For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయారా, ఈ టిప్స్ పాటించండి

|

ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారా? అయితే ఇక్కడి టిప్స్ మీకు ఉపయోగపడతాయో చూడండి. ఆర్థిక చిక్కుల్లో లేదా సంక్షోభంలో కూరుకుపోతే మొదట చేయాల్సింది ఆర్థిక సంక్షోభానికి కారణమైన ప్రాథమిక కారణాన్ని గుర్తించాలి. సంక్షోభం నుండి గట్టెక్కేందుకు బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్రాపర్టీస్‌ను సెట్ చేసుకోవాలి. సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలో గుర్తించాలి. పరిష్కరించేందుకు మీరు ఎంచుకున్న మార్గం ఎలా ముందుకు సాగుతుందనే అంశాన్ని పరిశీలించుకోవాలి.

సమస్యను గుర్తించాలి

సమస్యను గుర్తించాలి

దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నిన్నటినుండి పెరుగుతున్నాయి. కరోనా సమయంలో చాలామంది తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. కరోనా తర్వాత చాలామంది పెట్టుబడులు, హెల్త్ ఇన్సురెన్స్ వంటి వాటిపై దృష్టి సారించారు. అయితే అనుకోని విధంగా ఖర్చులు పెరిగితే, మనపై భారం పడితే, ఆర్థిక చిక్కుల్లోకి వెళ్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మొదట సంక్షోభంలోకి వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అనుకోకుండా ధరలు పెరగడం, ఇతర ఖర్చులు పడితే మన బడ్జెట్ ప్లాన్ దాటి ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోతాం.

మొదట మన ఆర్థిక ఇబ్బందులకు గల కారణాన్ని గుర్తించాలి. అందుకు అనుగుణంగా మన ఆదాయాన్ని బట్టి బడ్జెట్‌ను తయారు చేసుకోవాలి. ఆర్థిక ప్రాధాన్యతలను గుర్తించాలి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలో చూడాలి. అమలు చేయడంపై దృష్టి సారించి, దానిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి.

ఆదాయం, ఖర్చు

ఆదాయం, ఖర్చు

మీకు ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది, ఎన్ని మార్గాల ద్వారా సమకూరుతుంది వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలి. మీరు ఎంత బాగా సంపాదిస్తున్నా మీ ఆధాయ వనరులపై నిత్యం కన్నేయాలి. డబ్బును ఎక్కడ పెడుతున్నారు, మీ నెలవారీ ఖర్చులపై దృష్టి పెట్టడం, అప్పులు, రుణాలు రాసిపెట్టుకోవడం, సేవింగ్స్ సొమ్ము ఎంత, చేతిలోని నగదు ఎంత అని చూసుకోవాలి.

అవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఇష్టారీతిన షాపింగ్స్, చేతిలో డబ్బులు ఉంటే అనవసరంగా ఖర్చు చేయడానికి దూరంగా ఉండాలి.

బిల్లు భారం..

బిల్లు భారం..

నెలవారీ ఖర్చులు తగ్గించుకోవడానికి మరో మార్గం వివిధ సేవలకు చెల్లించే బిల్లుల విషయంలో వీలైనంత రాయితీ పొందే ప్రయత్నం చేయాలి బేరసారాలకు వెనుకాడవద్దు. మరీ అత్యవసరమైతే కేబుల్, ఇంటర్నెట్, ల్యాండ్ ఫోన్ వంటి బిల్లులు కొంతకాలం పాటు తగ్గించుకోవాలి. వాటి స్ధానంలో మొబైల్‌ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే, ఉపయోగంలో లేని వస్తువులను విక్రయించాలి.

క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలి

క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలి

ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఎక్కువగా శ్రమించడం నేర్చుకోవాలి.మీ ప్రస్తుత ప్రధాన ఉపాధి వనరుతో పాటు ఖాళీ సమయంలో ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. వీలైతే ఆఫీస్ నుండి ఇంటికి రాగానే మరో పైన దృష్టి సారించాలి. ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. రుణ చెల్లింపులు ఇతర ఈఎంఐలు సకాలంలో చెల్లించాలి. వడ్డీ పేరుకుపోయిన తలకు మించిన భారంగా మారవచ్చు.

English summary

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయారా, ఈ టిప్స్ పాటించండి | Ways to Prepare for a Personal Financial Crisis

Identify the Problems. The first step to overcoming financial crisis is to identify the primary problem that is causing difficulties.
Story first published: Wednesday, March 23, 2022, 18:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X