ఉద్యోగం చేసి ప్రతినెలా వచ్చే జీతంతో ఇల్లంతా గడవాలంటే ఈ కాలంలో సామాన్యుడికి చాల కష్టం. ఎందుకంటే ఇంటి ఖర్చులే కాకుండా ఇతర ఖర్చులు కూడా భరించాలంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పై ఆధారపడాల్సిందే. ఇంకా ద్రవ్యోల్పణం, ప్రతినెలా సేవింగ్స్ ఇలా ఇవన్నీ భారతీయ పేద, మధ్య తరగతి కుటుంబాలకి సవాలే. ఒకోసారి ఎలాంటి పని చేయకుండా డబ్బు వచ్చే మార్గాలను కూడా అన్వేషిస్తుంటారు.
పేదలు, సామాన్యులు, మానసిక స్థితి సరిగ్గా లేని వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారికీ ఆసరాగా ఉండేందుకు కొన్ని పథకాలను తీసుకొచ్చింది. అందులో కేంద్ర ప్రభుత్వ అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలలో పోస్టాఫీస్ మంథ్లి స్కిం(MIS) ఒకటి. ఇది మీకు ప్రతినెలా కొంత ఆదాయాన్ని ఇస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎలా పెట్టుబడి పెట్టాలంటే ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కిం. అంటే ఒకేసారి పెట్టిబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే మీరు పెట్టిన పెట్టుబడి పై ప్రతినెలా వడ్డీ ఆదాయం ఉంటుంది. ఈ ఆదాయం మీరు పెట్టె పెట్టుబడి పై ఆధారపడి ఉంటుంది. వడ్డీ చెల్లించేటప్పుడు అసలు మొత్తం పై ఎలాంటి ప్రభావం ఉండదని గమనించాలి. మీరు ఒక్కసారి ఈ స్కింలో పెట్టుబడి పెడితే మీకు 5 ఏళ్ల పాటు ప్రతీనెల వడ్డీ వస్తుంది. ఎందుకంటే MIS మెచ్యూరిటీ కల వ్యవధి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల తరువాత వడ్డీ ఆదాయాన్ని సంపాదించడం ద్వారా అసలు మొత్తం విత్ డ్రా చేసికోవచ్చు.

MIS స్కిం వడ్డీ రేట్లు: ఈ మంథ్లి ఇన్కమ్ స్కిం వడ్డీ రేట్లు ప్రస్తుతం 7.4 శాతం వడ్డీని అందిస్తున్నాయి. వడ్డీ ఆదాయం మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో జమ చేయబడతాయి. గమనించవల్సిన విషయం ఏంటంటే మీరు పెట్టుబడి పెట్టె మొత్తం పైన మీ వడ్డీ ఆదాయం ఉంటుంది. మీరు ఎక్కువ ఆదాయం పొందాలంటే కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
మీరు MIS అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ. 1000తో అకౌంట్ ఓపెన్ చేయావచ్చు. అలాగే గరిష్టంగా 9 లక్షల వరకు ఇందులో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మానసిక స్థితి సరిగ్గాలేని వారు, మైనర్లు లేదా 10 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారి తరుపున గార్డియన్లు ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుండి సరిగ్గా నెల రోజుల తరువాత వడ్డీ అనేది మీ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది. అయితే ఎవరైనా డబ్బు కావాలనుకుంటే ముందుగానే అకౌంట్ మూసివేయవచ్చు. కానీ అలా చేస్తే పెనాల్టీ అసలు మొత్తం నుండి కట్ చేయబడుతుంది. అంతేకాదు పెట్టుబడిదారుడి వడ్డీ ఆదాయం టాక్స్ పరిధిలోకి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C ప్రకారం పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్‌కు ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు.
మీరు నెలకు 5వేలు పొందాలనంటే మీరు ఈ ఆకౌంట్లో ఎంత పెట్టుబడి పెట్టాలంటే ఒకేసారి మొత్తంగా రూ.8,11,000 డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే 7.4 శాతం వడ్డీ రేటుతో నెలకు మీరు రూ.5,001 పొందుతారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన అసలు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే దీనిపై చెల్లించే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని గుర్తుంచుకోండి. ఒకోసారి వడ్డీ రేటు కూడా మారే అవకాశం ఉండొచ్చు అని గుర్తుంచుకోవాలి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications