కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేసింది. ఉద్యోగాలు పోయాయి... వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చాలామంది రోడ్డున పడ్డారు. 2020 మార్చి నుండి కరోనా వల్ల ఎంతోమంది దెబ్బతినగా, ఇప్పుడు సెకండ్ వేవ్ అంతకంటే భయాన్ని కలిగిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్నో ప్లాన్స్ చేసుకున్నప్పటికీ వాటిని దెబ్బతీసేలా కరోనా పరిస్థితి పరిణమించింది. ఊహించని ఇలాంటి వాటిని తట్టుకొని నిలబడేలా తయారవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని అవకాశంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు. ఇది 'యుద్ధ సమయంగా' పేర్కొంటున్నారు. ఈ యుద్ధంలో గెలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలని, అస్త్రాలు అన్నింటిని ఉపయోగించాలి.

ప్రతికూలతల నుండి నేర్చుకోవాలి
మన సామర్థ్యం, బలం, బలహీనతలు తెలుసుకోవడానికి ఇలాంటి పరిస్థితులు ఉపయోగపడతాయి. అలాగే, దీని నుండి గుణపాఠం నేర్చుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు తదుపరి ఎలాంటి సంక్షోభం వచ్చినా తట్టుకునేలా మనం ప్లాన్ చేసుకుంటాం. అంతా సాఫీగా సాగుతున్నప్పుడు ప్రణాళికలు లేకుండా వెళ్తుంటారు.
కానీ ఇలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు ప్లాన్ చేసుకుందామనుకున్నప్పటికీ మన చేతుల్లో ఉండదు. కాబట్టి కరోనా వంటి సంక్షోభం ఓ గుణపాఠంగా చెబుతున్నారు. చాలామంది మున్ముందు వచ్చే సంక్షోభానికి సిద్ధంగా లేరు. ఇక కొంతమంది సిద్ధంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న సంక్షోభాలకు సిద్ధమై ఉన్నారు. కానీ కరోనా వంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. ఇక నుండి అలాంటి పరిస్థితులకు కూడా సిద్ధమవ్వాలని నేర్పింది ఈ కోవిడ్-19.

సంక్షోభం (యుద్ధం) ఒత్తిడికి పరీక్ష
ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. ఇలాంటి సమయాన్ని వృథా చేయవద్దు. ఈ పరిస్థితుల్లో బలమైన, బలహీన పరిస్థితులు తెలుస్తాయి. మీ ఆదాయంలో ఎంత మేరకు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎక్కడ ఎంత మేరకు ఉపయోగించాలి అనే అంశాలను నేర్చుకునేందుకు ప్రస్తుత పరిస్థితులు ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితులు మీ ఒత్తిడికి అతిపెద్ద పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గేందుకు ప్రయత్నించాలి. అలాగే, దీని నుండి పాఠం నేర్చుకోవాలి.

వాస్తవ అవసరాలు.. శాశ్వత మార్పు
అంతా సానుకూలంగా ఉన్న పరిస్థితుల్లో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే వారు ఉంటారు. డబ్బు రాక చాలా తేలిక అని భావిస్తూ అనవసర ఖర్చులు కూడా చేస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవంగా మనకు ఉపయోగపడేవి ఏవి, అనవసరమైనవి ఏవి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అందరు కూడా అనవసర ఖర్చులకు దూరం ఉంటున్నారు. అలాగే, ఖర్చు అలవాట్లలో శాశ్వత మార్పులకు కూడా అవకాశం ఏర్పడింది.

ఇదో మంచి అవకాశం
కరోనాపై యుద్ధం వంటి సంక్షోభాలు మున్ముందు వచ్చే సంక్షోభాలను తట్టుకునేలా మనకు గుణపాఠం నేర్పాయి. వ్యక్తిగత స్థాయిలో మీ ఆరోగ్యం, మనీ మేనేజ్‌మెంట్ వంటి వాటిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా నిలదొక్కుకునేందుకు ఇదో మంచి అవకాశం.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications