రాష్ట్ర రహదారులు (State Highways), జాతీయ రహదారులు (National Highways), ఎక్స్‌ప్రెస్‌వేల (Expressways) పక్కన స్థలాలు కొనడం చాలామందికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి ప్రదేశాలు మంచి కనెక్టివిటీతో ఉంటాయి, భవిష్యత్తులో విలువ పెరగే అవకాశముంటుంది. కానీ, ఇలా పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని కీలక అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి.

1. హైవే ఎత్తు (Highway Height)
హైవే మీ స్థలంతో పోలిస్తే చాలా ఎత్తులో ఉంటే, వర్షం వచ్చినప్పుడు రోడ్డుపై నుంచి నీరు మీ స్థలంలోకి వచ్చే అవకాశముంటుంది. అలా అయితే నీరు నిల్వ అయ్యే సమస్యలు వస్తాయి. వర్షంలో నీరు ఇళ్లలోకి చేరే అవకాశం కూడా ఉంటుంది. అందుకే స్థలం కొనేటప్పుడు అది హైవే కన్నా తక్కువ లోతులో ఉందా లేదా అనే విషయం తప్పకుండా చెక్ చేయాలి.
2. ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు (Entry-Exit Points)
హైవేలు ప్రత్యేకమైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో డిజైన్ అవుతున్నాయి. దీని వల్ల మీరు ఎక్కడైనా హైవేలోకి ఎక్కలేరు. మీ స్థలానికి సమీపంలో ఎంట్రీ లేదా ఎగ్జిట్ పాయింట్ ఉందా? ఉంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండొచ్చు. ఇది కమర్షియల్ గా అయితే బాగుంటుంది, ఎందుకంటే కస్టమర్లు సులభంగా ఆ ప్రదేశానికి వచ్చేయగలరు. కానీ రెసిడెన్షియల్ గా ఇంటి కోసం చూస్తున్నవారికి ఇది సరిపోకపోవచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో శబ్దం, కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.
3. మాస్టర్ ప్లాన్ పరిశీలన (Master Plan Review)
స్థలం కొనుగోలు చేసే ముందు సంబంధిత నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించాలి. దీనిలో భవిష్యత్తులో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో చూపిస్తారు. నివాస ప్రదేశాలా? కమర్షియల్ ప్రదేశాలా? పారిశ్రామిక ప్రాజెక్టులా? ఒక పెద్ద డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మీ స్థలం దగ్గర వస్తే, అది భవిష్యత్తులో విలువ పెరగడానికి సహాయపడుతుంది. అలా చూసుకుని పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం.
4. కనెక్టివిటీ:
మీ స్థలం నుండి ప్రధాన ప్రాంతాలకు వెళ్లే రవాణా సౌకర్యాలు ఉన్నాయా? ఉంటె ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల ప్రాంతాలతో అనుసంధానం ఉన్న ప్రదేశాలలో స్థలాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి" అని ఓ రియల్ ఎస్టేట్ నిపుణుడు చెబుతున్నారు. కనెక్టివిటీ ఉన్న స్థలాలు భవిష్యత్తులో డిమాండ్‌కు గురవుతాయి.
5. సర్వీస్ రోడ్ సదుపాయం:
హైవే పక్కన సర్వీస్ రోడ్ ఉందా? అయితే అది మంచి లక్షణం. సర్వీస్ రోడ్ వల్ల హైవే నుండి మీ స్థలానికి నేరుగా వెళ్లే సౌలభ్యం ఉంటుంది. ఇది రవాణాకు అనుకూలంగా ఉంటే కాకుండా, భద్రత పరంగా కూడా మెరుగ్గా ఉంటుంది. జాతీయ రహదారుల పక్కన ఉండే ప్రాపర్టీలు రాష్ట్ర రహదారుల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఫ్లోను అనుభవిస్తాయి, అందువల్ల వారి విలువ కూడా ఎక్కువగా ఉంటుంది.
హైవే పక్కన స్థలం కొనడం తెలివైన పెట్టుబడి కావచ్చు. కానీ ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారితీయొచ్చు. పై అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని, స్థలాన్ని పరిశీలించి, మాస్టర్ ప్లాన్ చదివి, రవాణా సౌకర్యాలు గుర్తించి, అప్పుడు మాత్రమే కొనుగోలు చేయండి. అలా చేస్తే మీ పెట్టుబడికి మంచి రాబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
More From GoodReturns

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications