కరోనా మహమ్మారి నేపథ్యంలో గత పద్దెనిమిది నెలల కాలంలో అన్-సెక్యూర్డ్ రుణ రంగం భారీ వృద్ధిని నమోదు చేసింది. వైరస్ నేపథ్యంలో 2020 ప్రారంభంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవడం లేదా వేతనాల కోతతో ఉద్యోగులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆర్థిక ఒత్తిడి నుండి గట్టెక్కేందుకు చాలామంది పర్సనల్ లోన్ వంటి అన్-సెక్యూర్డ్ రుణాల వైపు మొగ్గు చూపారు. పర్సనల్, కన్స్యూమర్, టూ వీలర్ లోన్ సెగ్మెంట్ రంగం మంచి వృద్ధిని నమోదు చేసింది. రెగ్యులర్ ఖర్చుల కోసం పర్సనల్ లోన్ ఏమాత్రం సరైన ఎంపిక కాదు.
కానీ అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్ సహజ ఎంపిక. గోల్డ్ లోన్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ లోన్స్ వంటి ఆప్షన్ పూర్తయ్యాక పర్సనల్ లోన్ వైపు చూడవచ్చు. హోమ్ లోన్, వెహికిల్ లోన్ సహా వివిధ రకాల లోన్స్‌తో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 8.9 శాతం నుండి 10.15 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తున్న టాప్ టెన్ బ్యాంకులు చూద్దాం....

రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు, ఈఎంఐ ఇలా ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 8.90 శాతం, ఈఎంఐ రూ.10,355.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 8.90 శాతం, ఈఎంఐ రూ.10,355.
పంజాబ్ నేషనల్ బ్యాంకు - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 8.95 శాతం, ఈఎంఐ రూ.10,367.
ఇండస్ఇండ్ బ్యాంకు - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.05 శాతం, ఈఎంఐ రూ.10,391.
పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.50 శాతం, ఈఎంఐ రూ.10,501.
ఐడీబీఐ బ్యాంకు - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.50 శాతం, ఈఎంఐ రూ.10,501.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.55 శాతం, ఈఎంఐ రూ.10,513
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.60 శాతం, ఈఎంఐ రూ.10,525
బ్యాంక్ ఆఫ్ బరోడా - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10.00 శాతం, ఈఎంఐ రూ.10,624
యూకో బ్యాంకు - పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10.05 శాతం, ఈఎంఐ రూ.10,636
పై పట్టికలో బీఎస్ఈ లిస్టింగ్ పబ్లిక్, ప్రయివేటు బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు అందించారు. పైన పట్టికలో వడ్డీ రేట్ల ఆధారంగా బ్యాంకులను ఆరోహణ క్రమంలో జాబితా చేశారు. అత్యల్ప వడ్డీ రేటును అందించే బ్యాంకులు పైన, అధిక వడ్డీ రేటును ఇచ్చే బ్యాంకులను కింద అందించారు.
సాధారణ పర్సనల్ లోన్స్‌తో పాటు కొన్ని బ్యాంకులు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కోవిడ్ 19 స్పెసిఫిక్ పర్సనల్ లోన్స్‌ను అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్ పర్సనల్ లోన్ వడ్డీ రేటు 6.85 శాతం నుండి ప్రారంభమవుతోంది.


Click it and Unblock the Notifications