డబ్బు సంపాదించడం కష్టం, కానీ దాన్ని మేనేజ్ చేయడం ఇంకా కష్టం అనిపిస్తుంది కదా? చాలా మంది "ఎంత సేవ్ చేయాలి?", "ఎంత ఇన్వెస్ట్ చేయాలి?", "ఎప్పుడు ఇల్లు కొనాలి?" అంటూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు డబ్బు మీద కంట్రోల్ లేకపోతే, ఎంత సంపాదించినా ఫలితం ఉండదు.
అందుకే ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ కొన్ని సింపుల్ నియమాలు చెబుతున్నారు. ఇవి ఎలాంటి క్లిష్టమైన మ్యాథ్స్ లేకుండా, ఎవరికైనా అర్థమయ్యే లెక్కలు. వీటిని ఫాలో అయితే మీరు డబ్బును సేఫ్‌గా ఉంచుకోవచ్చు, స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేయవచ్చు, అలాగే ఫ్యూచర్ సెక్యూరిటీ కూడా పొందవచ్చు.

ఇప్పుడు మనం అలాంటి 9 గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి డబ్బు మీద క్లారిటీ ఇస్తాయి, లైఫ్‌లో ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా మార్గం చూపిస్తాయి.
1. 72 రూల్:
మీ డబ్బు ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సింపుల్‌గా లెక్కించుకోవచ్చు. 72ని మీరు పొందుతున్న రిటర్న్‌తో భాగించాలి. ఉదాహరణ: 12% రిటర్న్ వస్తే → 72 ÷ 12 = 6. అంటే 6 ఏళ్లలో డబ్బు డబుల్ అవుతుంది. ఇది బ్యాంక్ FD, మ్యూచువల్ ఫండ్స్, లేదా ఇతర పెట్టుబడుల్లో డబ్బు ఎంత వేగంగా పెరుగుతుందో అంచనా వేయడానికి హెల్ప్ అవుతుంది.
2. 70 రూల్:
మన దగ్గర డబ్బు ఉన్నా, దాని విలువ ఇన్ఫ్లేషన్ వల్ల క్రమంగా తగ్గిపోతుంది. ఈ రూల్ ద్వారా డబ్బు విలువ సగం కావడానికి ఎంత టైమ్ పడుతుందో లెక్కించవచ్చు. ఉదాహరణ: ఇన్ఫ్లేషన్ 7% ఉంటే → 70 ÷ 7 = 10. అంటే 10 ఏళ్లలో మన డబ్బు విలువ సగం అవుతుంది. ఇదే కారణం డబ్బును కేవలం సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టకుండా పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.
3. 4% విత్ డ్రా రూల్:
రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బు అయిపోకుండా ఉండాలంటే, మీ కార్పస్‌లో ప్రతి సంవత్సరం గరిష్టంగా 4% మాత్రమే విత్‌డ్రా చేయాలి. ఉదాహరణ: మీ దగ్గర రూ.1 కోటి కార్పస్ ఉంటే, మీరు ప్రతి సంవత్సరం రూ. 4 లక్షలు తీసుకుంటే అది చాలాకాలం పాటు సరిపోతుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా బతకడానికి హెల్ప్ చేస్తుంది.
4. 100 రూల్:
మీ వయసు ఆధారంగా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ & FD, బాండ్స్ మధ్య పెట్టుబడులు డివైడ్ చేసుకోవాలి. ఉదాహరణ: మీ వయసు 30 అయితే → 100 - 30 = 70. అంటే 70% ఈక్విటీ, 30% అప్పు అలా పెట్టాలి. ఈ రూల్ వలన రిస్క్, సేఫ్టీ మధ్య బ్యాలెన్స్ కంట్రోల్ అవుతుంది.
5. 10-5-3 రూల్:
పెట్టుబడుల విషయంలో ముందుగానే వాస్తవిక అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌లో సగటుగా సుమారు 10% రిటర్న్ వస్తుంది. Debt ఇన్వెస్ట్‌మెంట్స్ (FDలు, బాండ్లు వంటివి) సాధారణంగా 5% రిటర్న్ ఇస్తాయి. ఇక బ్యాంక్‌లో పెట్టే సేవింగ్స్ అయితే కేవలం 3% వడ్డీ మాత్రమే ఇస్తాయి. ఇలా అంచనా వేసుకుంటే మన డబ్బు భవిష్యత్తులో ఎంత పెరుగుతుందో స్పష్టత వస్తుంది. అదే సమయంలో ఏ లక్ష్యం కోసం ఎంత పెట్టుబడి పెట్టాలో, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలో కూడా క్లియర్ అవుతుంది.
6. 50-35-15 రూల్:
డబ్బు చేతికి వచ్చిన వెంటనే ఎలా ఖర్చు చేయాలో క్లారిటీ లేకపోతే ఫైనాన్షియల్ టెన్షన్ మొదలవుతుంది. అందుకే ఈ సింపుల్ రూల్ ఉపయోగపడుతుంది. వచ్చిన ఆదాయంలో 50% అవసరాల కోసం పెట్టుకోవాలి అంటే ఇంటి ఖర్చులు, బిల్లులు, EMIలు లాంటివి. తర్వాత 35% కోరికల కోసం వాడుకోవచ్చు. షాపింగ్, ట్రావెల్, ఎంజాయ్‌మెంట్ మొదలైనవి. మిగిలిన 15% మాత్రం తప్పనిసరిగా సేవింగ్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టాలి. ఇలా ఫాలో అవుతే ఖర్చులు ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటాయి, అలాగే సేవింగ్స్ కూడా క్రమంగా పెరుగుతాయి.
7. 6X Emergency Fund:
ఎమర్జెన్సీ టైమ్‌లో ఉద్యోగం పోవడం, హెల్త్ ప్రాబ్లెమ్స్ లాంటివి ఎప్పుడైనా రావచ్చు. అలాంటప్పుడు సేఫ్‌గా ఉండటానికి కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా Emergency Fund పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు నెలకు రూ. 50,000 ఖర్చు చేస్తే, కనీసం రూ. 3,00,000 Emergency Fundగా ఉంచుకోవాలి. ఇలా ఉంటే లైఫ్‌లో అనుకోని సిట్యుయేషన్స్ వచ్చినా, టెన్షన్ లేకుండా హ్యాండిల్ చేయగలుగుతారు.
8. 41% EMI రూల్:
మీ నెల ఆదాయం ఎంత ఉన్నా, EMIలు 41% కంటే ఎక్కువ కాకూడదు. ఉదాహరణ: మీ జీతం రూ. 1,00,000 అయితే → EMIలు గరిష్టంగా రూ. 41,000 లోపే ఉండాలి. దీనివల్ల మీరు బోరింగ్ ట్రాప్‌లో పడకుండా సేఫ్‌గా ఉంటారు.
9. 20X ఆదాయ రూల్:
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మీ వార్షిక ఆదాయం 20 రెట్లు ఉండాలి. ఉదాహరణ: మీరు సంవత్సరానికి రూ. 10 లక్షలు సంపాదిస్తే → టర్మ్ ఇన్సూరెన్స్ కనీసం రూ. 2 కోట్లు ఉండాలి. ఇది మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది.
మొత్తానికి, ఈ ఫైనాన్షియల్ గోల్డెన్ రూల్స్ అన్నీ మన లైఫ్‌లో డబ్బును స్మార్ట్‌గా మేనేజ్ చేసుకోవడానికే. డబ్బు సంపాదించడం ఒక స్టెప్ అయితే, దాన్ని సేఫ్‌గా పెట్టుబడి పెట్టడం, సరైన ప్లాన్‌తో ఖర్చు చేయడం, ఫ్యూచర్‌కి సెక్యూరిటీ కల్పించడం కూడా అంతే ముఖ్యమైంది. చిన్న చిన్న రూల్స్ పాటిస్తేనే పెద్ద మార్పు వస్తుంది. ఈరోజు నుంచే మొదలుపెట్టి, మీ డబ్బు మీకోసం పనిచేసేలా ప్లాన్ చేసుకోండి.
More From GoodReturns

Gold ETF అంటే ఏమిటి? తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడం ఎలా?

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications