క్రిప్టో కరెన్సీ మళ్లీ పుంజుకుంది. బిట్ కాయిన్, ఎథేరియం, సోలానా వంటి క్రిప్టోలు గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 3 శాతం చొప్పున ఎగిశాయి. గతవారం చివరి సెషన్‌లలో నష్టపోయిన క్రిప్టో, ఈ వారం ప్రారంభంలోనే అదరగొడుతోంది. టాప్ 10 క్రిప్టోల్లో ఏడు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఎక్కువ క్రిప్టో కరెన్సీల్లో ఈ లాభాలు ఎక్కువగా లేవు. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజషన్ రెండు శాతం లాభపడి 2.87 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 8 శాతం క్షీణించి 87.71 బిలియన్ డాలర్లుగా నమోదయింది. మరో డిజిటల్ ఎన్ఎఫ్‌టీ మార్కెట్ క్రితం సెషన్‌లో భారీగా లాభపడింది. ఈ రోజు బిట్ కాయిన 1.7 శాతం, ఎథేరియం 1.5 శాతం, బియాన్స్ కాయిన్ 1 శాతం, సోలానా 2.82 శాతం, ఎక్స్‌పీఆర్ 1.78 శాతం, పోల్కాడాట్ 0.04 శాతం, డోజీకాయిన్ 0.32 శాతం లాభపడ్డాయి. టెథేర్ 0.05 శాతం, కార్డానో 0.1 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం నష్టపోయాయి.

ఈ క్రిప్టో 67,000 శాతం జంప్
ఇటీవల పలు క్రిప్టో కరెన్సీలు భారీగా లాభపడుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా వేల శాతం ఎగిసిపడుతున్నాయి. ఈ కోవలోకే షిబా ఇను, కోకోస్వాప్ వస్తాయి. తాజాగా మరో క్రిప్టో హస్కీX గత ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా 67,000 శాతం లాభపడింది. ఇది 0.000000008738 డాలర్ల వద్ద చిన్నగా ప్రారంభమై, 0.000001485 డాలర్లకు ఎగిసింది. సాయంత్రానికి దీని ధర 0.0000174899 డాలర్ల సమీపంలో ఉంది.
మెమె కాయిన్ 3450 శాతం ఎగిసింది. దీని మొత్తం వ్యాల్యూ 1.06 మిలియన్ డాలర్లుగా ఉంది. హస్కీX అనేది ప్రతి ద్రవ్యోల్భణ టోకెన్. సరఫరా ఎప్పటికి అప్పుడు తగ్గుతున్న మోడ్‌లో ఉన్నందున, ఇది అరుదైనది.

బిట్ కాయిన్ అతిపెద్ద క్రిప్టో
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,375 వరకు క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, వ్యాల్యూపరంగా అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్. క్రిప్టోను ఫ్యూచర్ మనీగా భావిస్తున్నారు. పలు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయని అంటున్నారు.
బిట్ కాయిన్, బియాన్స్ కాయిన్, కార్డానో, ఎథేర్. పోల్కాడాట్, పాలోగోన్, సోలానావటి బ్లాక్ చైన్ క్రిప్టోల్లోను ఇన్వెస్ట్ చేయవచ్చుననేది క్రిప్టో మార్కెట్లో ఉన్నవారి అభిప్రాయం.

నేడు భారీగా లాభపడిన క్రిప్టోలు
HuskyX: $0.000001857 - 24 గంటల్లో 5,383.72 శాతం వృద్ధి,
Impermax: $2.71 - 24 గంటల్లో 723.63 శాతం వృద్ధి,
Angry Squid: $0.00000781 - 24 గంటల్లో 641.22 శాతం వృద్ధి,
BNBeer: $0.000000002505 - 24 గంటల్లో 223.30 శాతం వృద్ధి,
Primecoin: $0.8622 - 24 గంటల్లో 168.56 శాతం వృద్ధి,
భారీగా నష్టపోయిన క్రిప్టోలు..
CashBack Pro: $0.1475 - 24 గంటల్లో 96.97 శాతం క్షీణత,
Nemesis DAO: $537.24 - 24 గంటల్లో 63.13 శాతం క్షీణత,
Vee Finance: $0.03983 - 24 గంటల్లో 62.84 శాతం క్షీణత,
Qrkita Token: $0.000006056 - 24 గంటల్లో 61.14 శాతం క్షీణత,
BitShiba: $0.0000001503 - 24 గంటల్లో 52.78 శాతం క్షీణత.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications