చేతిలో అప్పటి అవసరాలకు మించిన డబ్బు ఉంటుంది. దాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఎలా వినియోగించుకోవాలో తెలియదు. భవిష్యత్తులో నెలవారీ అవసరాలు ఉంటాయి. వీటికోసం ఏం చేస్తే బాగుంటుందన్న సంశయం చాలా మందిలో ఉంటుంది. ఇక రిస్కును బట్టి రివార్డ్ ఉంటుంది. కొంత మంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. మరికొంత మంది రిస్క్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వ్యక్తుల రిస్కు తీసుకునే స్వభావాన్ని బట్టి పలు రకాల ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
అవి... పోస్టాఫీసు పథకాలు, బ్యాంకు, ఎన్ బీ ఎఫ్ సి ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా కంపెనీల యాన్యుటీ పథకాలు, మ్యూచువల్ ఫండ్ సంస్థల క్రమానుగత ఉపసంహరణ ప్లాన్లు వంటివి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా పెట్టుబడులకు సంభందించి నిర్ణయాలు తీసుకొని నెలవారీగా ఆదాయాన్ని పొందవచ్చు.

పెట్టుబడులకు భద్రత
* కొంత మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తారు కానీ రిస్క్ తీసుకోవడానికి మాత్రం ఇష్టపడరు. ఇలాంటివారికి పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం బెస్ట్.
* పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఒక్కో వ్యక్తి గరిష్టంగా 4.5 లక్షల పెట్టుబడి మాత్రమే పెట్టవచ్చు. జాయింట్ ఖాతా అయితే 9 లక్షల వరకు ఉంటుంది.
* 60 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వారు ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ పథకాలకు ప్రభుత్వం నుంచి హామీ ఉంటుంది.
* ఈ పథకంలో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథక కాలపరిమితి 10 ఏళ్ళు ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి 1.5 లక్షలు, గరిష్ట పెట్టుబడి 15 లక్షలు ఉంటుంది.
* ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది.
* సీనియర్ సిటిజన్లకు పోస్ట్ ఆఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం బాగుంటుంది.

యాన్యుటీ ప్లాన్
* బీమా కంపెనీలు యాన్యుటీ ప్లాన్లను అందిస్తున్నాయి. ఒక్కసారి ప్రీమియం చెల్లించి తక్షణమే నెలవారీగా చెల్లింపులను పొందవచ్చు.
* అయితే ప్లాన్లపై తక్కువ రిటర్న్ ఉంటుంది.
* మంచి ప్లాన్లో కేవలం 6 శాతం రిటర్న్ లభిస్తుంది.

బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు
* నెలవారీగా వడ్డీ రేటు చెల్లించే బ్యాంకు డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి.
* ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 7.85 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 7 శాతం నుంచి 9 శాతం వరకు ఉంది.
*సాధారణంగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై త్రైమాసికం వారీగా వడ్డీ రేటు చెల్లిస్తుంటారు. అయితే డిపాజిట్ దారుల అభ్యర్థన మేరకు నెలవారీగా చెల్లింపులు చేస్తాయి.

ఎన్ బీ ఎఫ్ సి ఫిక్స్డ్ డిపాజిట్స్
* కాస్త ఎక్కువ రిస్క్ తీసుకోవాలని భావించే వారు బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలు (ఎన్ బీ ఎఫ్ సి ) ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించవచ్చు. బ్యాంకులకన్నా ఈ సంస్థలు ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి.
* బ్యాంకులు, ఎన్ బీ ఎఫ్ సి ల ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications