క్రెడిట్ కార్డ్ అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగకరం. మీ వృత్తిపర ప్రయాణంలో క్రెడిట్ కార్డును పొందడం, దానిని నిర్వహించడం ద్వారా మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించవచ్చు. మున్ముందు కాలంలో మీరు సొంత ఇంటి కొనుగోలు లేదా మీ పిల్లల ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడం వంటి జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చూస్తే లేదా ఆర్థిక అత్యవసర సమయంలో క్రెడిట్ ప్రొఫైల్‌కు ఎంతో వ్యాల్యూ ఉంటుంది. మంచి క్రెడిట్ చరిత్ర కలిగి ఉంటే మీరు మీ ట్రాన్సాక్షన్స్‌ను సక్రమంగా నిర్వహించినట్లు భావించవచ్చు.
క్రెడిట్ హిస్టరీ బాగుంటే తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ వంటివి లభించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో బలమైన క్రెడిట్ హిస్టరీ ఉంటే అధిక కొనుగోలు వెసులుబాటు, ఆర్థిక సౌలభ్యం, అందించే వివిధ రివార్డ్స్, ప్రోత్సాహకాలపరంగా కూడా ప్రయోజనం ఉంటుంది. అయితే మీరు క్రెడిట్ కార్డు పొందడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి...

సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి
వివిధ బ్యాంకులు, వివిధ రకాల క్రెడిట్ కార్డ్స్‌ను జారీ చేస్తాయి. తరుచూ కొనుగోలు చేసేవారు, తరుచూ ప్రయాణించే వారికి అందుకు అనుగుణంగా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించడంలో మొదటి అడుగు మీ ఖర్చు, జీవనశైలికి సరిపోయే కార్డును ఎంచుకోవాలి. మీరు క్రమం తప్పకుండా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ వంటి మంచి ఆన్‌లైన్ షాపింగ్ ప్రయోజనాలు కలిగిన కార్డులను ఎంచుకోవాలి. మీరు ప్రయాణం చేయాలనుకుంటే ఉచిత ఎయిర్ మైల్స్, ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, హోటల్ వోచర్స్ మొదలైనవి అందించే కార్డును ఎంచుకోవాలి.
ఇక్కడ మీరు గమనించవలసిన మరో అంశం ఫస్ట్ టైమ్ ఎర్నర్స్‌కు అన్ని బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. ఎంప్లాయిమెంట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ కీలకం.
క్రెడిట్ కార్డు పొందడానికి సులభమైన పద్ధతుల్లో ఒకటి మీరు మీ శాలరీ అకౌంట్ కలిగిన బ్యాంకులో దరఖాస్తు చేయడం. యంగ్ ఎర్నర్స్‌కు పలు బ్యాంకులు ఎంట్రీ లెవల్ క్రెడిట్ కార్డ్స్‌ను జారీ చేస్తాయి. ఎంట్రీ లెవల్ క్రెడిట్ కార్డ్స్ విషయంలోను మీరు మార్కెట్‌లోని వివిధ కార్డ్స్‌తో పోల్చుకోవచ్చు.

ప్రీమియం కార్డ్స్ ద్వారా మోసపోవద్దు
చాలా బ్యాంకులు, క్రెడిట్ కార్డ్స్ జారీ చేసేవారు ప్రత్యేక ప్రయోజనాలు, రివార్డ్స్ కలిగి ఉన్న ప్రీమియం క్రెడిట్ కార్డ్స్‌ను అందిస్తాయి. కానీ ఈ కార్డ్స్ బలమైన క్రెడిట్ స్కోర్, అధిక ఆదాయస్థాయిలు, యజమాని రకం, హోదా, ఉద్యోగ స్థిరత్వం మొదలైన కఠిన అర్హత పరిస్థితులు షరతులు ఉంటాయి.

క్రెడిట్ కార్డ్ వచ్చిందా.. అలా చేస్తే భారీ చెల్లింపు
క్రెడిట్ కార్డ్ పొందిన తర్వాత ఇష్టారీతిగా వ్యవహరించవద్దు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో స్మార్ట్‌గా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. క్రెడిట్ కార్డ్స్ అంటే వడ్డీ లేని రుణంగా చెప్పవచ్చు. వడ్డీ లేని రుణం కాబట్టి ఎక్కువ ఖర్చు చేసే ధోరణి అలవాటు కావొచ్చు. మీరు మీ క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కువగా ఖర్చు చేస్తే రెండు అంశాలు తెలుసుకోవాలి.
ఫస్ట్ టైమ్ ఎర్నర్స్‌కు ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ లిమిట్ ఎక్కువగా ఉండదు. మీరు మీ క్రెడిట్ పరిమితిని పెంచుకుంటూ ఉంటే లేదా తరుచూ క్రెడిట్ పరిమితి స్థాయికి వెళ్తే మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రతికూల ప్రభావం పడవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో ముప్పై శాతం నుండి నలభై శాతం వరకు ఉంచుకోవాలి.
రెండోది మీరు తిరిగి చెల్లించగలిగే దాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, మీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకుంటే మీరు 28 శాతం నుండి 49 శాతం భారీ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. సకాలంలో బిల్లు చెల్లించకుంటే వడ్డీ పడుతుంది. మ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. భవిష్యత్తులో మరో కార్డును పొందే అవకాశం తగ్గిస్తుంది.

మినిమం డ్యూ చెల్లింపులు వద్దు..
క్రెడిట్ కార్డు వినియోగదారులు చాలామంది చేసే సాధారణ పొరపాటు క్రెడిట్ కార్డు చెల్లింపులు జరపలేక, మినిమం డ్యూస్ చెల్లిస్తారు. పూర్తిగా చెల్లించడానికి బదులు, కనీస మొత్తం చెల్లిస్తే తాత్కాలికంగా లేట్ ఫీజు నుండి లేకుండా మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు. కానీ ఇది క్రెడిట్ హిస్టరీ పైన ప్రభావం చూపుతుంది. కొత్త ట్రాన్సాక్షన్స్ చేస్తే వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. వడ్డీ రహిత వ్యవధిని కోల్పోతారు. కాబట్టి మీరు నిర్ణీత వ్యవధిలో చెల్లించగలిగే మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయాలి. చెల్లింపు కష్టమైతే కనుక మీ మొత్తం బిల్లును లేదా చెల్లించవలసిన బకాయిలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్ పైన వడ్డీ రేటు... కాస్త తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కనీసం అదనపు వడ్డీ చెల్లింపును ఆదా చేయగలుగుతారు.

నగదు ఉపసంహరణ వద్దు
చాలా కార్డుల ద్వారా నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో దీనిని చివరి ఎంపికగా మలుచుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకుంటే ఎక్కువ ఛార్జీలు వర్తిస్తాయి. కార్డు ప్రొవైడర్లు ఏడాదికి 52 శాతం వడ్డీ రేటును అమలు చేస్తారు. ట్రాన్సాక్షన్ తేదీ నుండి ఉపసంహరణ మొత్తం పైన 3.5 శాతం వరకు నగదు ఉపసంహరణ ఛార్జీలు చెల్లించాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో నగదును ఉపసంహరించుకోవడానికి బదులు మీ క్రెడిట్ కార్డు పైన పర్సనల్ లోన్ లేదా ఇతర లోన్ తీసుకోవడం కాస్త ప్రయోజనకరం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications