ఇటీవలి కాలంలో దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. కరోనా సమయంలో షేర్ మార్కెట్, బులియన్ మార్కెట్ సహా వివిధ వాటిలో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరిగింది... పెరుగుతోంది. కొంతమంది తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు, కొంతమంది భారీ రిటర్న్స్ కోసం ఎక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు మొగ్గు చూపితే, మరికొంతమంది తక్కువ రిటర్న్స్ వచ్చినా మంచిదే కానీ రిస్క్ వద్దు అనుకునే వారు ఉంటారు. ఈ నేపథ్యంలో మన వద్ద ఉన్న వివిధ రకాల పెట్టుబడి ఆప్షన్స్ ఓసారి చూద్దాం...

రెండు రకాల పెట్టుబడులు
పెట్టుబడుల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్ పెట్టుబడి, రెండోది నాన్-ఫైనాన్షియల్ అసెట్ పెట్టుబడి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటివి ఫైనాన్షియల్ పెట్టుబడి సాధనాలు. బంగారం, రియల్ ఎస్టేట్ నాన్-ఫైనాన్సింగ్ పెట్టుబడి సాధనాలు.

డైరెక్ట్ ఈక్విటీ
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడినది. ఇందులో రిటర్న్స్ రావొచ్చు లేదా రాకపోవచ్చు. ఉన్నదాంట్లోను నష్టపోవచ్చు. కాబట్టి రిస్క్ వద్దనుకునే వారు దీనికి దూరంగా ఉంటారు. అయితే సరైన స్టాక్‌ను, స్టాక్ చరిత్రను, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తే కొంత మేర ప్రయోజనం ఉంటుంది. ఒక వాస్తవం ఏమంటే దీర్ఘకాలంలో ఇతర అన్ని అసెట్ క్లాస్‌లతో పోలిస్తే ఈక్విటీ మాత్రమే ద్రవ్యోల్భణం-సర్దుబాటు చేసిన రాబడుల కంటే ఎక్కువ అందించింది.నష్టాలను తగ్గించుకోవడానికి స్టాప్ లాస్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రమే గణనీయమైన నష్టం నుండి బయటపడవచ్చు. మూలధనం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రిస్క్ తగ్గించడానికి రంగాలు, స్టాక్స్ వైవిద్యం ప్రదర్శించాలి. ఇందులో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేయాలి.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ప్రధానంగా ఈక్విటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రస్తుతం సెబి మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తప్పనిసరిగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 65 శాతం ఇన్వెస్ట్ చేయాలి. జాతీయ, అంతర్జాతీయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.

డెట్ మ్యూచువల్ ఫండ్స్
డెట్ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా స్థిర రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు అనుకూలం. తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. అందుకే ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే తక్కువ రిస్క్‌గా పరిగణించబడతాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రాథమికంగా కార్పోరేట్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, కమర్షియల్ పేపర్, ఇతర మనీ మార్కెట్ సాధనాల వంటి స్థిర వడ్డీ ఉత్పాదక సెక్యూరిటీలలో పెట్టుబడులు పెడతాయి. అయితే మ్యూచువల్ పండ్స్ అంటేనే రిస్క్. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు, పూర్తి అవగాహన అవసరం.

నేషనల్ పెన్షన్ సిస్టమ్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ఫోకస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్. దీనిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది. ఎన్పీఎస్‌కు ప్రతి ఏడాది కనీస మొత్తం కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఎన్పీఎస్ టైర్ 1 అకౌంట్ కనిష్ట పరిమితిని రూ.6000 నుండి రూ.1000కి తగ్గించింది. ఇది ఈక్విటీ, ఫిక్స్డ్ డిపాజిట్, కార్పోరేట్ బాండ్, లిక్విడ్ ఫండ్, గవర్నమెంట్ ఫండ్ మిశ్రమం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) పదిహేనేళ్ల దీర్ఘకాల పెట్టుబడి. పన్ను మినహాయింపుకు మంచి పెట్టుబడి సాధనం. మూడు నెలలకు ఓసారి వడ్డీ రేటును సవరిస్తారు. పెట్టుబడి మొత్తం, వడ్డీ కలిపి గ్యారెంటీ ఉంటుంది. ఇది అత్యంత సురక్షిత పెట్టుబడుల్లో ఒకటి.

బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్
సురక్షిత పెట్టుబడిని కోరుకునే వారు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. రూ.5 లక్షల వరకు DICGC గ్యారెంటీ ఉంటుంది. వివిధ బ్యాంకుల్లో వివిధ వడ్డీ రేటు ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా భద్రమైన పెట్టుబడి సాధనం. ఈ పథకాన్ని పోస్టాఫీస్ లేదా బ్యాంకు ద్వారా ఓపెన్ చేయవచ్చు. 60 ఏళ్లకు పైబడిన వారు దీనిని ఓపెన్ చేయవచ్చు. ఇది అయిదేళ్ల కాలపరిమితితో కూడిన పెట్టుబడి. మెచ్యూరిటీ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు.

ప్రధానమంత్రి వయవందన యోజన
ప్రధానమంత్రి వయవందన యోజన ద్వారా అరవై ఏళ్లు, ఆ పైబడిన వారికి 7.4 శాతం వడ్డీ రేటుతో అస్యూర్డ్ అమౌంట్ ఉంటుంది. నెలకు రూ.1000 నుండి గరిష్టంగా రూ.9250 చెల్లించవచ్చు. గరిష్ట పరిమితి రూ.15 లక్షలు. ఈ స్కీమ్ కాలపరిమితి పదేళ్లు. మార్చి 31, 2023 వరకు ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసినవారు చనిపోతే నామినీకి మొత్తం వస్తుంది.

రియల్ ఎస్టేట్
ఇటీవలి కాలంలో రియల్టీ పుంచుకుంది. రియాల్టీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో పొందుతున్నారు. ప్రస్తుతం భూమి బంగారం కంటే విలువైనదిగా మారింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కొద్ది కాలంలోనే ఫిక్స్డ్ డిపాజిట్ నుండి మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ కంటే అధిక రాబడిని పొందవచ్చు. అయితే చేతిలో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలి.

బంగారం
బంగారం అత్యంత సురక్షిత పెట్టుబడుల్లో ఒకటి. కరోనా వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ధరలు పడిపోయి, ఇన్వెస్టర్లు నష్టపోయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మంచి పెట్టుబడి. కరోనా సమయంలో భారీగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం కరోనా కంటే ముందుస్థాయిలోనే ఉంది. పసిడి ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్లకు పైన, దేశీయ మార్కెట్లో 48,000కు పైన ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications