వారెన్ బఫెట్(warren buffett).. ఈ పేరు వింటే మనకు స్టాక్ మార్కెట్, బిలియన్ల సంపద గుర్తొస్తాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఉన్న ఆయన ఇటీవలే తన కంపెనీ నుంచి రిటైర్ అయ్యారు. అయితే ఆయన ఇన్నేళ్ల అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా కెరీర్ ను బిల్డ్ చేసుకోడానికి కొన్ని ఈజీ టిప్స్ పాటించాలంటున్నారు. బఫెట్ చెప్తున్న కెరీర్ పాఠాలేంటో చూసేద్దామా..!
1. మీరే ఒక లిమిటెడ్ కంపెనీ
మీరు ఒక పెద్ద సంస్థకు ఉద్యోగి కావచ్చు, కానీ మిమ్మల్ని మీరు అనే ఒక చిన్న 'లిమిటెడ్ కంపెనీ'గా చూడండి. ఈ కంపెనీకి పరిమిత వనరులు ఉన్నాయి. మీ సమయం, మీ శక్తి, మీ శ్రద్ధ. ప్రతిరోజూ మీరు చేసే పని మీ కంపెనీకి విలువను పెంచుతుందా? లేదా? అనేది ఆలోచించండి. ఉద్యోగిలా కాకుండా యజమానిలా ఆలోచించండి. యజమాని ఎప్పుడూ లాంగ్ టర్మ్ గోల్స్ చూస్తారు. అదే విధంగా మీరు కూడా మీ కంపెనీ లాంగ్ టర్మ్ గోల్డ్ పై ఫోకస్ పెట్టండి.
2. మీ పరిధి ఏమిటో తెలుసుకోండి
మీరు ఏ పనులు బాగా చేయగలరు? ఏ రంగంలో మీకు ఎక్కువ పరిజ్ఞానం ఉంది? ఏ సమస్యలను మీరు కచ్చితంగా పరిష్కరించగలరు? ఇలాంటి విషయాలపై స్పష్టత తెచ్చుకోండి. ఎప్పుడు రిస్క్ తీసుకోవాలో కూడా మీకు తెలిసి ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మెంటర్స్ సహాయం తప్పక తీసుకోండి.

3. కెరీర్ కాంపౌండింగ్
బఫెట్ విజయానికి కారణం కాంపోండింగ్ అని చెప్తున్నారు. అయితే ఇది కేవలం డబ్బుకు మాత్రమే కాదు, మీ కేరీర్‌కూ వర్తిస్తుంది. ఒక సంవత్సరంలో వచ్చే హైక్ లేదా ఫ్యాన్సీ టైటిల్‌పై కాకుండా ఐదేళ్లలో మీరు ఏ స్థాయిలో ఉంటారో దానిపై దృష్టి పెట్టండి. ప్రతి సంవత్సరం ఉద్యోగాలు మారేవాళ్లతో పోలిస్తే.. మీరు నమ్మకానికి , బలమైన సంబంధాలకు విలువ ఇవ్వాలి. అది మీ కేరీర్‌లో శక్తివంతమైన కాంపౌండింగ్‌లా పనిచేస్తుంది.
4. వీటి మాట వినొద్దు
కెరీర్ విషయంలో భావోద్వేగాలకు దూరంగా ఉండండి. కోపంతో రాజీనామా చేయడం లేదా లేఆఫ్స్ గురించి చింతించడం మానుకోండి. మీ ప్లాన్‌కు కట్టుబడి ఉండండి. మీ దీర్ఘకాలిక లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి.
5. నిరంతర అభ్యాసం
ప్రతిరోజూ చదవడాన్ని అలవాటు చేసుకోండి. రోజుకు అరగంట అయినా కొత్త పుస్తకాలు, రీసెర్చ్ పేపర్స్ వంటివి చదవండి. నిరంతరం నేర్చుకోవడం అనేది మీ భవిష్యత్తులో మీరు పెట్టే అతిపెద్ద కాంపౌండింగ్ పెట్టుబడి.
6.ఉద్యోగం ఒక 'పెట్టుబడి'గా చూడండి
ఉద్యోగాన్ని కేవలం జీతం వచ్చే మార్గంగా కాకుండా, మీ భవిష్యత్తులో పెట్టుబడిగా చూడండి. కంపెనీలో మీరు చేసే పనిని లేదా మీ పనితీరును ఎలా కొలుస్తారో తెలుసుకోండి. కంపెనీ లీడర్‌షిప్ ని విశ్లేషించండి. ఉద్యోగం నుంచి ఏదైనా అనుకోని నష్టం జరిగితే తట్టుకోవడానికి మీ దగ్గర పొదుపు, బ్యాకప్ ప్లాన్ ఉందో లేదో చూసుకోండి.
More From GoodReturns

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications