ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫైనాన్స్ గురించి ఆలోచించాల్సిన కాలం ఇది. అప్పులు తేలికగా లభిస్తున్నాయి, కానీ వాటిని తీర్చడం ఎంతో కష్టమవుతోంది. ఒక రెడ్డిట్ యూజర్ ఇటీవల తన నిజ జీవిత అనుభవాన్ని పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతడు తన మీద ఉన్న రూ. 12.2 లక్షల అప్పును కేవలం 2 సంవత్సరాల్లో తీర్చాడు, అది కూడా పెద్ద సంపాదన లేకుండానే!

అతను ఉపయోగించిన పద్ధతి పేరు - Debt Snowball Method ఇది ఆశ్చర్యంగా అనిపించినా, ఈ పద్ధతిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. మనం కూడా ఈ పద్ధతిని నేర్చుకుంటే అప్పుల నుంచి బయటపడడం అసాధ్యం కాదు.
డెబ్ట్ స్నోబాల్ విధానం అంటే ఏమిటి?
డెబ్ట్ స్నోబాల్ అనేది ఏదైనా బకాయిలను, చిన్న మొత్తంలో ఉన్న అప్పులని మొదట తీర్చడం ద్వారా ఛార్జీలు తక్కువ చేసి, మిగతా వాటికి కనీస నెలవారీ చెల్లింపులు చేస్తూ ముందుకు సాగే విధానం. ఉదాహరణకు, మీ వద్ద రూ. 500, రూ. 1,000, రూ. 2,000 వంటి మూడు లోన్లు ఉన్నాయని అనుకుందాం. డెబ్ట్ స్నోబాల్ ప్రకారం, ముందు రూ. 500 లోన్ తీర్చాలి; మిగిలినవి కనీస చెల్లింపులు మాత్రమే చెలిస్తా ఉండాలి. అది పూర్తయిన తర్వాత, ఆ మొత్తాన్ని తర్వాతి చిన్న లోన్ (రూ. 1,000) కు జత చేస్తారు. తద్వారా ఆ లోన్ కూడా త్వరగా తీర్చవచ్చు.
ఈ విధంగా ఒక్కొక్క అప్పు పూర్తయ్యే కొద్దీ వ్యక్తికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మానసిక భారం తగ్గుతుంది. ఇలా చివరకు పెద్ద అప్పుల వరకూ చేరి అవి కూడా సులభంగా తీర్చవచ్చు. ఈ పద్ధతిని ఆర్థిక నిపుణుడు డేవ్ రాంసే విస్తృతంగా ప్రోత్సహించారు. డెబ్‌ట్ స్నోబాల్ పద్ధతి ముఖ్యంగా మానసిక ఉత్సాహాన్ని పెంచి, నిరంతర ప్రగతిని చూపించే ఫలితాల వలన చాలా మందికి అనుకూలంగా ఉంటుంది.
ఈ రెడ్డిట్ యూజర్ తన ప్రయాణంలో ఎదురుకున్న కొన్ని సమస్యలను కూడా నిజాయితీగా పంచుకున్నారు. 2023లో ఉద్యోగం కోల్పోయిన సమయంలో, ఆయనకు ఉన్న విద్య లోన్ మరియు కార్ లోన్ చెల్లింపుల్లో ఆలస్యం జరిగిందట. దీంతో, కొన్ని నెలల పాటు అతని సిబిల్ స్కోరు తీవ్రంగా ప్రభావితమైంది. కొన్ని చెల్లింపులు 30 రోజులవైనా, మరికొన్ని 60 రోజుల వరకు ఆలస్యంగా నమోదయ్యాయి. అయితే, కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత వెంటనే ఫైనాన్షియల్ క్రమశిక్షణను పాటించడానికి నిర్ణయించుకున్నారు. అప్పుల రీపేమెంట్ పై పూర్తి దృష్టి పెట్టారు. అన్నింటినీ క్రమంగా తీర్చడంతో పాటు, పాత బాకీలను క్లియర్ చేయగానే స్కోరు కూడా దాదాపు 40 పాయింట్లు పెరిగిందని చెప్పారు. ఈ అనుభవం అతన్ని చిన్న మొత్తాల నుంచి ప్రారంభించి, స్థిరంగా ఈ పద్ధతిలో ప్రయాణం కొనసాగించడానికి ప్రేరేపించిందని వెల్లడించారు.
ఇతను రెడ్డిట్ లో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాక చాలా మంది అతనికి వాళ్ళ కామెంట్స్ పెట్టారు. ఇలా ఒకరు, "రూ. 12.2 లక్షలు తీర్చే సమయంలో సిబిల్ స్కోర్ ప్రభావం ఏమైనా తలపడిందా?", "కనీస చెల్లింపులు ఎలా చేశారు?", "ఎమీఐలు వాయిదా వేయడంతో ఫోన్లు వచ్చాయా?" అని అడిగారు. ఆయన సమాధానాలు "నియమితంగా చెల్లించటం మొదలైన తర్వాత, సిబిల్ స్కోర్ మెరుగైంది. మొత్తం బకాయిలు క్లియర్ చేసి సాధారణ స్థితికి తెచ్చేసరికి నా స్కోర్ 40 పాయింట్లు పెరిగింది. క్రెడిట్ కార్డ్స్, BNPLలకు మాత్రమే కనీస డ్యూస్ ఉండేవి; ఇతర వాటికి నిశ్చితమైన EMIలు. నేను వ్యక్తిగతంగా ఆలస్యపు చెల్లింపులు విద్యా, కార్ లోన్లకు మాత్రమే చేశాను. ఇవి ప్రభుత్వ బ్యాంక్ నుంచి వారు చాలాసార్లు మెయిల్స్ పంపారు, బ్యాంక్ మేనేజర్, AGM, DGMల నుంచి కాల్స్ వచ్చాయి. కానీ నా లోన్‌పై ప్రాపర్టీని బెయిలుగా పెట్టడం వల్ల, నేను ఎక్కువ నష్టాన్ని మోయవలసి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
నిజానికి, నా అవసరాలకు తప్ప, ఇతర అన్నీ ఖర్చులు తగ్గించా. ఇంటి అద్దె, కూరగాయలు, కరెంట్, ఇతర అవసరాలకే ఖర్చు పెట్టాను. ఈ రెండు సంవత్సరాల్లో కార్ లో ఫుల్ ట్యాంక్ కేవలం 3-4 సార్లు పెట్టా; మిగతా అప్పుడల్లా రూ. 500 పెట్రోల్ పోసేవాడిని, ఎక్కువ ప్రయాణించాలంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాడిని." అని అయిన సమాధానం ఇచ్చారు.
చివరగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్పు ఎంత పెద్దదైనా, సరైన వ్యూహం, క్రమశిక్షణ, మరియు చిన్న చిన్న విజయాల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు దాన్ని అధిగమించవచ్చు. ఈ రెడ్డిట్ వాడి అనుభవం మనందరికీ స్పష్టంగా చెబుతోంది. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి మొదటి అడుగు తీసుకోవడమే నిజమైన విజయానికి ప్రారంభం. డెబ్ట్ స్నోబాల్ విధానంలో ప్రతి చిన్న అప్పును తీర్చే ప్రతి అడుగు, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications