తీసుకోవడం కష్టతరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీ అంతర్జాతీయ ప్రయాణాలని బ్యాన్ చేస్తూ పాస్‌పోర్ట్ జారీని రద్దు చేయవచ్చు.
విచారణ ఇంకా జైలు శిక్ష: పన్ను ఎగవేత కేసులో కోర్టు విచారణ జరపవచ్చు, అలాగే భారీ జరిమానాతో పాటు మూడు నెలల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.


Click it and Unblock the Notifications