స్టాక్ మార్కెట్లు మందకోడిగా ఉన్నాయి. గతవారం సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభాల్లో మాత్రమే ముగిసింది. అయితే సూచీలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకడంతో పాటు ప్రస్తుతం ఈ సమీపానికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నప్పటికీ మార్కెట్ నిపుణులు, సంస్థలు కొన్ని స్టాక్స్‌ను రికమండ్ చేస్తాయి. తాజాగా ప్రముఖ బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్ KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్(KEC)ని రికమండ్ చేసింది. ఈ స్టాక్ ఏడాదిలో 23.3 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చునని తెలిపింది. అలాగే, మెట్రోపాలిస్ హెల్త్ కేర్ ఏడాది కాలంలో 18 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునని చెబుతోంది.

కేఈసీ టార్గెట్ ధర
KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్ ధర ప్రస్తుతం రూ.463 వద్ద ఉంది. షేర్ ఖాన్ టార్గెట్ ధర రూ.565. అంటే ఏడాదిలో ఈ స్టాక్ 23.30 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునని అంచనా వేస్తోంది. Q2FY2022లో KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్ మంచి ఫలితాలు నమోదు చేసింది. రైటాఫ్ కారణంగా ఓపీఎం నెట్ ప్రాఫిట్ పైన ప్రభావం పడింది. అంతర్జాతీయ ఆర్డర్స్‌లో మెరుగైన విజిబులిటీ కారణంగా బిడ్ పైప్ లైన్ బిజినెస్ రూ.60,000 నుండి రూ.65,000 కోట్లతో మెరుగ్గా ఉంది. షేర్ ఖాన్ ప్రకారం బలమైన ఆర్డర్ బ్యాక్ లాగ్, ఆరోగ్యకరమైన ఆర్డర్ ఇన్-ఫ్లో విజిబులిటీ, ఎగ్జిక్యూషన్ కెపాబులిటీస్, డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్‌ను బట్టి KEC టార్గెట్ ధరను రూ.565కు సవరించినట్లు చెబుతోంది.
KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్.. ఆర్పీజీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ. 1.8 బిలియన్ డాలర్ల ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్ మేజర్. పవర్ ట్రాన్స్-మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వేస్, సివిల్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్, కేబుల్స్ వంటి రంగాల్లో ప్రాజెక్టును డెలివరీ చేస్తుంది.

మెట్రోపాలిస్ హెల్త్ కేర్
మెట్రోపాలిస్ హెల్త్ కేర్ ఏడాదిలో 18 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునని షేర్ ఖాన్ అంచనా వేస్తోంది. మెట్రోపాలిసిస్ హెల్త్ కేర్ ప్రస్తుత ధర ప్రస్తుతం రూ.3299 వద్ద ఉంది. టార్గెట్ ధరను రూ.3622గా పేర్కొంది. అంటే ఏడాదిలా దాదాపు 18 శాతం రిటర్న్స్. Q2FY22 ఫలితాలు అంచనాలను కాస్త మిస్ అయ్యాయి. రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ.303 కోట్లుగా నమోదయింది. నాన్-కోవిడ్ రెవెన్యూ 38 శాతం పెరిగి రూ.260 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో టెస్ట్‌లు 29 శాతం పెరిగాయి. కంపెనీ బిజినెస్ టు కన్స్యూమర్(B2C) పైన దృష్టి సారించిందని షేర్ ఖాన్ చెబుతోంది.

పెట్టుబడికి ముందు జాగ్రత్త
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. నిపుణుల సలహాలతో పాటు మార్కెట్ పైన, స్టాక్ పైన పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది. పెట్టుబడిదారులు కంపెనీ చరిత్రను చూసుకోవాలి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అన్ని పరిశీలించి ఇన్వెస్ట్ చేయాలి.


Click it and Unblock the Notifications