మీ పర్సనల్ ఫైనాన్స్ కోసం... టాప్ 5 గవర్నమెంట్ బ్యాక్డ్ రుణ పథకాలు

భారత ఆర్థిక వ్యవస్థకు మైక్రో, స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్‌ప్రైజ్ (MSME) రంగం ఆయువుపట్టు. దేశంలో ఎక్కువమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోన్నది ఈ రంగం. భారత జీడీపీలో 30 శాతం ఈ రంగానిదే. భారత ఆర్థిక రంగంలో MSME రంగం పోషిస్తోన్న పాత్రను పరిగణలోకి తీసుకొని, భారత ప్రభుత్వం ఈ రంగం అభివృద్ధి చెందడానికి అనేక రకాల ఫైనాన్సింగ్ ప్యాకేజీలను అందిస్తోంది. ప్రభుత్వ ఆధారిత వ్యాపార రుణాలు, ఎంఎస్ఎంఈలకు వారి ప్రస్తుత కార్యకలాపాలు కొనసాగించేందుకు, విస్తరించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను అందిస్తాయి. 2022లో మీ పర్సనల్ ఫైనాన్స్ కోసం ఐదు గవర్నమెంట్ బ్యాక్డ్ లోన్ స్కీమ్స్‌ను ఇక్కడ తెలుసుకోండి.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(PMJDY)

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(PMJDY)

PMJDY ద్వారా ప్రాథమిక పొదుపులు, డిపాజిట్ ఖాతాలు, బీమా, చెల్లింపులు, క్రెడిట్, పెన్షన్ వంటి ఆర్థిక సేవలకు చవకైన ప్రాప్యతను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతా, అలాగే క్రెడిట్, ఆర్థిక అక్షరాస్యత, బీమా, పెన్షన్ వంటి యాక్సెస్ అవుతాయి. PMJDY ఖాతాదారుకు రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా ఉంది.

కొత్తగా ఈ ఖాతాను ఓపెన్ చేసిన వారికి దీనిని రూ.2 లక్షలకు పెంచారు. అంటే 28-08-2018 తర్వాత ఓపెన్ చేసిన వారికి రెండింతల కవరేజీ ఉంది. రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సుఫర్, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్స్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ (MUDRA)కు PMJDY అకౌంట్స్ ఎలిజిబుల్.

ముద్ర యోజన

ముద్ర యోజన

MUDRA యోజన అంటే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంకు. చివరి మైల్ ఫైనాన్సియర్ వరకు చేరడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సేవా రంగాల్లో రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే ముద్ర బ్యాంకు నేరుగా వ్యాపారవేత్తలకు లేదా వ్యక్తులకు రుణాలు ఇవ్వదు. బ్యాంకు లేదా ఎన్బీఎఫ్‌సీ లేదా MFIల ద్వారా రుణాలు అందిస్తుంది. రుణగ్రహీతలు ముద్ర లోన్స్ కోసం ఉద్యమిమిత్ర పోర్టల్ udyamimitra.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

- శిశు - రుణ మొత్తం 50,000/- వరకు

- కిషోర - రుణ మొత్తం రూ.50,000 నుండి రూ.5 లక్ష వరకు

- తరుణ - రుణ మొత్తం రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు

స్టాండప్ ఇండియా

స్టాండప్ ఇండియా

ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్, ఉద్యోగ-ఉపాధి కల్పన, సాధికారతను పెంచే మరో ప్రభుత్వ స్కీమ్ స్టాండప్ ఇండియా. దేశంలోని వెనుకబడిన రంగం, ప్రజలను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం పేద ప్రజలు దేశ ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకునేలా చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1.25 లక్షల బ్యాంక్ బ్రాంచీల నెట్ వర్క్ ద్వారా ఈ పథకం భారత్ అంతటా కనీసం 2.5 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా ఎస్సీ లేదా ఎస్టీ రుణగ్రహీతకు, అలాగే కనీసం ఒక మహిళా రుణగ్రహీతకు రూ.10 లక్షల నుండి రూ.1 కోటి మంజూరు చేస్తారు. ఈ కింద పేర్కొన్న కేటగిరీల కిందకు మీరు వస్తే రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలు దరఖాస్తు చేసుకోవచ్చు. హ్యాండ్లూమ్ సపోర్ట్, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫైనాన్సింగ్, క్రెడిట్ గ్యారెంటీ ఉంటుంది.

ఆయుష్మాన్ భారత్ (PMJAY)

ఆయుష్మాన్ భారత్ (PMJAY)

ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(PMJAY) మరో ప్రభుత్వ స్కీమ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సురెన్స్/అస్యూరెన్స్ స్కీమ్. పూర్తి గవర్నమెంట్ ఫైనాన్స్డ్ స్కీమ్. నేషనల్ హెల్త్ పాలసీ 2017లో చేసిన సిఫార్సు ఆధారంగా దీనిని ప్రారంభించారు. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఇంపానెల్డ్ తదితర ఆసుపత్రుల్లో చేరితే ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఇది నగదురహిత పథకం. అంటే ఆసుపత్రి సేవలను పొందడానికి మీరు డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

స్కిల్ లోన్ స్కీమ్

స్కిల్ లోన్ స్కీమ్

వివిధ రంగాల్లో ప‌నిచేసే వారు త‌మ త‌మ నైపుణ్యాల‌ను అభివృద్ధి చేసుకునేందుకు భార‌త ప్ర‌భుత్వం ఓ అవ‌కాశం క‌ల్పిస్తోంది. అదే నైపుణ్యాభివృద్ధి ప‌థ‌కం లేదా స్కిల్ లోన్ స్కీమ్. దీని ప్ర‌కారం అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు రుణం పొందేందుకు వీలుంది. ఆర్బీఐ సూచించిన బ్యాంకులు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి. పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, పాలిటెక్నిక్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎడ్యుకేషన్ బోర్డుల గుర్తింపు పొందిన శిక్షణా సంస్థలు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్‌తో భాగస్వామ్యం కలిగిన శిక్షణా కేంద్రాలలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు రుణం పొందవచ్చు. ఈ రుణ పరిధిలోకి వచ్చే ఖర్చులు. ట్యూషన్, కోర్సు ఫీజు, పరీక్ష ఫీజు, గ్రంథాలయ ఫీజు, ప్రయోగశాల ఫీజు, కాషన్ డిపాజిట్, పుస్తకాల ఖర్చులు, పరిస్థితులను బట్టి హాస్టల్‌కు అయ్యే ఖర్చులు, కోర్సుకు అవసరమయ్యే ఇతర ఖర్చులకు ఇస్తారు. రూ.1 లక్ష నుండి రూ.50వేల వరకు రుణం ఇస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+