ఆర్థిక సురక్షిత కోసం ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి. మీ ఆర్థిక ప్రగతికి మీకు ఓ రోడ్ మ్యాప్ ఉండాలి. ఆర్థిక ప్రణాళిక రూపొందించినప్పుడు మీరు వివిధ అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. కరోనా తర్వాత చాలామంది పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులపై దృష్టి సారించారు. అంతకుముందు ఆర్థిక ప్రణాళిక లేనివారు కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతిలో డబ్బులు లేక, అప్పు మీద అప్పు చేసి, ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు. కరోనా తర్వాత చాలామంది ఆర్థిక ప్రణాళికకు జై కొడుతున్నారు. అయితే ఆర్థిక ప్రణాళికలోను ముఖ్య భాగాలు తెలుసుకుందాం....

పర్సనల్ ఫైనాన్స్‌కు ఈ ఐదు కీలకం
ఒక పూర్తి ఫైనాన్షియల్ పిక్చర్‌కు ఐదు ఆకృతులు లేదా ప్రణాళికలు ఉన్నాయి. పర్సనల్ ఫైనాన్స్ అంటే ఆదాయం (income), ఖర్చులు (spending), పొదుపు (savings), పెట్టుబడి (investing), రక్షణ (protection) కలయిక.
మన ఆదాయాన్ని బట్టి బడ్జెట్ వేసుకోవాలి.
ఖర్చులు, పెట్టుబడులలోను ట్యాక్స్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానిక్, వివిధ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వంటి అంశాలు కీలకం.
ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తుందో తెలియదు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ వంటివి అట్టిపెట్టుకోవాలి.
పెట్టుబడులు లేదా పొదుపు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.

లక్ష్యం స్పష్టం
పెట్టుబడులు పెట్టడానికి ముందు మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ అంటే ఇళ్లు, పెళ్లి వంటి లక్ష్యాలు ఉంటే అయిదేళ్లకు పైగా ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే మూడేళ్ల వరకు ఉంటాయి. మిడ్ టర్మ్ అంటే మూడేళ్ల నుండి అయిదేళ్లు.
షార్ట్ టర్మ్ అంటే ఉదాహరణకు లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్.
మిడ్ టర్మ్ అయితే హైబ్రిడ్ ఫండ్స్, పీఎస్‌యు డెబిట్ ఫండ్స్.
లాంగ్ టర్మ్ అంటే మల్టీ క్యాప్ ఫండ్స్, ఎన్పీఎస్, లార్జ్ క్యాప్ ఫండ్స్.
ఇక, రియాల్టీ షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్‌కు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.
స్టాక్ మార్కెట్ పెట్టుబడితో పాటు బంగారంపై కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిలోను షార్ట్, మీడియం లాంగ్ టర్మ్ లక్ష్యాలు ఉంటాయి.

ఇలా చేయండి
అన్నింటి కంటే ముందు మన ఆదాయాన్ని బడ్జెట్ చేసుకోవాలి. ఖర్చులు ఇష్టారీతిన చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో ఇంటి ఖర్చులు, మన ఈఎంఐలు పోను మిగతా వాటిని సేవింగ్స్ దిశగా ఆలోచన చేయాలి. కాబట్టి విలాసాల ఖర్చుకు దూరంగా ఉండాలి. అది పెట్టుబడి రూపంలోను ఉండవచ్చు. స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, ఫండ్స్.. ఇలా వేటిలోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇక రక్షణ లేదా ఆర్థిక రక్షణ అంటే టర్మ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్, మోర్టగేజ్ ప్రొటెక్షన్ ఇన్సురెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ వంటివి కీలకం.
ఖర్చు తగ్గించుకునే క్రమంలో ట్యాక్స్ సేవింగ్స్‌ను పరిగణలోకి తీసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ కార్పస్ కోసం ఆలోచన చేయాలి.


Click it and Unblock the Notifications