PM Suraksha Bima Yojana: రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు మీ సొంతం..!

దేశంలో ఇప్పటికీ సగం మందికి పైగా బీమా లేదు. చాలా మంది బీమా చేసుకోవడాన్ని లైట్ తీసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో సంపాదించే వారు ఒక్కరే ఉండి ఉంటే వారు తప్పని సరిగా జీవిత బీమా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే చాలా మంది తమ వద్ద డబ్బులు లేవని.. బీమా ఎలా తీసుకుంటామని చెబుతుంటారు. అయితే బీమా కోసం భారీగా చెల్లించాల్సి అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా తక్కువగా ప్రీమియం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి కేంద్రం ప్రభుత్వం ఒక బీమా పథకం తీసుకొచ్చింది.

అదే పీఎం సురక్ష బీమా యోజన పథకం. ఇందులో చాలా తక్కువ మొత్తంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా దీన్ని రూపొందించారు. చాయ్ తాగే పైసలతో పీఎం సురక్ష బీమా యోజన ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే మీకు రూ.2 లక్షల బీమా కవరేజ్ ఉంటుంది. ఇంత తక్కువ ప్రీమియంలో ఇంత ఎక్కువ కవరేజ్ మరెక్కడ కూడా ఉండదు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది. అయితే ఈ పథకంలో చేరేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ బీమా పాలసీ తీసుకునేందుకు అర్హులు.

PM Suraksha Yojana

ఇందుకు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ.. ఒక్క అకౌంట్ ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంది. జాయింట్ అకౌంట్ ఉంటే ఇద్దరూ రూ.20 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రీమియం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆటో డెబిట్ ప్రక్రియ ద్వారా కట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా కవరేజ్ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నరాు. రూ.20 కడితేనే రెన్యూవల్ అవుతుంది. లేకపోతే స్కీమ్ నుంచి తొలగిస్తారు. ఏడాది మధ్యలో అయినా ప్రీమియం చెల్లించి ఈ స్కీములో చేరే అవకాశం కల్పించారు.

అనుకోని పరిస్థితుల్లో ఈ బీమా తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు కుటుంబసభ్యులు లేదా నామినీకి రూ.2 లక్షలు అందనున్నాయి. ఈ పథకంలో రోజువారీ కూలీ పనులు చేసుకునే వారు కూడా చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా తక్కవ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందని వివరిస్తున్నారు. బీమా పథకంలో చేరిన వారు రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అంగవైకల్యం వచ్చినా రూ.2 లక్షలు వస్తాయి. హత్య జరిగినప్పుడు కూడా క్లెయిమ్ అందుతుందని చెబుతున్నారు. ఆత్మహత్యలకు ఇవి వర్తించదని స్పష్టం చేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+