స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అంటే రిస్క్‌తో కూడిన విషయమని గుర్తించాలి. కానీ కాస్త కలిసి వస్తే మాత్రం రిటర్న్స్ మాత్రం అదిరిపోతాయి. రిస్క్ భయంతోనే చాలామంది స్టాక్స్‌లో పెట్టుబడిపై వాయిదా వేస్తూ వస్తుంటారు. వాస్తవ రూపం దాల్చడానికి చాలామందికి సమయం పడుతుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే కొత్తవారు పలు అంశాలు గుర్తు పెట్టుకోవాలి. బిగినర్స్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

స్టాక్ పెట్టుబడుల వైపు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్భణ భయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఈ మధ్య భారీగా కుదుపుకు గురవుతున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత క్రమంగా పుంజుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ బిగినర్స్ కోసం సూచనలు చేసేందుకు పలు ఆన్ లైన్ పోర్టల్స్ ఉన్నాయి.
అయినప్పటికీ కొత్తవారికి ఇవి అర్థం కావడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టానికి చాలా దూరంలో ఉన్నాయి. పరిస్థితి సద్దుమణిగిన నేపథ్యంలో సూచీలు మున్ముందు ముందుకు వెళ్లే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు.

కాలపరిమితి
పెట్టుబడి పెట్టడానికి ముందు పెట్టుబడి కాలపరిమితి, పెట్టుబడి వ్యూహాలు, కంపెనీ పటిష్టత-హిస్టరీ, వాటాల తీరు, కంపెనీ మార్కెట్ వ్యాల్యూ, ఆదాయ వృద్ధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
- పెట్టుబడి కాలపరిమితి విషయానికి వస్తే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ ఉంటాయి.
- పెట్టుబడి వ్యూహాల విషయానికి వస్తే వ్యాల్యూ ఇన్వెస్టింగ్, గ్రోత్ ఇన్వెస్టింగ్, ఇన్‌కం ఇన్వెస్టింగ్ అంశాలు ఉంటాయి.
- ఇక ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ కంపెనీ హిస్టరీ చూడాలి. గత కొన్నాళ్ల పని తీరును చూసుకోవాలి. పోటీ కంపెనీలతో పోలిస్తే ఎలా ఉందో చూడాలి.
- కంపెనీలో వివిధ వర్గాల మధ్య వాటా పంపిణీని చూడాలి.
- తక్కువ నష్టం, ఎక్కువ రాబడి ఇచ్చే కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి పెడతాయి. వీటిని సురక్షితమైన స్టాక్స్‌గా పరిగణించవచ్చు.

డివిడెండ్ చెల్లింపు
కంపెనీలు వాటాదారులకు డివిడెండ్ చెల్లిస్తాయి. గత కొన్నేళ్లలో కంపెనీ తమ షేర్ హోల్డర్లకు ఎంత మొత్తం డివిడెండ్ రూపంలో ఇచ్చాయో చూడాలి. ఏటా ఆదాయం కోసం ఇన్వెస్ట్ చేసేవారు డివిడెండ్ అధికంగా చెల్లించే కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలి.
- ఆదాయం, లాభాల్లో ప్రతి సంవత్సరం వృద్ధి కనిపిస్తే ఆ స్టాక్స్‌ను పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని కంపెనీల స్టాక్స్ నిత్యం ఊగిసలాటలో ఉన్నాయి. వీటిని సునిశితంగా పరిశీలించాలి. రిస్క్ వద్దనకుుంటే తక్కువ ఊగిసలాట కలిగిన స్టాక్స్‌ను ఎంచుకోవాలి.


Click it and Unblock the Notifications