మధ్యతరగతి కుటుంబాలకు హోమ్ లోన్ ఎందుకు స్మార్ట్ ఎంపిక? ధనవంతుల రహస్యాన్ని తెలుసుకోండి...

భారతదేశంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకి "ఇల్లు" అంటే ఒక పెద్ద కల. ఇల్లు కొంటే అది జీవితాంతం పెట్టుబడి అవుతుందని నమ్మకం కూడా బలంగా ఉంటుంది. కానీ చాలా మందికి హోమ్ లోన్ EMIలు పెద్ద బరువుగా అనిపిస్తాయి. నెల నెలా వచ్చే ఈ బాద్యత వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందనే భయం ఉంటుంది. అందుకే చాలామంది ఇల్లు కావాలనే కోరిక ఉన్నా, లోన్ తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. డబ్బు ఉన్నప్పుడు నేరుగా ఇల్లు కొనేస్తే బెటర్ కదా? లోన్ ఎందుకు? అని అనుకుంటారు.

కానీ ఆశ్చర్యం ఏమిటంటే... పెద్ద వ్యాపారవేత్తలు, ధనవంతులు కూడా చాలా సార్లు హోమ్ లోన్‌నే తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు. దానికి ఒక సింపుల్ కారణం హోమ్ లోన్ అనేది కేవలం ఇల్లు కొనడానికి మాత్రమే కాదు అది ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టూల్ కూడా.

Thinking EMI is a Burden Here s Why a Home Loan is a Smart Financial Move

ఇప్పుడు హోమ్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే 6 ముఖ్యమైన లాభాలను చూద్దాం

1. హోమ్ లోన్ తీసుకుంటే పన్నులో మంచి సేవింగ్ సాధ్యమవుతుంది. హోమ్ లోన్ వడ్డీ పై Section 24(b) ప్రకారం సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు డిడక్షన్ తీసుకోవచ్చు. అలాగే ప్రిన్సిపల్ లోన్ మొత్తం పై Section 80C ప్రకారం రూ. 1.5 లక్షల వరకు డిడక్షన్ పొందవచ్చు. జాయింట్ లోన్ తీసుకుంటే, ఇద్దరూ కలిపి సుమారు రూ. 7 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఆర్థిక లాభం. అందుకే చాలామంది హోమ్ లోన్ తీసుకుని తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడం ఇష్టపడతారు.

2. ఇల్లు కొనేటప్పుడు చాలామందికి టైటిల్ లేదా లీగల్ రికార్డ్స్ సరిగా చూసుకోరు. కానీ బ్యాంకులు హోమ్ లోన్ ఇచ్చే ముందు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా చెక్ చేస్తాయి. టైటిల్, పాత రికార్డులు, ఏమైనా వివాదాలు ఉన్నాయా లేరా అన్నీ వారు వేరీఫై చేస్తారు. దీంతో మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు లీగల్‌గా సేఫ్ అని ధైర్యంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యాంకు వెరిఫికేషన్ ఒక రకంగా లీగల్ గ్యారంటీని అందిస్తుంది.

3. మీ హోమ్ లోన్‌లో కో-అప్లికెంట్‌గా మహిళ ఉండటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది బ్యాంకులు, కో-అప్లికెంట్ మహిళ అయితే 0.05% తక్కువ వడ్డీ రేటు ఇస్తాయి. ఈ చిన్న తేడా కూడా మొత్తం లోన్ కాలంలో పెద్ద మొత్తంలో సేవింగ్‌గా మారుతుంది. అందుకే అనేక కుటుంబాలు మహిళ పేరు కూడా లోన్‌లో జోడించడం ద్వారా వడ్డీ రేటు తగ్గింపు మరియు ఆర్థిక లాభాన్ని పొందటానికి ప్రాధాన్యం ఇస్తారు.

4. హోమ్ లోన్‌లు ఇతర లోన్‌ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి, కాబట్టి నెలవారీ EMIలు తక్కువగా ఉంటాయి. చెల్లింపు నిబంధనలు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి, అంటే మీ కష్టానికి తగ్గట్టు EMIలు ఎంచుకోవచ్చు. అలాగే, ముందుగానే లోన్ మొత్తం క్లోజ్ చేయాలనుకుంటే, బ్యాంకులు ఆ అవకాశం కూడా ఇస్తాయి. దీని వల్ల, మీరు మీ పొదుపులను మొత్తం ఖర్చు చేయకుండా, హోమ్ లోన్ ద్వారా సులభంగా ఇల్లు కొనుగోలు చేయవచ్చు మరియు ఆర్థికంగా మరింత సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.

5. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత, అదే లోన్‌పై మీరు టాప్-అప్ లోన్ కూడా పొందవచ్చు. ఇది సాధారణ పర్సనల్ లోన్‌లా ఉంటుందని కానీ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మీరు సెమీ-ఫర్నిష్డ్ లేదా పాత ఫ్లాట్ కొని ఇంటీరియర్ పనులు చేయించుకోవాలంటే రీనోవేషన్ కోసం ఈ టాప్-అప్ లోన్ చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు, రీపేమెంట్ కాలం కూడా మీ హోమ్ లోన్ టెన్యూర్‌కు అనుగుణంగా ఉంటుంది. దీని వల్ల అదనపు ఖర్చులు సులభంగా తక్కువ వడ్డీతో, ఇంతకుముందు మిగిలిన లోన్‌కు జోడిస్తూ పూర్తి చేయవచ్చు. కాబట్టి మీ ఆర్థిక వ్యయాన్ని మరింత సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.

6. ఇల్లు కొనే విషయం కేవలం ఖర్చు తగ్గించడం మాత్రమే కాదు, ఇది ఒక లాంగ్-టర్మ్ పెట్టుబడి కూడా. భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ళ విలువ సాధారణంగా సమయం గడిచే కొద్దీ పెరుగుతుంది. దీని వల్ల, మీరు అవసరమైతే ఇల్లు అమ్మి లాభం పొందవచ్చు లేదా అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయం పొందవచ్చు. ఇలా, మీ ఇంటి విలువ పెరుగుదల ద్వారా ఆర్థిక ప్రయోజనం కూడా వస్తుంది.

హోమ్ లోన్ అంటే చాలా మంది భారం అనుకుంటారు కానీ నిజానికి ఇది ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ నిర్ణయం. టాక్స్ సేవింగ్, లీగల్ సెక్యూరిటీ, సౌకర్యవంతమైన పేమెంట్స్, అదనపు లోన్ ఆప్షన్స్ ఇవన్నీ హోమ్ లోన్ తీసుకోవడం వల్ల లభించే ప్రధాన లాభాలు. అందుకే ధనవంతులు కూడా తరచుగా హోమ్ లోన్ తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. మీరు కూడా ఈ ప్రయోజనాలను అర్థం చేసుకుని ప్లాన్ చేస్తే, ఇల్లు కొనడం ఆర్థికంగా కూడా చాలా స్మార్ట్ నిర్ణయం అవుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+