దేశీయంగా కరోనా ఉధృతి, కేసులు తగ్గడంతో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఈ ప్రభావం ఈక్విటీ, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ సహా ఇతర మార్కెట్లపై ఉండనుంది. ఇప్పటికే మార్కెట్లు గతవారం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గాయి. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ మంచి లాభాల్లో ముగిశాయి. కంపెనీల ఆకర్షణీయ క్వార్టర్ ఫలితాలు, రికవరీ సంకేతాలు, సానుకూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌కు సానుకూలం కానున్నాయి.

గతవారం అలా..
కరోనా థర్డ్ వేవ్ పైన ఆందోళనలు, అధిక ద్రవ్యోల్బణం, ఫెడ్ నిర్ణయాలు మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. మే నెలలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 12.94 శాతం, రిటైల్ ద్రవ్యోల్బణం 6.3 శాతానికి పెరిగింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ అంచనాల కంటే వేగంగా రేట్ల పెంపుకు సంకేతాలు ఇవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. బ్యారెల్ ముడిచమురు ధర 1.3 శాతం పెరిగి 73 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా జపాన్ ఎగుమతులు 1980 తర్వాత అత్యంత వేగంగా వృద్ధి సాధించాయి. చైనా పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 8.8 శాతం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో గతవారం సెన్సెక్స్ 0.2 శాతం లాభపడి 52,344 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.7 శాతం ఎగిసి 15,683 పాయింట్ల క్లోజ్ అయింది. FIIలు నికరంగా రూ.1061 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, DIIలు రూ.488 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. జూన్ నెలలో ఇప్పటి వరకు FPIs నికరంగా రూ.13,667 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

53,000 దాటేనా?
ఈ వారం స్వల్పకాలంలో సెన్సెక్స్ 51,180 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించే అవకాశముందని, ఈ మార్క్ దిగువకు వస్తే మరింత బలహీనపడవచ్చునని అంటున్నారు. మద్దతుస్థాయి 51,1850 వద్ద, నిరోధకస్థాయి 52,820. ఈ వారం మార్కెట్లు పెరిగితే 53వేలు క్రాస్ చేసినా చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.

బంగారం, వెండి ధరలు
ఈ వారం పసిడి ధరలు స్థిరంగా లేదా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. రూ.48,800 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.45,700 లక్ష్యంతో రూ.48,150 దిగువన షార్ట్ సేల్ చేయవచ్చునని అంటున్నారు. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68,600 దిగువకు వస్తే రూ.67వేల స్థాయికి పడిపోవచ్చునని, లేదంటే రూ.70వేలు క్రాస్ చేయవచ్చునని అంచనా.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications