FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఆగండి.. బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే కంపెనీలివే!
మనం సాధారణంగా డబ్బును దాచుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Bank FD). కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు కార్పొరేట్ ఎఫ్‌డీలు (Corporate FDs) ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ వడ్డీ రేట్లు (Interest Rates) చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 2026లో కొన్ని దిగ్గజ కంపెనీలు తమ ఎఫ్‌డీలపై ఏకంగా 8.25% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

అసలు కార్పొరేట్ ఎఫ్‌డీ అంటే ఏంటి?
బ్యాంకులకు బదులుగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) లేదా ఇతర పెద్ద తయారీ కంపెనీలు ప్రజల నుంచి పెట్టుబడులను సేకరించడాన్నే కార్పొరేట్ ఎఫ్‌డీ అంటారు. ఇందులో బ్యాంక్ ఎఫ్‌డీల కంటే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, రిటర్న్స్ మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
వడ్డీ రేట్లలో టాప్ కంపెనీలు ఇవే! (ఏప్రిల్ 2026 నాటికి)
ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధిక వడ్డీని అందిస్తున్న టాప్ కంపెనీల జాబితా ఓ సారి చూస్తే..
- మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్: 1 నుంచి 3 ఏళ్ల కాలపరిమితికి 8.25% వడ్డీని అందిస్తోంది.
- ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్: 36 నెలల కాలానికి అత్యధికంగా 8.95% వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది.
- శ్రీరామ్ ఫైనాన్స్: 3 నుంచి 5 ఏళ్ల కాలానికి 7.60% వడ్డీ లభిస్తుంది.
- కేరళ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ (KTDFC): 1 నుంచి 5 ఏళ్ల కాలానికి 7.00% వరకు వడ్డీ ఇస్తోంది.
- మహీంద్రా ఫైనాన్స్: 2 నుంచి 5 ఏళ్ల కాలానికి 7.00% వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- ICICI హోమ్ ఫైనాన్స్: 45 నెలల కాలానికి 7.00% వరకు వడ్డీ ఇస్తోంది.
- సుందరం హోమ్ ఫైనాన్స్: 4 నుంచి 5 ఏళ్ల కాలానికి 7.15% వడ్డీ లభిస్తుంది.
- PNB హౌసింగ్ ఫైనాన్స్: 3 నుంచి 5 ఏళ్ల కాలానికి 6.90% వడ్డీ అందిస్తోంది.
- LIC హౌసింగ్ ఫైనాన్స్: 5 ఏళ్ల కాలపరిమితికి 6.90% వడ్డీ ఇస్తోంది.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక లాభాలు
వృద్ధుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కంపెనీలు సాధారణ వడ్డీ రేట్ల కంటే అదనంగా (Additional Interest) లాభాలను అందిస్తాయి.
- శ్రీరామ్ ఫైనాన్స్: సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 0.50% అదనపు వడ్డీ ఇస్తోంది.
- మణిపాల్, ముత్తూట్: వీరు వృద్ధులకు 0.25% వరకు ఎక్కువ లాభాన్ని అందిస్తున్నారు.
- మహీంద్రా & సుందరం ఫైనాన్స్: ఇక్కడ వృద్ధులకు 0.20% నుండి 0.50% వరకు అదనపు వడ్డీ లభిస్తుంది.
ఇన్వెస్ట్ చేసే ముందు ఇది గమనించండి!
కార్పొరేట్ ఎఫ్‌డీలలో వడ్డీ రేట్లు (FD rates) ఎక్కువగా ఉన్నప్పటికీ, పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీకి ఉన్న 'క్రెడిట్ రేటింగ్' (CRISIL, ICRA వంటివి) తప్పకుండా చూసుకోవాలి. రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే మీ డబ్బు అంత సురక్షితంగా ఉన్నట్లు లెక్క. ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని తెలియని కంపెనీల్లో పెట్టుబడి పెట్టకుండా, పైన పేర్కొన్న విధంగా మంచి పేరున్న సంస్థలను ఎంచుకోవడం ఉత్తమం. మీ పెట్టుబడిని వివిధ కంపెనీల్లో విభజించి డిపాజిట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకుని ఎక్కువ లాభాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications