గత ఏడాది కరోనా కారణంగా భారీగా ఎగిసిన క్రిప్టో కరెన్సీలు ఈ ఏడాది ప్రారంభంలోను పెరిగాయి. కానీ టర్కీ, చైనా వంటి దేశాల కీలక నిర్ణయాలు, ఎలాన్ మస్క్ ప్రకటనలు బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీలకు చుక్కలు చూపించాయి. దీంతో క్రిప్టో మార్కెట్ గత కొంతకాలంగా దారుణంగా పతనమైంది. ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ వంటి క్రిప్టోలు క్షీణించినప్పటికీ, పూర్తి ఏడాది కాలానికి భారీగానే పెరిగాయి. 2021లోను ఆశాజనకంగా ఉండవచ్చునని క్రిప్టో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బిట్ కాయిన్, ఎథేరియం
- జూన్ నెలలో క్రిప్టోకింగ్ బిట్ కాయిన్ ఫ్లక్చువేట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఇది. దీని మార్కెట్ క్యాప్ గత నెల అంటే జూన్ 22న ఏకంగా 29,337 డాలర్ల స్థాయికి పడిపోయింది. జూలై నెల నుండి క్రమంగా కాస్త పుంజుకుంటోంది. ప్రస్తుతం రూ.34,380 డాలర్ల వద్ద ఉంది.
- ఎథేరియం వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ. జూన్ 22న ఇది 1733 డాలర్లకు పడిపోయింది. జూలై నెలలో క్రమంగా పుంజుకొని, 2356 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం 2258 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

బెస్ట్ 5 క్రిప్టోల్లో...
- బెస్ట్ 5 క్రిప్టోల్లో కార్డానో ఉంటుంది. జూన్ నెలలో ఇది 1.0203 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. జూలై నెలలో తిరిగి పుంజుకొని 1.492 వరకు వెళ్లింది. నేడు 1.42 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
- రిప్పిల్ క్రిప్టో జూన్ 5వ తేదీన 0.9937 డాలర్లు పలికింది. ఆ తర్వాత 0.86 డాలర్ల నుండి 0.84 డాలర్ల మధ్య కదలాడింది. జూన్ 22న 0.52 డాలర్ల స్థాయికి పతనమైంది. ప్రస్తుతం 0.70 డాలర్ల వద్ద ఉంది.
- పోల్కాడాట్ జూన్ నెలలో 20 డాలర్ల నుండి 25 డాలర్ల మధ్య కదలాడింది. ఆ తర్వాత 13 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 16 డాలర్ల వద్ద ఉంది.

ఇవి కూడా...
- యునీస్వాప్ భారీగా ఎగిసిపడుతోంది. జూన్ నెలలో ఇది 14.28 డాలర్ల మధ్య కదలాడింది. జూలలో 21.48 డాలర్లకు ఎగిసిపడింది. ప్రస్తుతం 20.32 డాలర్ల వద్ద కదలాడుతోంది.
- చైన్ లింక్ క్రిప్టోకరెన్సీ జూన్ నెలలో 20 డాలర్ల నుండి 25 డాలర్ల మధ్య కదలాడింది. తర్వాత 15.26 డాలర్లకు పతనమైంది. క్రమంగా ఎగిసి 19.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications