UCO Bank: దేశీయంగా కార్పొరేట్ కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ గత పనితీరును మెరుగుపరుచుకుంటూ భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ఇలాంటి కంపెనీల షేర్లపై దృష్టి సారిస్తున్నారు.
ప్రభుత్వ రంగంలోన యూకో బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ బలమైన త్రైమాసిక లాభాలను చూసింది. వాస్తవానికి లాభం 50 శాతం పెరిగి రూ.603 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ ఫలితాల్లో వెల్లడైంది. వాస్తవానికి వడ్డీ ఆదాయంలో పెరుగుదల లాభాలను పెంచటంతో సహాయపడిందని బ్యాంక్ వెల్లడించింది. గత ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యూకో బ్యాంక్ లాభం కేవలం రూ.402 కోట్లుగా నమోదైంది. అలాగే కంపెనీ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.7,071 కోట్లుగా ఉంది.

బ్యాంక్ లాభాలకు భారీగా తోడ్పాటును అందించిన వడ్డీ ఆదాయాన్ని పరిశీలిస్తే.. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో రూ.5,219 కోట్ల నుంచి ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో రూ.6,078 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.2,301 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2 చివరినాటికి 2.84 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ త్రైమాసికంలో 3.10 శాతానికి పెరిగింది. ప్రస్తుత బ్యాంక్ ఉత్తమ పనితీరు జోరు కొనసాగుతుందని భావిస్తున్నట్లు ఎండీ, సీఈవో అశ్విని కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉండగా వ్యాపార అవసరాల కోసం కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో రూ.2000 కోట్లను వాటాల విక్రయం ద్వారా సమీకరించాలని చూస్తోంది.
వ్యూహంలో భాగంగా ప్రస్తుత త్రైమాసికంలో రూ.1,500-2,000 కోట్ల విలువైన సంస్థాగత నియామకాలను తీసుకురావడానికి ప్రణాళికలు ఉన్నాయి. దీంతో బ్యాంకులో ప్రభుత్వ వాటా 2-3 శాతం తగ్గుతుంది.యూకో బ్యాంక్‌లో భారత ప్రభుత్వ వాటా సెప్టెంబర్ 2024 చివరి నాటికి 95.39 శాతంగా ఉంది. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో యూకో బ్యాంక్ స్టాక్ ధర స్వల్ప లాభంతో ఎన్ఎస్ఈలో రూ.45.75 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కె్ట క్యాప్ ప్రస్తుతం రూ.54,590 కోట్లుగా ఉంది. అలాగే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.70.65గా ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.34.75 వద్ద ఉంది. నిపుణులు ఈ ఏడాది చివరి నాటికి ఒక్కో షేరు ధర రూ.60 స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

Bengaluru: బెంగళూరు పవర్ ప్లాంట్ బంద్.. కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?



Click it and Unblock the Notifications