కొత్త కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ ధరలు పెరిగిపోతున్నాయి. అనుకున్న కారు కొనుక్కోవాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల కుటుంబ బడ్జెట్ పై భారం పడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలను కుంటున్నారు. ప్రస్తుతం అనేక కంపెనీలు సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్లకు తగిన విధంగా గ్యారంటీ కూడా ఇస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సెకండ్ హ్యాండ్ కారుకు రుణం తీసుకోవాలా? ఒకవేళ రుణం తీసుకుంటే వడ్డీ రేటు ఎలా ఉంటుంది. అసలు సెకండ్ హ్యాండ్ కారుకు రుణం తీసుకోవడం వల్ల లాభమా నష్టమా అన్న వివరాలు తెలుసుకోవడం వల్ల సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి చూద్దాం..

ఎవరు రుణం తీసుకోవచ్చు..
* కంపెనీల్లో ఉంద్యోగాలు చేస్తున్న వారు, సొంతంగా ఉపాధిని పొందుతున్న వారు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* కొన్ని బ్యాంకులు ఫ్లెక్సి ఈఎంఐ కార్ లోన్స్ ను అందిస్తున్నాయి. దీని ద్వారా మన సౌకర్యాన్ని బట్టి రుణాన్ని చెల్లించ వచ్చు. ఈ వివరాలను బ్యాంకును సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు.
* వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకు ఒక్కో విదంగా వసూలు చేస్తుంది. సాధారణంగా వడ్డీ రేటు కనిష్టంగా 8.55 శాతం నుంచి గరిష్టంగా 16.75 శాతం వరకు ఉంటుంది.
* కారు రుణాన్ని ఐదేళ్ల కాలానికి తీసుకోవచ్చు. అవసరమైతే ఏడేళ్ల కాలానికి కూడా రుణం పొందవచ్చు.
* ఎక్కువ కాలానికి రుణం తీసుకోవడం వల్ల నెలవారీగా చెల్లించే వాయిదా భారం తగ్గుతుంది. అయితే తిరిగి చెల్లించే మొత్తమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నామో చూసుకొని రుణ కాల పరిమితిని ఎంచుకోవాలి.

ముందుగా చెల్లిస్తే..
* తీసుకున్న రుణాన్ని ముందుగానే చెల్లిస్తే కొన్ని బ్యాంకులు జరిమానాలు విధించడం లేదు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం మిగిలిన రుణ మొత్తంపై ఐదు శాతం చార్జీని వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు ముందుగానే రుణాన్ని తీర్చివేస్తే 3 నుంచి 6 శాతం వరకు చార్జీలను విడిచిస్తోంది. యాక్సిస్ బ్యాంకు 5 శాతం చార్జీలను వసూలు చేస్తోంది.
* కారు విలువపై 90 శాతం నుంచి 100 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. అయితే మొత్తం రుణాన్ని తీసుకోకుండా కొంత రుణాన్ని తీసుకోవడం వల్ల నెలవారీ వాయిదా మొత్తాన్ని చెల్లించే భారాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రాసెసింగ్ ఫీజు
* బ్యాంకులు సెకండ్ హ్యాండు కారు రుణాన్ని మంజూరు చేయడానికి ప్రాసెసింగ్ చార్జీలను వసూలు చేస్తాయి. ఇది ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంది.
* బ్యాంకును బట్టి ప్రాసెసింగ్ ఫీజు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications