అత్యవసర పరిస్థితుల్లో టాప్-అప్ లోన్ బెట్టర్, హోమ్ టాప్-అప్ మరింత ప్రయోజనం
టాప్ అప్ లోన్ అంటే ఇప్పటికే రుణం తీసుకున్నప్పటికీ, అదనంగా తీసుకునే రుణం. అత్యవసర పరిస్థితుల్లో చాలామంది బంగారం రుణాల తాకట్టుతో పాటు టాప్ అప్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎమర్జెన్సీ సమయంలో టాప్ అప్ మంచి ఎంపిక అని ఆర్థిక నిపుణుల సూచన. ఎందుకంటే టాప్ అప్ లోన్ త్వరగా, మంచి వడ్డీ రేటుకు లభిస్తాయని చెబుతున్నారు.
మీరు ఇప్పటికే హోమ్ లోన్ తీసుకొని ఉంటే, దీర్ఘకాలిక వ్యవధికి అప్పు కావాలన్నా టాప్ అప్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్ లోన్ పైన కూడా టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. హోమ్ లోన్‌కు చెల్లించే వడ్డీకి, అసలుకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24, సెక్షన్ 80సీ పరిమితుల మేరకు మినహాయింపు లభిస్తుంది.

టాప్ అప్ తీసుకొని, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు ఉపయోగించినప్పుడు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి టాప్-అప్ లోన్ తీసుకున్నప్పుడు ఆ ఇంటి మొత్తాన్ని కొనుగోలు లేదా నిర్మాణానికి ఉపయోగించినట్లు అవుతుంది. దీనికి సంబంధించి రిసిప్ట్స్, ఇతర డాక్యుమెంట్స్ ఇవ్వవలసి ఉంటుంది.
సాధారణంగా పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ తీసకుంటే ఆయా రుణాలను బట్టి ఏడాది నుండి పదిహేనేళ్ల వరకు ఉండవచ్చు. హోమ్ లోన్ అయితే ఇరవై ఏళ్లు కనీసం ఉంటుంది. టాప్ అప్ రుణానికి కూడా ఇదే వర్తిస్తుంది. దీర్ఘకాలంలో రుణం తీర్చుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంతో వచ్చే టాప్ అప్ హోమ్ లోన్ మిగతా టాప్ అప్ లోన్స్ కంటే కాస్త బెట్టర్. ఇప్పటికే రుణగ్రహీతకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి లోన్ ప్రాసెస్ సులభమవుతుంది. అలాగే, వడ్డీ రేటు హోమ్ లోన్ వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది. పర్సనల్ లోన్ టాప్ అప్ అయితే దానికి సమానంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications