Fixed Deposits: 501 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీని అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..!
యూనిట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్(FD)వడ్డీ రేట్లను సవరించింది. రూ.3 కోట్ల లోపు డిపాజిట్ల విషయంలో 501 రోజుల కాలపరిమితికి సాధారణ వినియోగదారులకు ఏడాదికి 8 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 8.5 శఆతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ కాల వ్యవధిని బట్టి మారుతూ ఉంటాయి. కాలపరిమితులలోనూ సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ చెల్లిస్తున్నారు. 7 - 14 రోజుల డిపాజిట్లపై 4 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. 15 నుంచి 45 రోజుల డిపాజిట్లపై కూడా 4 శాతమే చెల్లిస్తున్నారు. 46 నుంచి 60 రోజుల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
ఇక 61 నుంచి 90 రోజుల వడ్డీపై సాధారణ పౌరులకు 5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం, 91 నుంచి 164 రోజుల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. 165 రోజులు నుంచి 6 నెలల డిపాజిట్లకు 5.50 శాతం సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం, 6 నెలలు - 201 రోజుల డిపాజిట్లపై 6.25 శాతం సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం, 202 రోజుల నుంచి 364 రోజులు డిపాజిట్లపై 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం, సంవత్సరం డిపాజిట్లపై 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. 501 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణంగా 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.

యూనిట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లతో పాటు పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను సవరించింది. ఖాతాలో రూ.5 లక్షలకు పైగా నిల్వ ఉన్నట్లయితే వినియోగదారులు ఇప్పుడు ఏడాదికి 7 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. ఈ సవరించిన రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. రూ.1 లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై ఏడాదికి 4.5 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్న నిల్వలపై ఏడాదికి 6 శాతం వడ్డీ లభిస్తుంది. పొదుపు ఖాతాలపై వడ్డీని నెలవారీ ప్రాతిపదికన జమ చేస్తామని బ్యాంక్ తెలిపింది. వర్తించే స్లాబ్ విధానం ఆధారంగా వడ్డీ గణన జరుగుతుందని వివరించింది.
బ్యాంక్ సవరించిన డిపాజిట్ వడ్డీ రేట్లు మార్పులకు లోబడి ఉంటాయని బ్యాంక్ పేర్కొంది. అప్పటికి అమలులో ఉన్న నిబంధనలు, షరతుల ప్రకారం వర్తిస్తాయని తెలిపింది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఉన్న డిపాజిట్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) వారి డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం కిందకు వస్తాయి. వర్తించే నిబంధనలకు లోబడి, ప్రతి డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు బీమా కవరేజ్ ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications