2022 జనవరి 1వ తేదీ నుండి IPPB కస్టమర్లకు అలర్ట్. ఇక నుండి క్యాష్ డిపాజిట్స్, నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జ్ చేస్తారు., ఇండియా పోస్డ్ పేమెంట్స్ బ్యాంకు(IPPB) తమ కస్టమర్లకు తాజాగా నిరాశపరిచే వార్తను తీసుకు వచ్చింది. వచ్చే నెల నుండి రూ.10,000 నగదు ఉపసంహరణ లేదా అంతే మొత్తం నగదు డిపాజిట్ పైన ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. IPPBలో మూడు విధాల సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. 1. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, 2. సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ (other than Basic SA), 3. సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ (other than Basic SA).
01 జనవరి 2022 నుండి క్యాష్ డిపాజిట్స్, నగదు ఉపసంహరణ పైన IPPB కొత్త ఛార్జీలు వర్తిస్తాయని కస్టమర్లకు తెలిపింది. జనవరి 1 నుండి వర్తించే ఛార్జీ ఇలా ఉంది..

- బేసిక్ సేవింగ్స్ అకౌంట్ - నగదు ఉపసంహరణ - నెలకు 4 ట్రాన్సాక్షన్స్ వరకు ఉచితం - ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితి తర్వాత తీసిన మొత్తాన్ని బట్టి ప్రతి ట్రాన్సాక్షన్‌కు కనీసం రూ.25 లేదా 0.50 శాతం.
- బేసింక్ సేవింగ్స్ అకౌంట్ - నగదు డిపాజడిట్ - ఉచితం
- సేవింగ్స్ (other than Basic SA) & కరెంట్ అకౌంట్స్ - నగదు ఉపసంహరణ - నెలకు రూ.25,000 వరకు ఉచితం - ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితి తర్వాత తీసిన మొత్తాన్ని బట్టి కనీసం రూ.25 లేదా 0.50 శాతం.
- సేవింగ్స్(other than Basic SA) & కరెంట్ అకౌంట్స్ - క్యాష్ డిపాజిట్ - నెలకు రూ.10,000 వరకు ఉచితం - ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితి తర్వాత తీసిన మొత్తాన్ని బట్టి కనీసం రూ.25 లేదా 0.50 శాతం.
- జీఎస్టీ, సెస్ కాకుండానే పై ఛార్జీ ఉంటోంది.


Click it and Unblock the Notifications