SSY: నెలకు రూ.12,500 పెట్టుబడితో రూ.71,82,119 సొంతం చేసుకోవచ్చు..!
ఆడ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై భయంతో ఉంటారు. వారి చదువు, తర్వాత పెళ్లి కోసం సంపాదించాలని ఆరాటపడుతుంటారు. అయితే ఆడ పిల్లల కోసం కేంద్రం ఒక పథకం తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం కింద తక్కువ మొత్తంలో పొదుపు చేసి ఎక్కువ మొత్తంలో పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పుట్టిన పిల్లల నుంచి 10 ఏళ్ల పిల్లలకు చేరవచ్చు. ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకే పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో 15 ఏళ్ల వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తం అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత వస్తుంది.
పోస్టాఫీస్ లేదా ఏదైనా బ్యాంకులో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు. ఇందుకు సంబంధించి పాప ఆధార్ కార్డు, డేటా ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కావాలి. తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి ఆధార్, పాన్ కార్డు, ఫొటోలు అవసరం ఉంటాయి. ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.1,50, 000 పొదువు చేయవచ్చు. ఒక సంవత్సరంలో కనీస మొత్తం రూ.250 చెల్లించకుంటే ఖాతా డియాక్టివ్ అవుతుంది. ఫైన్ కట్టి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలలో భాగంగా 8.2 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకంలో క్రమం తప్పకుండా డబ్బులు జమ చేస్తే మంచి మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు మీ పాప 5 ఏళ్ల వయసులో పథకంలో చేరారు అనుకుంటే. మీరు ఈ పథకంలో నెలకు రూ.5 వేలు పెట్టుబడి పెడితే మీ అమ్మాయికి 21 ఏళ్ల తర్వాత రూ.28,72,848 వస్తాయి. ఇందులో రూ.9 లక్షలు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కాగా.. మీకు వడ్డీ రూపంలో 19,72,848 వస్తాయి. మీరు నెలకు రూ.12,500 పొదుపు చేస్తే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.22,50,000, వడ్డీ రూ.49,32,119 మొత్తం రూ.71,82,119 వస్తాయి. ఈ పథకంలో చెల్లించే రూ.1,50,000 వేలకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంతే కాదు పాపకు 18 ఏళ్లు నిండిన తర్వాత పై చదువుల కోసం పాక్షికంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications