PMMY: ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల రుణం.. వడ్డీ కూడా తక్కువే..!

చాలా మందికి వ్యాపారం చేయాలని ఉంటుంది.. కానీ డబ్బు ఉండదు. అందుకే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని జీవిస్తుంటారు. కొంత మంది వద్ద చిన్న వ్యాపారం చేయడానికి డబ్బులు ఉండవు. కిరాణా దుకాణం, మెకానిక్ షాప్, కూరగాయల దుకాణం వంటి పెట్టుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బ్యాంకుల వద్దకు వెళ్తే పూచీకత్తు లేనిది రుణాలు ఇవ్వమని చెబుతుంది. ఇక ఇతర వద్ద అప్పు చేస్తే.. 2 రూపాయల వడ్డి ఉంటుంది. ఇక ఫైనాన్స్ సంస్థలు, ఫైనాన్స్ ఇచ్చే వారి వద్ద అప్పు తెస్తే వడ్డీ రూ.5 నుంచి రూ.7 ఉంటుంది. దీంతో చాలా మంది చిరు వ్యాపారులు సరైన డబ్బు లేక వారి వ్యాపారాన్ని కొసాగించలేకపోతున్నారు.

ఇలాంటి వారి కోసమే కేంద్రప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY). ఇది చిరువ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తాయి. మొదటగా రూ. 50 నుంచి ఈ రుణాలు మొదలవుతాయి. కాగా ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ముద్రా యోజన కింద గరిష్ఠంగా ఇచ్చే రుణాన్ని రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ఇది చిరు వ్యాపారులకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Mudra

దేశంలో కూరగాయలు, పండ్లు, కిరాణా దుకాణం, మెకానిక్ షాపులు, టైలరింగ్ షాపులు నడిపే వారికి ఈ పథకం చక్కగా ఉపయోగపడనుంది. వీరంతా కూడా ముద్ర యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మొదటి సారిగా రూ.20 లక్షల లోన్ రాదని గుర్తుంచుకోవాలి. ముద్ర యోజనలో మూడు విభాగాలు ఉంటాయి. మొదట శిసు లోన్ ఉంటుంది. ఇందులో రూ.50 వేలకు రుణం ఇస్తారు. ఆ తర్వాత కిశోర్ లోన్ ఉంటుంది. ఇందులో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఇక తరుణ్ లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు. దీన్ని ఈ మధ్యే రూ.20 లక్షలకు పెంచారు.

చిరు వ్యాపారులు మొదటగా శిశు లోన్ కు దరఖాస్తు చేసుకోవాలి. లోన్ వచ్చిన తర్వాత మీరు క్రమం తప్పకుండా రుణాన్ని తిరిగి చెల్లిస్తే మీరు కిశోర్ రుణానికి అర్హులు అవుతారు. తరుణ్ రుణానికి మాత్రం మీ వ్యాపారాన్ని బట్టి రుణం వస్తుంది. ముద్ర లోన్ వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈ ముద్ర లోన్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, వ్యాపార చిరునామా ఆధారాలు , గత కొన్ని నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి. అయితే బ్యాంక్ అధికారులు వెరిఫికేషన్ చేసి రుణాన్ని మంజూరు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+