టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఏంటి..? వాటిపై వడ్డీ ఎలా ఉంటుంది?

సాధారణంగా భారతీయ కుటుంబంలోని తల్లి దండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. అయితే పొదుపు చేసే డబ్బులను పోస్టాఫీసుల్లో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో వేస్తుంటారు. వీటివల్ల ఇటు పన్ను మినహాయింపుతో పాటు అటు తమ డబ్బుకు భద్రత ఉంటుందనే ప్రగాఢ నమ్మకం ఉండటం వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అంతేకాదు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు భారత్‌లో అత్యంత పాపులారిటీ కలిగిన పథకాలు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై భారతీయ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(సీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. చాలామంది పీపీఎఫ్, ఈఎల్‌ఎస్ఎస్, యూలిప్, ఎన్‌పీఎస్‌లాంటి స్కీముల కంటే కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇందులో పన్ను మినహాయింపు ఉండటంతో పాటు గ్యారెంటీ రిటర్న్స్ ఇందులో దక్కుతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు సాధారణ ఎఫ్‌డీలు వేర్వేరుగా ఉంటాయి. పన్ను ఆదా అయ్యే ఎఫ్‌డీలు ఇలా ఉన్నాయి.

What are tax saving fixed deposits,Which banks offer the best interest rates on these FDs?

1. టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఐదేళ్ల పాటు లాకిన్ పిరియడ్ కలిగి ఉంటాయి. అంటే ఈ ఐదేళ్లలో మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోలేరు

2. భారత్‌లో నివాసం ఉంటున్న వారు హిందూ అవిభక్త కుటుంబాలు (hindu undivided families)కు చెందిన వారు మాత్రమే డిపాజిట్ చేసేందుకు అర్హులు

3. టాక్స్ సేవింగ్స్ ఎఫ్‌డీలు ఒక వ్యక్తిగా లేదా జాయింట్‌గా మరోవ్యక్తితో కలిసి తీసుకోవచ్చు. ఒకవేళ జాయింట్‌గా ఎఫ్‌డీలు తీసుకుంటే తొలి వ్యక్తికి మాత్రమే సెక్షన్ 80(సీ)కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

4. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీని ప్రతి నెలా తీసుకుంటారా లేక త్రైమాసికం లెక్కన తీసుకుంటారా లేదా ఒకేసారి సంవత్సరానికి తీసుకుంటారా అన్న ఆప్షన్ మనకు ఉంటుంది.అంతేకాదు వచ్చే వడ్డీ తిరిగి ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది

5.టాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ మన ఏడాది సంపాదనకు జత అవుతుంది. దీంతో ఇన్‌కం టాక్స్ శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ వడ్డీని క్వార్టర్లీ పద్దతిన లెక్కిస్తారు.

6. ఈ ఎఫ్‌డీల ద్వారా ఏడాదికి వచ్చిన వడ్డీపై 10శాతం లెక్కన టీడీఎస్‌‌ కోత విధిస్తాయి బ్యాంకులు.పన్నుచెల్లింపులోకి మీరు రానట్లయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 15G/H ఫారంను పూర్తి చేసి బ్యాంకుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

7. టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలను ఏ ప్రభుత్వరంగ బ్యాంకు లేదా ప్రైవేట్ బ్యాంకులో తీసుకోవచ్చు. అయితే గ్రామీణ బ్యాంకులు, ఇతర కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో మాత్రం ఇది సాధ్యపడదు

8. పోస్టాఫీసుల్లో 5ఏళ్ల పాటు డిపాజిట్ చేసే టర్మ్ డిపాజిట్‌ సెక్షన్ 80(సీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది

9. టాక్స్ సేవింగ్స్ డిపాజిట్లపై లోన్ తీసుకోవడం కానీ, ఒక్కసారి డిపాజిట్ చేసిన తర్వాత గడువు ముగిసే వరకు డబ్బులు తీసుకోవడం కానీ కుదరదు.

10. ఇక ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటాయి. పెద్ద బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ వడ్డీ రేటును అందిస్తుండగా.. చిన్న ప్రైవేట్ బ్యాంకులు మాత్రం టాక్స్ సేవింగ్స్ ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+