For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి మాయలో పడవద్దు, క్రెడిట్ కార్డు వినియోగానికి 7 టిప్స్: ఇవి తెలుసుకోండి

|

చెల్లింపులకు అత్యంత అనుకూల మార్గాల్లో క్రెడిట్ కార్డ్ ఒకటి. క్రెడిట్ కార్డు వినియోగం సక్రమంగా ఉంటే సమస్యనే ఉండదు. క్రెడిట్ కార్డును సరిగ్గా వినియోగిస్తే వడ్డీ లేని రుణం, రివార్డ్స్‌తో పాటు పలు ప్రయోజనాలు ఉంటాయి. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ గణాంకాల మేరకు గత ఎనిమిదేళ్లలో క్రెడిట్ కార్డుల సంఖ్య మూడింతలు పెరిగి 6.2 కోట్లకు చేరుకుంది. నెలవారీ ట్రాన్సాక్షన్స్ 4.7 రెట్లు పెరిగాయి. క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్న వారి సంఖ్య, ఖర్చు చేస్తున్న నగదు కూడా పెరుగుతోంది. దీనిని తెలివిగా వినియోగిస్తే ప్రయోజనాలు. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగించడానికి పలు టిప్స్ తెలుసుకోండి....

బిల్లింగ్ సైకిల్

బిల్లింగ్ సైకిల్

ప్రతి క్రెడిట్ కార్డుకు దాని సొంత బిల్ సైకిల్ ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు బిల్ జనరేషన్ తేదీ మీకు తెలిస్తే కనుక ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్‌ను పెంచుకోవచ్చు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లుపై 45 రోజుల పాటు వడ్డీ రహితంగా ఉంటుంది. కొన్ని సందర్బాల్లో ఎక్కువగా ఉంటుంది. దాదాపు క్రెడిట్ కార్డుకు నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. ఈ బిల్లింగ్ సైకిల్‌లో మీరు తొలి రోజు వాడుకుంటే నాటి నుండి 45 రోజులు వర్తిస్తుంది. ఒకవేళ బిల్లింగ్ సైకిల్‌లో మీరు 30వ రోజు కొనుగోలు చేస్తే తిరిగి చెల్లించడానికి 15 రోజుల సమయం ఉంటుంది.

డ్యూ డేట్‌కు ముందు చెల్లింపు, క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది

డ్యూ డేట్‌కు ముందు చెల్లింపు, క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది

క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నప్పుడు బిల్లును క్రమం తప్పకుండా చెల్లించాలి. మీ బిల్లును సకాలంలో చెల్లిస్తే బ్యాంకుతో మీ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది. దీంతో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. స్పెండింగ్ లిమిట్స్, పర్సనల్ లోన్స్ పైన మంచి ఆఫర్లు, ఇతర ఆర్థిక ఉత్పత్తులపై ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దీని ద్వారా ప్రయోజనం ఉంటుంది.

బెనిఫిట్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్

బెనిఫిట్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్

మీ క్రెడిట్ కార్డ్ బుక్‌లెట్‌ను పూర్తిగా చదవాలి. ముఖ్యంగా బెనిఫిట్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్ గురించి చూడాలి. మీ క్రెడిట్ కార్డు విమానాశ్రయాల్లో ఉచిత లాంజ్ యాక్సెస్, ప్రాధాన్యత సేవలు వంటివి అందిస్తుంది. వివిధ ఉత్పత్తులపై, సేవలపై తగ్గింపు ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్స్ రివార్డు పాయింట్ల ద్వారా దీర్ఘకాలంలో ఉచిత ఫ్లైట్ టిక్కెట్ నుండి మూవీ వోచర్స్ వరకు ఎన్నో మెగా డిస్కౌంట్స్ పొందవచ్చు.

నగదు విత్ డ్రా పరిమితి

నగదు విత్ డ్రా పరిమితి

క్రెడిట్ కార్డు పరిమితిలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. చాలామంది ఈ కార్డ్ డెబిట్/ఏటీఎం కార్డు వలె వినియోగిస్తారు. అయితే, అత్యవసరమైతే తప్ప నగదు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే నగదు తీసుకున్న తర్వాత రోజు నుండి వడ్డీ ప్రారంభమవుతుంది. దీనికి బిల్లింగ్ సైకిల్ ఉండదు. కాబట్టి నగదును వీలైనంతగా తీసుకోవాలి.

సానుకూల మార్గాలు

సానుకూల మార్గాలు

మీ క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేందుకు మీ బ్యాంకు ఈఎంఐ వంటి సానుకూల మార్గాలను అందించవచ్చు. దీనిని ఉపయోగించుకుంటే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చు.

ఆన్ లైన్ ద్వారా షాపింగ్ చేస్తే లేదా స్థానిక దుకాణాల్లో షాపింగ్ చేస్తే పూర్తి విశ్వాసం ఉన్న వారిని ఎంచుకోండి. అప్పుడు కార్డు దుర్వినియోగ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి తెలుసుకోండి

ఇవి తెలుసుకోండి

చాలామంది క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో ఎలాంటి ఛార్జీలు వర్తిస్తాయో తెలుసుకోరు. కంపెనీ ఏజెంట్స్ చెప్పింది మాత్రమే వింటారు. ఏయే ఛార్జీలు, ఎంత మొత్తంలో వర్తిస్తాయో తెలుసుకోవాలి. బిల్లింగ్ సైకిల్ అయ్యాక పడే వడ్డీ రేటు ఎంతో చాలామందికి తెలియదు. అలాగే విదేశీ కరెన్సీలో కొనుగోళ్లు చేసేటప్పుడు అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. ఇలాంటివి అడిగి తెలుసుకోవాలి. అలాగే కార్డును బట్టి వడ్డీ రేటు మారుతుంది. కొన్ని ప్రీమియం కార్డుల్లో వడ్డీరేటు తక్కువ ఉంటుంది. కానీ, నిర్ణీత గడువులో ఇంత మొత్తం ఖర్చు చేస్తేనే తక్కువ వడ్డీరేటు వర్తిస్తుందనే షరతులు ఉంటాయి. వీటిని గురించి తెలుసుకోవాలి.

ఈ సందేశాలకు దూరంగా ఉండండి

ఈ సందేశాలకు దూరంగా ఉండండి

మీరు చెల్లించాల్సిన మొత్తంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని సందేశాలు వస్తుంటాయి. దానిని చూసి ఆకర్షితులు కావొద్దు. ఎందుకంటే మీరు తర్వాత బిల్లింగ్ సైకిల్‌లో చేసే తొలి కొనుగోలు నుండి బాకీ ఉన్న మొత్తానికి వడ్డీ పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రెడిట్ కార్డు వాడకంపై వివేకంతో ఉండాలి. ప్రతి నెల మీ క్రెడిట్ పరిమితిని పెంచడం సరికాదు.

English summary

అలాంటి మాయలో పడవద్దు, క్రెడిట్ కార్డు వినియోగానికి 7 టిప్స్: ఇవి తెలుసుకోండి | Tips on how to use credit card wisely

A Credit Card is one of the most convenient ways to pay. Tips will show you how to use your Credit Card for maximum benefit.
Story first published: Sunday, July 18, 2021, 13:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X