యూపీఐ ఉచితంగా ఉండాలి.. ఛార్జీలు విధిస్తే డిజిటల్ ఇండియాకి అర్థం లేదు.. మాజీ NITI Aayog VC కీలక వ్యాఖ్యలు..

దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిగే లావాదేవీలపై ఎలాంటి రుసుములు విధించకూడదని.. మరికొన్నేళ్ల పాటు సున్నా ఫీజు విధానాన్ని కొనసాగించాలని నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు.

దేశంలో కరెన్సీ-జీడీపీ నిష్పత్తి స్పష్టంగా తగ్గుముఖం పట్టే ధోరణి కనిపిచే వరకు యథాతథ స్థితిని కొనసాగించి.. ఆ తర్వాతే ఫీజుల అంశంపై సమీక్ష జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. ఏ రకమైన లావాదేవీల విలువ పైనైనా వ్యాపారుల నుండి రుసుము వసూలు చేయడాన్ని తాను సమర్థించడం లేదని.. యూపీఐని విస్తృత సానుకూల ప్రయోజనాలు కలిగించే ఒక 'ప్రజా ప్రయోజన' (Public Good) సేవగా ప్రభుత్వం పరిగణించాలని స్పష్టం చేశారు.

UPI charges UPI fees UPI MDR UPI charges 2026 UPI payments UPI news Rajiv Kumar Rajiv Kumar UPI digital payments digital payments public good UPI free UPI transactions UPI above Rs 2000 UPI MDR charges UPI cash cash economy new UPI rules 2026 2000

యూపీఐ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ. 20,000 కోట్ల భారం పడుతున్నప్పటికీ, డిజిటల్ లావాదేవీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు చేకూరే మొత్తం ప్రయోజనాలు ఆ ఖర్చు కంటే చాలా ఎక్కువ అని రాజీవ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం యూపీఐలో 96 శాతం లావాదేవీలు రూ.2,000 కంటే తక్కువ విలువ కలిగినవే అయినప్పటికీ, మొత్తం లావాదేవీల విలువ పరంగా చూస్తే 66 శాతం లావాదేవీలు ₹2,000 కంటే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు.

ఇలాంటి తరుణంలో వ్యాపారులపై స్వల్ప రుసుము విధించినా, వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల (Cash Transactions) వైపు మళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత పటిష్టం కావడానికి ఉచిత సేవలను కొనసాగించడమే శ్రేయస్కరమని పేర్కొన్నారు.

Also Read

మరోవైపు ఆరేళ్ల పాటు ఉచిత సేవలు అందించిన తర్వాత.. అక్టోబర్ 15 నుండి రూ. 2,000 పైబడిన వ్యక్తి-నుండి-వ్యాపారి (P2M) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే రోజువారీ వ్యక్తిగత చెల్లింపులు, చిన్న లావాదేవీలకు ఈ రుసుముల నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే, రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెల్లింపులకు గరిష్ట MDR పరిమితిని రూ. 300గా నిర్ణయించారు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం మరియు వ్యవసాయ రంగాల వంటి తక్కువ లాభదాయక రంగాలలో రూ.2,000 పైబడిన ప్రతి లావాదేవీకి రూ. 5 స్థిరమైన MDR మాత్రమే వర్తిస్తుంది. ఇవి మొత్తం P2M లావాదేవీల విలువలో 17 శాతం, పరిమాణంలో 46 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఈ రుసుముల విధింపుపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగగా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) అనేది కేవలం వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి విధించే రుసుము మాత్రమేనని, సాధారణ వినియోగదారుల (Users) పై ఎలాంటి రకమైన భారం పడదని తేల్చి చెప్పింది. ప్రజలు ఎటువంటి నెలవారీ పరిమితులు లేదా టైర్ ఆధారిత పరిమితులు లేకుండా అపరిమిత ఉచిత యూపీఐ సేవలను ఎప్పటిలాగే పొందుతారని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+