మహిళల కోసం స్పెషల్ పాలసీ.. ఇప్పుడు ఆ వ్యాధులకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్..
ఇన్సూరెన్స్ పాలసీలలో మీరు చాలా రకాల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ఇన్సూరెన్స్ పాలసీ మార్కెట్లోకి వచ్చింది, ఈ పాలసి మహిళల సంబంధిత కొన్ని వ్యాధులను కవర్ చేస్తుంది. ఇన్సూరెన్స్ మార్కెట్లో ఇలాంటి పాలసీ తీసుకొచ్చిన మొదటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇదే. 'ఐసిఐసిఐ ప్రూ విష్' పేరుతో వస్తున్న ఈ ప్రత్యేకమైన పాలసీని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అండ్ ఆర్‌జిఎ రెండు కలిసి తాజాగా ప్రవేశపెట్టాయి. ఈ పాలసీని ముఖ్యంగా మహిళల సంబంధిత తీవ్రమైన వ్యాధులు ఇంకా సర్జరీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ వ్యాధులపై 100% వరకు ఇన్స్టంట్ పేమెంట్
ఐసిఐసిఐ ప్రూ విష్ ఇన్సూరెన్స్ పాలసీ రొమ్ము, గర్భాశయ సంబంధిత, గర్భాశయ క్యాన్సర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధుల పై 100 శాతం వరకు హెల్త్ కవరేజీని వెంటనే అందిస్తుంది. ఇది మాత్రమే కాదు సాధారణంగా ఇలాంటి పాలసీలో పేమెంట్ రీయింబర్స్‌మెంట్ రూపంలో ఉంటుంది, అయితే ఈ పాలసీ కింద కేటాయించిన మొత్తం మాత్రమే అందిస్తారు.

30 సంవత్సరాల పాటు ప్రీమియం గ్యారెంటీ
ఐసిఐసిఐ ప్రూ విష్ పాలసీ 30 సంవత్సరాలకి ప్రీమియం గ్యారెంటీ ద్వారా కస్టమర్‌లు ప్రీమియం పేమెంట్లను కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పాలసీ కస్టమర్లకు ప్రీమియం పేమెంట్ వ్యవధిలో ఎప్పుడైనా 12 నెలల ప్రీమియం హాలిడే కూడా అందిస్తుంది. ఈ పాలసీ కస్టమర్లకు డెలివరీ సమస్యలు, అప్పుడే పుట్టిన శిశువుకి పుట్టుకతో వచ్చే వ్యాధులను కవర్ చేసే అప్షన్ కూడా అందిస్తుంది.ఈ పాలసీ మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య ప్రమాదాల కారణంగా వారికి కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి రిలీఫ్ అందిస్తుంది.
మహిళల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి
ఐసిఐసిఐ ప్రు విష్ పాలసీని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా అన్నారు. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో మహిళల కొన్ని ఆరోగ్య సమస్యలను కవర్ చేసే మొదటి పాలసీ ఇది. ఈ సందర్భంగా రీఇన్స్యూరెన్స్ గ్రూప్ ఆఫ్ అమెరికా ఇండియా సీఈఓ సునీల్ శర్మ మాట్లాడుతూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సహకారంతో ఈ పాలసీ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ ప్రోడక్ట్ భారతీయ మహిళల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించారు.


Click it and Unblock the Notifications